కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యేక కమిటీ

 

ప్రధాని నరేంద్రమోడి ఆదివారం సాయంత్రం డిల్లీలో ఎన్డీయే యంపీలందరికీ చిన్న తీనీటి విందు ఏర్పాటు చేసారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం మరియు బీజేపీ యంపీలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీకి కేంద్రమంత్రి అశోకగజపతి రాజు అధ్యక్షుడుగా వ్యహరిస్తారు. వై,యస్స్. చౌదరి కమిటీ సమన్వయకర్తగా వ్యవరిస్తారు. ఈ కమిటీలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన రావు, బండారు దత్తాత్రేయ, తోట నరసింహం, మల్కాజ్ గిరి యంపీ యన్. మల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మరియు వైజాగ్ యంపీ కంబంపాటి హరిబాబు సభ్యులుగా ఉంటారు. వారితో చంద్రబాబు నిన్న తన క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యి, ప్రధాని మరియు ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడవలసిన అంశాల గురించి తెలియజేసారు. అన్నిటికంటే ముందుగా ఇటీవల ప్రధాని హూద్ హూద్ తుఫాను ప్రకటించిన రూ.1000 కోట్ల రిలీఫ్ ఫండ్ తక్షణమే విడుదల చేసేలా అందరూ ఒత్తిడి చేయాలని సూచించారు.

 

ఇక నుండి ఈ కమిటీ కూడా డిల్లీలో కేంద్ర మంత్రులను, అధికారులను కూడా తరచూ కలుస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అవసరమయిన నిధులు విడుదల, ఇంకా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు, ఉన్నత విద్యావైద్య సంస్థల ఏర్పాటు వంటి వివిధ ప్రాజెక్టులను ఆమోదింపజేయడం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి వాటి కోసం కృషి చేస్తుంది. కేవలం ఆంధ్రా కోసమే కాకుండా తెలంగాణాకు రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి కూడా ఈ కమిటీ కేంద్రంపై ఒత్తిడి తెస్తూ కృషి చేస్తుంది.