50 కోట్లతో బీజేపీ నేతలు కొనడానికి ప్రయత్నించారు..
posted on Apr 27, 2016 11:16AM
.jpg)
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభంలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ, బీజేపీని ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేంద్ర భండారి, జీత్ రామ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 50 కోట్లతో తమను కొనడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారని.. అంతేకాదు తదుపరి ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్, రాజ్యసభ సీటు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని తెలిపారు. దీనికి బీజేపీ నేతలు స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తగిన ఆధారాలు లేకుండానే కాంగ్రెస్ తమపై ఆరోపణలు గుప్పిస్తుందని పేర్కొంది.