* ఉదయాన్నే అవిసె గింజలు నానపెట్టిన ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి. అవిసె గింజల్లో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

* రోజూ ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినాలి. ప్రతిరోజూ రాత్రి ఐదు ఆల్మండ్ గింజలను నానపెట్టి వాటిని తెల్లవారి ఉదయాన పొట్టు తీయకుండా తినేయాలి.

* మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. ఇవి జుట్టుకి కావలసిన పోషకాలను అందిస్తాయి.

* ఒక గిన్నెడు మొలకెత్తిన గింజలు తినాలి.

* ప్రొటీన్ల కోసం ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలి. కోడి కూర కూడా తినాలి.

* టీ, కాఫీలు తగ్గించాలి. పూర్తిగా మానేస్తే మంచిది. రోజుకి రెండు గ్లాసుల వెన్న తీసిన పాలు తాగితే ఎంతో లాభం ఉంటుంది.

* తలస్నానం చివర్లో ఒక టీ స్పూను నిమ్మరసంతో కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది. చుండ్రు రాదు.

* వారానికి ఒకసారి మెంతి గింజల గుజ్జును మాడుకు పట్టించి అరగంట తరువాత తల శుభ్రం చేసుకోవాలి. అలాగే పరగడుపున మెంతులు నానపెట్టిన నీళ్లు తాగాలి.

* స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు, యాపిల్స్, మామిడి పండ్లు, సపోట, ద్రాక్షలను రోజూ రెండు లేదా మూడు పళ్లు తింటే మంచిది.

* కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది.

* చేపలు, కోడి, గుడ్లు వాడకం పెంచితే జుట్టు బాగుంటుంది. రెడ్ మీట్‌కి దూరంగా ఉండాలి.