చిరంజీవివీ స్వార్థ రాజకీయాలు: వైయస్ జగన్
posted on May 1, 2012 12:05PM
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా చిరంజీవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం తిరుపతిలోని తిమ్మనాయుడుపాలెంలో పర్యటించారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు చిరంజీవి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. చిరంజీవి శానససభ్యుడిగా ఎన్నికైన తర్వాత తిరుపతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు కాలేదని ఆయన అన్నారు. త్వరలో సువర్ణ యుగం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేసి తిరుపతి ప్రజలకు మంచినీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనది పేదకులమని అన్నారు. చిరంజీవి పిఆర్పీని హోల్ సేల్‌గా కాంగ్రెసుకు అమ్మేశారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.