గర్భధారణ సమయంలో ప్రయాణం చేస్తున్నారా...ఈ తప్పు చేస్తే చాలా డేంజర్..!
గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గర్భవతులు ఏదైనా టూర్ లేదా ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే వారు తీసుకునే జాగ్రత్తల చిట్టా మరింత పెరుగుతుంది. ఎందుకంటే ప్రయాణంలో వాతావరణంలో మార్పు, మార్గంలో అలసట, తినడం, త్రాగడంలో సమస్యలు. లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇబ్బందులు. ఇవన్నీ గర్భవతులను, వారి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
అందువల్ల ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా హాయిగా ప్రయాణించడమే కాకుండా, గర్భవతుల ఆరోగ్యం, కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు టూర్ లేదా ఏదైనా ప్రయాణం కు వెళ్లే ముందు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుంటే..
గర్భవతులు టూర్ లేదా ప్రయాణం కు వెళ్ళేముందు ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమట. ముఖ్యంగా గర్భవతులకు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే లేదా క్రమం తప్పకుండా మందులు తీసుకుంటుంటే హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యమైన మందులు, ప్రథమ చికిత్స కిట్, శానిటైజర్, మాస్క్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఇప్పటికే వైద్యుల దగ్గర చెకప్ తీసుకుని ఉంటే వైద్యుల సూచించిన మందులను వెంట ఉంచుకోవాలి. లేకుంటే ప్రయాణంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం, తల్లి, పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు.
ప్రయాణ సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు. అపరిశుభ్రమైన ఆహారం, కలుషిత నీటిని నివారించాలి. శుభ్రమైన నీటిని మాత్రమే త్రాగాలి. తాజా, వేడి ఆహారాన్ని తినాలి. ప్రయాణించేటప్పుడు బయటి ఆహారం తినడం వల్ల సమస్యలు ప్రమాదాలు పెరుగుతాయి. ఇంటి ఆహారాన్ని లేదా శుభ్రమైన ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తగా ఉండాలి.
గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తున్నప్పుడు తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు . అలసట, నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు, మెదడులోని అలసట కారణంగా శక్తి తగ్గుతుంది.
గర్భవతులు ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం వేడిగా ఉంటే.. బట్టలు, సన్‌స్క్రీన్ లేదా గొడుగు, ఇతర అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక టూర్ కు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం వాతావరణ పరిస్థితులకు, వెళ్లాల్సిన ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి ముందుగానే వాతావరణానికి అనుగుణంగా సిద్ధం కావాలి.
గర్భిణీ స్త్రీలు ప్రయాణించేటప్పుడు ఒత్తిడి లేకుండా ఉండాలి. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ప్రయాణంలో ఉంటే, ఒత్తిడికి దూరంగా ఉండి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి.
*రూపశ్రీ.
