ఆప్‌లో మరో కలకలం..కేజ్రీపై తీవ్ర అవినీతి ఆరోపణలు
posted on May 7, 2017 3:17PM
.jpg)
కుమార్ విశ్వాస్ వ్యవహారంతో చావు తప్పి కన్నులొట్టపొయినంత పనవ్వడం..ఇంకా ఆ ఎపిసోడ్ సద్దుమణగకముందే ఆమ్ ఆద్మీ పార్టీలో మరో కలకలం రేగింది. ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఆ పార్టీ నేత కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ నుంచి రూ.2కోట్లు లంచం తీసుకోవడం కళ్లారా చూశానని చెప్పారు. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కపిల్ ఇవాళ ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ...ఆరోపణలు నిరూపించడానికి తాను సిద్ధమన్నారు...సీఎం అవినీతిని గురించి వెల్లడించడంతోనే తనను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. తాను పార్టీలోనే ఉంటానని, అవినీతిపై పోరాడుతానని మిశ్రా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐని ఆశ్రయిస్తానని ప్రకటించారు.