వైసీపీ నేత బండ బూతుల ఆడియో.. మరీ ఇంత ఘోరమా!!

 

వైసీపీ నేతల తిట్లదండకం ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును తిడుతున్నట్లు చెబుతున్న ఓ ఆడియోను టీడీపీ నేత నారా లోకేష్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో వైసీపీ నేత ఆడియో చర్చనీయాంశమవుతోంది. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి కుమారుడు ఆమంచి రాజేంద్ర.. ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న రవికుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను తెలుగుదేశం పార్టీ ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

మరోవైపు హోంగార్డు రవికుమార్ ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్న కొడుకు ఆమంచి రాజేంద్ర తన కాళ్లు చేతులు నరికేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమంచి రాజేంద్ర, ఆయన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఈ మేరకు రాజేంద్ర తనతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో రికార్డులను పోలీసులకు అందజేశారు. తనకు ఆమంచి రాజేంద్ర నుంచి ఫోన్ నంబర్  7799227777 నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. బయటకు చెప్పలేనిరీతిలో అసభ్యంగా ఆమంచి రాజేంద్ర మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రవికుమార్ కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu