గర్భవతులను డేంజర్ జోన్ లోకి తోసేసే ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా..

గర్భం దాల్చడం, బిడ్డను మోయడం, బిడ్డకు జన్మనివ్వడం, మాతృత్వాన్ని ఆస్వాదించడం.. ఇవన్నీ ఒక మహిళ తన జీవితంలో కోరుకునే అత్యంత విలువైన విషయాలు. అయితే గర్భం విషయంలో నేటి కాలంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళలకు పెద్ద సవాళ్లు విసురుతున్నాయి. వాటిలో ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. అసలు ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి? ఇది గర్భవతులను డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తుంది ఎందుకు? తెలుసుకుంటే..
ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు పిండం సాధారణంగా గర్భాశయంలోనే అభివృద్ధి చెందుతుంది. కానీ గర్భిణీ స్త్రీ పిండం ఆమె గర్భాశయంలో కాకుండా ఆమె కాలేయంలో పెరగడం గురించి ఎప్పుడైవా విన్నారా? గర్భాశయంలో పెరగాల్సిన పిండం కాలేయంలో పెరగడాన్ని ఒక్కసారి ఊహించుకోండి.. చాలా భయానకంగా అనిపిస్తుంది కదా.. . ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇలాంటి షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లే వెలుగులోకి వచ్చింది .
అక్కడ ఒక మహిళ కాలేయంలో పిండాన్ని వైద్యులు కనుగొన్నారుప. ఇది చాలా అరుదైన, ప్రమాదకరమైన పరిస్థితి. దీన్ని ' ఇంట్రా హెపాటిక్ ప్రెగ్నెన్సీ ' అంటారు . ఇందులో,పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది . దీనివల్ల కాలేయం చీలిపోయే ప్రమాదం ఉంటుంది. తద్వారా తల్లి చనిపోవచ్చు కూడా అని వైద్యులు అంటున్నారు.
సాధారణంగా గర్భధారణ సమయంలో పిండం తల్లి గర్భాశయం లోపల పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు పిండం ఫెలోపియన్ ట్యూబ్, ఉదర కుహరం , అండాశయం లేదా కాలేయం వంటి ఇతర అవయవాలలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. పిండం కాలేయంలో ఏర్పడినప్పుడు దానిని ప్రత్యేకంగా ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటారు.
కారణమేంటి..?
మహిళలలో ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోవడం లేదా పిండం తప్పు దిశలో సెట్ కావడం ఈ సమస్యకు కారణం కావచ్చు. పిండం ఉదర కుహరంలోకి పడి రక్త ప్రవాహాన్ని అందించే అవయవానికి అతుక్కుపోతుంది. కాలేయం రక్తంతో కూడిన అవయవం కాబట్టి పిండం అక్కడ అభివృద్ధి చెందగలదు. అదనంగా IVF లేదా ఇతర సంతానోత్పత్తి పద్ధతులను ఉపయోగించే స్త్రీలు, ఫెలోపియన్ ట్యూబ్‌లపై ఇన్ఫెక్షన్ లేదా శస్త్రచికిత్స హిస్టరీ కలిగి ఉంటారు.లేదా గతంలో శస్త్రచికిత్స లేదా ఉదరానికి గాయం అయిన స్త్రీలు ఇంట్రాహెపాటిక్ గర్భధారణకు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు.
లక్షణాలు..
ఈ గర్భధారణ లక్షణాలు పొట్ట కుడి ఎగువ భాగంలో తీవ్రమైన నొప్పి, అసాధారణ రక్తస్రావం, వాంతులు, వికారం, తలతిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోవడం. కాలేయం చుట్టూ వాపు లేదా ఒత్తిడి అనుభూతి కూడా ఈ పరిస్థితికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ గర్భధారణ లక్షణాల నుండి భిన్నంగా ఉంటాయి. కాబట్టి గుర్తింపు కష్టం కావచ్చు.
నష్టాలు..
ఈ గర్భధారణలో అత్యంత తీవ్రమైన ప్రమాదం కాలేయం చీలిపోవడం. ఎందుకంటే ఇది రక్తంతో నిండిన ముఖ్యమైన అవయవం. గర్భంలో పిండం పరిమాణం పెరిగినప్పుడు, అది కాలేయంపై ఒత్తిడి తెస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే కాలేయం చీలిపోవచ్చు. ఇది భారీ అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది, తల్లి మరణానికి కూడా దారితీస్తుంది.
ట్మీట్మెంట్..
ఇంట్రాహెపాటిక్ గర్భధారణను పూర్తి కాలంలో చికిత్స చేయలేము. ఇది నిర్ధారించబడిన వెంటనే వైద్యులు మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా పిండాన్ని తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తారు. సమస్య సీరియస్ గా ఉన్నప్పడు పాక్షిక కాలేయ శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. సకాలంలో చికిత్స మాత్రమే స్త్రీ ప్రాణాలను కాపాడుతుంది. దీని గురించి మహిళలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
*రూపశ్రీ.



.webp)