రేపిస్టులను క్షమించింది
posted on Mar 16, 2015 4:46PM

ఆమె గుండె నిండా బాధ ఉన్నప్పటికీ, ఆమె మనసుకు తగిలిన గాయం, శరీరం అనుభవించిన వేదన పెద్దవైనప్పటికీ నిండు మనసుతో వారిని క్షమించేసింది. తనలో ఉన్న మానవత్వాన్ని రుజువు చేసింది. కోల్ కత్తాలోని నాడియా జిల్లాలోని గంగ్నాపూర్ లో నన్ పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై అత్యాచారం చేసిన వారిపై ఎలాంటి ద్వేషం లేదనీ, వారిని క్షమించాలని నన్ కోరింది. 'నా హృదయం పగిలిపోయింది. నా రక్షణకంటే నా పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల భద్రతపైనే నాకు తీవ్ర ఆందోళనగా ఉంది' అని ఆమె అన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా మౌనంగా, నిర్మలమైన మనస్సుతో కనిపించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం అని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు.