ఆర్మీ జవాను ఆత్మహత్య...
Published on: Wed May 3, 2017 12:49PM

ఇప్పటికే భారత్ సరిహద్దులో తరుచూ కాల్పులు చోటుచేసుకుంటూ కలకలం రేగుతుండగా.. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలోని రాజౌరీ సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తోన్న ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాన్స్ నాయక్ విశాల్ లోహర్ ఈరోజు డ్యూటీలో ఉండగానే తన సర్వీస్ రివాల్వర్ తో తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


