రింగులు రింగులు రింగులు...స్టార్ట్ ....

 

1. ఐస్ప్రూట్ అంటే ఇప్పటి ఐస్క్రీమ్ కి తాత...ఆ డబ్బా లోనుంచి తియ్యగానే మనసు చల్లగా ,నోరు తియ్యగా చేసేది, పైగా తిన్నాక నాలిక రంగు చూపించి మురిసిపోవడం ... గుర్తుందా ?? ..పుల్ల ఐసు ..తింటూ అది కారి వళ్ళంతా పడుతుంటే , తుడుచు కుంటూ ..ఏమయినా ఆ రుచే వేరబ్బా ఇక జీడ్లు ,పిప్పర మెంట్లు, పప్పుండలు , ఆ రుచి మీ నోట్లో ఇప్పటికీ ఉందా లేదా ??

 

 

2. ఎంతటోళన్నా ..మట్టి లో ఆడాల్సిందే ...అందులో దొర్లుతూ, వళ్ళంతా మట్టి పట్టించు కుంటే గాని , నిద్ర పట్టేది కాదు. అమ్మ తో తిట్లు బోనస్ అనుకోండి...ఒళ్ళు అలిసెలా మట్టి లో ఆడిన ఆ రోజులు, ఆ ఆనందం ఒక్కసారి గుర్తు చేసుకోండి...మళ్ళి పరుగున వెళ్లి , ఇప్పటి టెన్సన్స్ అన్ని వదిలేసి , పిల్లల్లా ఆ మట్టిలో ఆటలాడుకుంటే ఎలా వుంటుంది ? ..ఉహలెందుకు బాస్ ...మీ పిల్లలతో కలిసి  ఆ ముచ్చట తీర్చుకోండి ...

 

 

3. సెలవోస్తే వెళ్ళేది లండన్కొ సింగాపుర్ కొ కాదు ...అమ్మమ్మ ఇంటికి...రాజాది, రాజ ..మార్తాండ భోజ ..అన్న లెవెల్ లో మనం ఫోజులు కొడుతు అమ్మమ్మ , తాతయ్యలతో చేయించుకున్న సేవలు , ఇప్పుడు కోట్లు పోసి అయినా కొనగలమా ? అమ్మమ్మ చేతి గోరుముద్దలు, తాతయ్య వెన్నెల్లో చెప్పిన కథలు అన్ని , అన్ని ..అచ్చం గా మనకే సొంతం...

 

 

 

4 .మన రంగుల ప్రపంచం మన చేతిలోనే......ఎక్కడంటే అక్కడ, బొమ్మలు గీసేయచ్చు ..నాన్న ఎంచక్కా మనకోసమే గోడలకి తెల్లటి సున్నం వేసి ..కాన్వాస్ ని సిద్దం గా పెట్టేవాడు..ఇక రోజుకో చోట , మన ఇష్టం వచ్చినట్టు బొమ్మలు గీసేయ్యటమే.. ఎం ఎఫ్ హుస్సైన్ మన ముందు ఏ పాటి ? ..ఏది ఇప్పటి పిల్లలకి అలాంటి ఛాన్స్ ఏది ? వాళ్ళు గట్టిగా గోడలకి ..చేతులు ఆనించినా మరకలు అవుతాయని భయం ...ఏమిటో ?

 

 

5. ఇక ఇన్డోర్ గేమ్స్ గురించి వేరే చెప్పాలా...? అష్టా చెమ్మా నుంచి వామన గుళ్ళు దాకా...ఎన్ని ఆటలో ..? రాళ్ళూ రప్పలు కూడా ఆటలో భాగమే...కంకర రాళ్ళతో కూడా ఆటలు , చింత గింజలు, గోళీలు, గవ్వలు ..ఇలా ఎన్నో మన సంపదలుగా నిలిచాయి...వీటిలో ఏవి మనదగ్గర వున్నా చాలు చెప్పలేని  ఆనందం .ఇప్పడో  ? ఎన్ని కోట్లు వున్నా..ఇంకా కావాలనే ఆత్రం మధ్య ఆ ఆనందం రుచి కూడా మర్చి పోయాం ..

 

-Pushpa Bhaskar