రామ మందిరానికి ముస్లిం ఎమ్మెల్సీ భారీ విరాళం..

 

అయోధ్యలో రామ మందిరానికి ఓ ముస్లిం ఎమ్మెల్సీ భారీ నజరానా ప్రకటించారు. యూపీ స‌మాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుక్క‌ల్ న‌వాబ్ ముస్లిం ఎమ్మెల్సీ బుక్క‌ల్ న‌వాబ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అయోధ్యలో రామ‌మందిర నిర్మాణాన్ని స‌మ‌ర్థించారు. అంతేకాదు.. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణం కోసం రూ 15 కోట్లు విరాళంగా ఇస్తాన‌ని.. రాముడు అయోధ్య‌లోనే జ‌న్మించాడు క‌నుక‌, మందిరాన్ని అక్క‌డే నిర్మించాల‌ని అన్నారు. కాగా భూ న‌ష్ట‌ప‌రిహారం కింద ఎమ్మెల్సీ బుక్క‌ల్‌కు రూ.30 కోట్లు అంద‌నున్నాయి. అయితే ఆ మొత్తం వ‌చ్చిన త‌ర్వాత అందులో రూ.15 కోట్లు మందిర నిర్మాణం కోసం విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు.