అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!!

భారతీయ వంటకాల్లో అల్లంకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపుగా అన్ని వంటకాల్లోనూ అల్లంను వినియోగిస్తుంటారు. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మనకు అజీర్ణం, దగ్గు, గొంతునొప్పి, గొంతునొప్పి ఉన్నప్పుడు కొద్దిగా అల్లం తింటే చాలా త్వరగా తగ్గుతుంది. మన అల్లం చాలా శక్తివంతమైనది. అయితే అల్లం పాడవకుండా చాలాకాలం నిల్వ ఉండాలంటే ఏం చేయాలి.
తాజా అల్లం కొనండి:
అల్లం కొనుగోలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు తీసుకునే అల్లం గట్టిగా తాజాగా ఉండాలి.చాలా మెత్తగా, చాలా పొరలతో ఉండే అల్లం త్వరగా పాడైపోతుంది. కాబట్టి అల్లం కొనుగోలు చేసే ముందుకు జాగ్రత్తగా పరిశీలించాలి.
అల్లం పొట్టును తొలగించవద్దు:
మీరు అల్లం నిల్వ చేయాలనుకుంటే..దానిపై ఉన్న పొట్టును తీయకూడదు. పొట్టుతో అలాగే ఉంచినట్లయితే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఇది అల్లానికి రక్షణ కవచం లాంటిది.
రిఫ్రిజిరేటర్లో ఉంచండి:
అల్లం తాజాగా ఉండాలంటే రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గాలి చొరబడని ప్లాస్టిక్ సంచిలో కూడా భ్రదపరుచుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ బ్యాగ్ నుండి అదనపు గాలిని తొలగించండి. ఇది అల్లం తేమ నుండి రక్షిస్తుంది. ఇలా చేయడం వల్ల అల్లంపై ఫంగస్ దరిచేరదు.
ఎండిన అల్లం:
అల్లం నిల్వ చేయడానికి మరొక మార్గం ఏమిటంటే, దానిని పూర్తిగా శుభ్రపరచడం. నీటి శాతం పూర్తిగా పోయే వరకు ఆరబెట్టడం. లేదంటే ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో నీటి శాతం పూర్తిగా లేకుండా చూడాలి. తర్వాత దీన్ని పొడి చేసి, అవసరమైనప్పుడు మసాలాగా ఉపయోగించవచ్చు.
చుట్టి ఫ్రీజర్‌లో ఉంచండి
ముక్కలు చేసిన అల్లాన్ని పార్చ్‌మెంట్ పేపర్‌తో కప్పిన బేకింగ్ షీట్‌పై చుట్టి, గట్టిగా అయ్యేంత వరకు ఫ్రీజర్‌లో ఉంచండి. తర్వాత వాటిని గాలి చొరబడని కంటైనర్ లేదా ఫ్రీజర్ సేఫ్ బ్యాగ్‌లో ఉంచండి.



.png)