ఒప్పో తిప్పలు చూస్తే… చైనా మనతో వారెందుకు చేయదో అర్థమవుతుంది!

 

ఇండియా, చైనాల మధ్య యుద్ధం వస్తుందా? ఏమో చెప్పలేం. తప్పకపోవచ్చనే కొందరంటున్నారు. కొందరు మాత్రం చైనా అంత దుస్సాహసం చేయదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా చైనాను నమ్మటానికి అస్సలు వీలులేదు! అయితే, చైనాతో భారత ఆర్మీ ఇంకా పూర్తి స్థాయిలో వార్ కి దిగలేదు కాని… కామన్ ఇండియన్స్ అప్పుడే యుద్ధం మొదలు పెట్టారు! చైనా మీద ఇండియన్స్ కి రోజురోజుకి పెరుగుతోన్న వ్యతిరేకతకి స్సష్టమైన సంకేతం… పాపం ఒప్పో కంపెనీకి తెలిసి వచ్చింది!

 

ఒప్పో స్మార్ట్ పోన్ల కంపెనీ ప్రస్తుతం ఇండియాలో జోరుగా బిజినెస్ చేస్తోంది. సెల్ఫీ ఎక్స్ పర్ట్ అంటూ సెల్స్ పెంచుకుంటోంది. అయితే, ఈ మధ్య ఆ సంస్థ పంజాబ్ విభాగంలో కలకలం రేగింది. అరుణ్ శర్మ అనే భారతీయ ఉద్యోగిని చైనా అధికారి దురుసుగా తిట్టాడట. అక్కడితో ఆగకుండా ఇండియాన్స్ అంతా అడుక్కునే వారని నోటికొచ్చినట్టు మాట్లాడట! ఈ విషయం మొత్తం లెటర్ రూపంలో అరుణ్ శర్మ మీడియాకు అందించాడు. అది మీడియా నుంచి సోషల్ మీడియాకు పాకింది! ఫలితంగా ఒప్పో కంపెనీలోని చైనీస్ అధికారులపై జనం తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు! అంతే కాదు, సిక్కింలో మన భూభాగంలోకి రావాలని చూస్తోన్న చైనాపై ఆల్రెడీ వున్న కోపం ఒప్పో బ్రాండ్ పై చూపారు! అమాంతం ఆ సెల్ ఫోన్ల సేల్స్ పడిపోవటం మొదలుపెట్టాయట!

 

ఒప్పో కంపెనీ తన సేల్స్ నేల చూపులు చూడటం గ్రహించి టెన్షన్ అయిపోయింది! చివరకు, చేసేది లేక పంజాబ్ లోని తన చైనీస్ ఉద్యోగుల చేత రాజీనామాలు చేయించింది! ఈ విషయం అధికారికంగా చెప్పకున్నా నష్ట నివారణ చర్యలు మాత్రం ఒప్పో చేపట్టిందట! మరి మార్కెట్లో ఈ చైనీస్ కంపెనీ మళ్లీ ఎలా పుంజుకుంటుందో ఏమో! నిజమైన యుద్ధం సంగతి అక్కడి పాలకులు, ఇక్కడి పాలకులు చూసుకుంటారు. కాని, అంతలోనే ఒప్పోకు మాత్రం గొప్ప కష్టమే వచ్చిపడింది!

 

ఒకవేళ ఫుల్ లెంగ్త్ వార్ జరిగితే ఒప్పో లాగే చాలా చైనీస్ బ్రాండ్లు వేల కోట్ల విలువైన ఇండియన్ మార్కెట్ పై ఆశలు వదులుకోవాలని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు! అదే డ్రాగన్ దూకుడును కంట్రోల్ చేస్తోందని కూడా చెబుతన్నారు!