భూమా అఖిల ప్రమాణం
posted on Nov 13, 2014 10:08AM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్లో భూమా అఖిలప్రియా రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మే నెలలో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె స్థానంలో ఆమె కుమార్తె అఖిల ప్రియ ఆళ్ళగడ్డ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.