మొటిమల కారణంగా ముఖం మీద గుంటలు పడ్డాయా...ఈ టిప్స్ ట్రై చేయండి..!

 

చర్మం శుభ్రంగా,  మెరుస్తూ ఉన్నప్పుడు ముఖం  అందం చాలా బాగా కనిపిస్తుంది. కానీ చాలా వరకు ఇది అమ్మాయిలకు ఉండిపోతుంది.  దీనికి కారణం మొటిమలు..  సార్లు పాత మొటిమల కారణంగా, ముఖంపై లోతైన గుంటలు లేదా మచ్చలు ఏర్పడతాయి. ఇవి  అందాన్ని దెబ్బతీస్తాయి. ముఖం మీద ఉండే ఈ మొటిమలు, గుంటలు తొలగించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తుల వైపు ఆకర్షితులు అవుతారు. వీటి వల్ల సమస్య పూర్తీగా తగ్గకపోగా కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది.  అయితే చర్మానికి  ఎటువంటి హాని లేకుండా రిపేర్ చేయగల  ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే ముఖం మీద గుంటలు, మచ్చలు మాయమై ముఖం చాలా ప్రకాశవంతంగా మారుతుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

గుడ్డులోని తెల్లసొన

 ముఖం మీద గుంటలు ఉండేవారికి ఇది చక్కని చిట్కా.. అయితే  గుడ్లు  వాడటానికి ఎలాంటి  అభ్యంతరం లేకపోతే ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు. దీని కోసం గుడ్డులోని తెల్లసొనను  ముఖం మీద ఉపయోగించాలి. గుడ్డును పగలగొట్టి దాని తెల్ల భాగాన్ని తీసి బాగా  గిలక్కొట్టాలి. ఇప్పుడు దానిని బ్రష్ సహాయంతో ముఖంపై అప్లై చేయాలి. అది ఆరిన తర్వాత కడగాలి. ఇది  చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.  పెద్దగా ఉన్న చర్మ  రంధ్రాలను తగ్గిస్తుంది. దీని కారణంగా మచ్చలు తగ్గుతాయి.

శనగపిండి, రోజ్ వాటర్, నిమ్మకాయ..

గుడ్లు వాడటంలో ఇబ్బంది అనిపించేవారు ఈ రెసిపీని ఉపయోగించవచ్చు. దీన్ని రెడీ చేయడానికి ఒక చెంచా శనగపిండికి కొన్ని చుక్కల నిమ్మరసం,  రోజ్ వాటర్ జోడించాలి. మూడు వస్తువులను బాగా కలిపిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగిస్తే మంచిది. ఇది  చనిపోయిన చర్మాన్ని తొలగించి, మచ్చలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

                          *రూపశ్రీ.