యోగి రాజీనామా అప్పుడే...

 


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఈమధ్యనే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే తన ఎంపీ పదవికి  రాష్ట్రపతి ఎన్నికల తర్వాత రాజీనామా చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. యోగితో పాటు గోవా సీఎం మనోహర్‌ పారికర్‌, ఉత్తర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాజీనామా చేయనున్నారు. కాగా యోగి ఆదిత్యానాథ్‌, కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య లోక్‌సభ ఎంపీలు కాగా, మనోహర్‌ పరీకర్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.