ఈ టెడ్డీ బేర్ సూపర్

Publish Date:Sep 11, 2014

 

ప్రపంచం వేగంగా పరిగెడుతుంటే, ఆ వేగానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు జరిగిపోతున్నాయి. కొన్ని మన జీవితాన్ని, జీవన విధానాన్ని సౌకర్యవంతంగా చేస్తే, మరికొన్ని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి ఓ ఆవిష్కరణలివి...

టెడ్డీబేర్ అంటే చిన్నా పెద్దా  అనే తేడా లేకుండా అందరికీ ఇష్టమే..  అయితే కేవలం బొమ్మల్లా ఎక్కడో ఓచోట ఉండటం కాదు.. మనం నవ్వితే నవ్వి, మూతి బిగిస్తే అదీ బిగించి మనమేం చేస్తే అదీ చేసే టెడ్డీ కనిపిస్తే? ఫ్రూజిట్సు కంపెనీ ఇలాంటి ఓ టెడ్డీని రూపొందించింది. ఈ టెడ్డీబేర్‌లో 13 రకాల సెన్సార్లు అమర్చి వున్నాయి. ఇవి బొమ్మ ముక్కు దగ్గరున్న కెమెరా సహాయంతో ఎదుటివారి కదలికలకు టెడ్డీబేర్ స్పందించేలా చేస్తాయి. అలా ఈ బొమ్మ మూడు వందల రకాలుగా శరీర భాగాల్ని కదిలించడగలదుట. హావభావాలు పలికించే ఈ టెడ్డీ ఇప్పుడు పిల్లల్ని ఆకర్షిస్తున్న లేటెస్ట్ బొమ్మల లిస్టులో మొదటి స్థానంలో వుందిట.


-రమ ఇరగవరపు

By
en-us Political News