మోడీ ‘మ్యాన్ ఆఫ్ యాక్షన్’ అన్న ఒబామా

 

భారత ప్రధాని నరేంద్రమోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. నరేంద్రమోడీ మాటల మనిషి కాదని.. ఆయన చేతల మనిషి (మ్యాన్ ఆఫ్ యాక్షన్) అని అభివర్ణించారు. మయన్మార్ రాజధాని నేపిటాలో జరుగుతున్న ఆసియన్ - తూర్పు ఆసియా దేశాల సదస్సులో ఒబామా - మోడీ మరోసారి కలిశారు. 64 ఏళ్ళ వయసున్న నరేంద్రమోడీ ఈ వయసులో చకచకా పరుగులు పెట్టడమే కాకుండా అధికారుల చేత కూడా పరుగులు పెట్టించడాన్ని గమనించిన 53 ఏళ్ళ బరాక్ ఒబామా మోడీని ‘మ్యాన్ ఆఫ్ యాక్షన్’ అని అనకుండా వుండలేపోయారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News