పార్టీ ఆదేశిస్తే నేను రెడీ: బాలకృష్ణ

Actor balakrishna, balakrishna TDP, TDP  AP By polls, Balakrishna AP By pollsనందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు ఆదేశిస్తే ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో ఉప ఎన్నికల ప్రచారానికి బాలకృష్ణ రెడీ అంటున్నారు. ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆయన చెప్పారు. పార్టీ ప్రచారం చేయమని ఆదేశిస్తే ఆయా నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై వ్యాఖ్యానించేందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు నో పాలిటిక్స్ అంటూ విముఖత వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu