ముంబై-కరాచీల మధ్య విమానాలను నిషేధించిన పాక్

భారత్‌పై వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుంది పాకిస్థాన్. ముంబై-కరాచీల మధ్య తిరిగే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటన చేసింది. ఈ నిషేధం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భారత ఎయిర్‌లైన్స్ సంస్థలు ముంబై నుంచి కాకుండా న్యూఢిల్లీ, జైపూర్, ముంబై, అమృతసర్‌ల నుంచి  కరాచీ, ఇస్లామాబాద్ తదితర ప్రాంతాలకు నడిపే అంతర్జాతీయ సర్వీసులు మాత్రం కొనసాగనున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu