బస్సు ప్రమాదం.. 17 మంది మృతి
Published on: Mon Mar 16, 2015 4:28PM

నేపాల్‌లో సోమవారం జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నేపాల్ రాజధానికి ఖాట్మండూకు 400 కిలోమీటర్ల దూరంలో వున్న రారారిహి గ్రామం దగ్గర బస్సు రోడ్డు మీద నుంచి లోయలోకి పడిపోవడంతో ఈ ఘోరం జరిగింది. నేపాల్‌లో బస్సులో ప్రయాణించాలంటే ప్రాణాల మీద ఆశ వదిలేసుకునే బస్సు ఎక్కాలి. ఎందుకంటే అక్కడ కొండ చరియల చివర్లో చిన్న చిన్న రహదారులు వుంటాయి. డ్రైవర్ ఎంతమాత్రం ఏమరపాటుగా వున్నా ప్రమాదం తప్పదు. అందుకే నేపాల్‌లో లోయలో బస్సులు పడిపోయన ఘటనలు తరచుగా జరుగుతాయి. సోమవారం నాడు జరిగిన దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించగా, మిగతావారు చికిత్స పొందుతూ మరణించారు.


