ఏసీపీ సంజీవరావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. అక్రమాస్తుల ఆరోపణ
posted on Nov 14, 2015 11:15AM

కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంట్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆదాయం కంటే ఎక్కువ అక్రమాస్తులు కూడబెట్టారన్ననేపథ్యంలో ఏసీబీ.. సంజీవరావు ఇంట్లో, కార్యాలయం.. ఇంకా పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సంజీవరావు కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. అల్వాల్ లో షాపింగ్ కాంప్లెక్స్ , హన్మకొండలోని అడ్వకేట్ కాలనీలో ఉన్న ఖరీదైన ఇల్లు, ములుగులో 30 ఏకరాల తోట దమ్మన్నపేటలో 5 ఎకరాల భూమి, షామిర్ పేటలో ఫామ్ హౌస్ వంటి రూ. 5కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. కాగా అక్రమాస్తుల్లో సంజీవరావు కి బినామిగా అక్బర్ అనే మరో పోలీస్ ఉన్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. వరంగల్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన నాటి నుంచి సంజీవరావు అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం అక్రమాస్తుల విలువ తేలుతుందని ఏసిబి అధికారులు తెలిపారు. కాగా బినామీ పేర్లున్న ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తామని తెలిపారు.