అందమైన కురుల కోసం ఆలు..

 

 

బంగాళదుంపలు అంటే మనం సహజంగా వంటకి ఉపయోగిస్తాం. అంతేకాదు ఆలు ఉపయోగించని వాళ్లు కూడా చాలా తక్కువ మంది ఉంటారనుకోండి. ఏ వంట ఇంట్లో చూసినా ఇవి కామన్ ఉంటే వెజిటెబుల్. అయితే ఈ బంగాళ దుంపలు ఒక్క వంటకి మాత్రమే కాదు మన కురులను కాపాడుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మరి ఆ టిప్స్ ఏంటో మీరు ఓ లుక్కేయండి..

1. ముందుగా ఒక ఆలు తీసుకొని తురిమి దానిని పిండితే వాటర్ వస్తుంది. ఆ వాటర్ ను ఓ బౌల్ లో తీసుకొని.. అందులో ఒక కోడిగుడ్డు, పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ను జుట్టు కుదుళ్ల నుండి పట్టించి.. ఓ ఇరవై నిమిషాలు ఉండి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో.. నార్మల్ షాంపూతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ ను ఇరవై పదిహేను రోజులకు ఒకసారి వేసుకుంటే..  సిల్కీ అండ్ హెల్థీ హెయిర్ మీ సొంతమవుతుంది.

2. ఆలు ఒకటి తీసుకొని దాని పొట్టు తీయాలి.  ఒక బౌల్ లో నీరు తీసుకొని.. ఆ నీటిలో ఆలు పొట్టు వేసి ఓ 15 నిమిషాలు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఆ వాటర్ తో జుట్టు శుభ్రం చేసుకుంటే సహజమైన నల్లని జుట్టు మీ సొంతమవుతుంది.

3. మూడు స్పూన్ల ఆలు జ్యూస్ తీసుకొని.. అందులో మూడు స్పూన్ల అలోవిరా జ్యూస్.. రెండు స్పూన్ల తేనె తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఆ ప్యాక్ ను జట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటలపాటు ఉంచి శుభ్రం చేసుకుంటే.. హెయిర్ ఫాల్ నుండి తప్పించుకున్నట్టే. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.