ఆధార్ కోసం ఒత్తిడి చేయొద్దు.. సుప్రీం

 

ఆధారే ఆధారం... మనకథ ఆడనే ఆరంభం.. ఆధారే సంతోషం.. మనిషికి ఆధారే సంతాపం... ఆధార్ కార్డు పరిస్థితి ప్రస్తుతం ఇలా ఎదిగిపోయింది. ఎక్కడకి వెళ్ళినా ఆధార్ కార్డు చూపించండని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అయితే ఆధార్ లేనివారిని అసలు మనిషిగానే గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆధార్ కార్డు లభించని అనేకమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధార్ కార్డు అంశంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డుకు సంబంధించి ప్రజలపై ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేసింది. సామాజిక, భద్రత పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీకోర్టు చెప్పింది. గతేడాదే సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశాలనే జారీ చేసినా ప్రభుత్వాలు వాటిని పక్కకు పెట్టి మరీ ప్రతి పథకానికి ఆధార్ ను లింక్ చేస్తున్నాయి. సోమవారం ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి పై విధంగా స్పందించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu