వాళ్ళిద్దరూ అడ్డంగా దొరికిపోయారు...
posted on Nov 15, 2014 2:19PM

ఆయన పేరు స్వామి. కరీంనగర్ జిల్లాలో సీఐగా పనిచేస్తున్నాడు. ఆమె వరంగల్ జిల్లాలో ఎస్.ఐ.గా పనిచేస్తోంది. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ‘స్నేహం’ వుంది. ఇద్దరికీ పెళ్ళి కూడా అయింది. అయితే పెళ్ళయింది ఈ ఇద్దరికీ కలిపి కాదు. అతనికి వేరే మహిళతో, ఆమెకు మరో వ్యక్తితో పెళ్ళి అయింది. అయితే పెళ్ళి అయినా తమ ‘స్నేహాన్ని’ వారిద్దరూ కొనసాగిస్తున్నారు. ఆ సీఐ, ఎస్ఐ హైదరాబాద్ అసెంబ్లీలో డ్యూటీ నిమిత్తం హైదరాబాద్‌కి వచ్చారు. డిపార్ట్‌మెంట్ తరఫున ఆయనకి లకడీకాఫూల్‌లోని ద్వారక హోటల్లో రూమ్ కేటాయించారు. అయితే ఆయన అక్కడ కాకుండా బృందావనం హోటల్లో దిగారు. విషయం ఏమిటంటే, ఆ హోటల్లోనే తన స్నేహితురాలు ఎస్.ఐ. మేడమ్ కూడా విడిది చేశారు. ఇదిలా వుంటే, సదరు ఎస్ఐ భర్త సునీల్‌కి తన భార్య మీద ఎప్పటినుంచో అనుమానం. దాంతో ఆయన శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులను తీసుకుని మరీ వచ్చి సీఐ రూమ్ తలుపు తట్టాడు. ఆ గదిలోంచి సీఐ, ఎస్ఐ బయటకి వచ్చారు. వాళ్ళిద్దరూ ఆ సమయంలో ఒకే రూమ్‌లో ఎందుకున్నారో విజ్ఞులైనవారే ఆలోచించుకోవాలి. దాంతో పోలీసులు ఆ ఇద్దరి మీదా కేసు నమోదు చేశారు. ఇద్దర్నీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. వీళ్ళిద్దరి వ్యవహారం గురించి పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.