నరసింహనే ఈసారి కూడా.....

 

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పదవికాలం పొడిగింపు జరిగింది. ఈయన పదవీకాలం నిన్నటితో ముగియగా.. కేంద్రం  తాత్కాలిక పొడగింపు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. కాగా నరసింహన్ 2007 జనవరి 25న తొలిసారి ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం... 2010, జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి గవర్నర్‌గా బదిలీ చేశారు. ఆయన పదవీకాలం 2012 మే 2వ తేదీన ముగిసిపోయే సమయంలో పదవీకాలాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పొడిగించింది. దాని ప్రకారం మంగళవారంతో ఆయన రెండవసారి పదవీకాలం ముగిసిపోయింది. ఆలోపే మళ్ళీ ఆయన పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu