మెరిసే చర్మం కావాలా... ఈ పండ్లు తినండి చాలు..!


అందంగా, ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపించే చర్మం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఇదంతా కలగానే ఉంటుంది. చాలామంది ఇలా మెరిసే చర్మం కోసం బోలెడు ట్రీట్మెంట్లు,  మరింత ఖరీదైన చర్మ ఉత్పత్తులు వాడుతుంటారు.  కానీ ఇవన్నీ తాత్కాలికంగా చర్మాన్ని మెరిపిస్తాయి. అంతేకానీ వీటితో దీర్ఘకాలం మెరిసే చర్మం లభించదు.  అయితే అయితే చర్మం అందంగా,  ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించాలంటే కొన్ని పండ్లు తింటే చాలని అంటున్నారు వైద్యులు.  ఇంతకీ చర్మాన్ని మెరిచేలా చేసే పండ్లు ఏంటి? అసలు పండ్లు చర్మాన్ని మెరిపించడంలో ఎలా సహాయపడతాయి?  తెలుసుకుంటే..

చర్మాన్ని మెరిపించడంలో పండ్లు..

చర్మాన్ని మెరిపించడంలో పండ్లు అద్బుతంగా సహాయపడతాయని,  ఇది చాలా సీక్రెట్ మెథడ్ అని చర్మ సంరక్షణ నిపుణులు, వైద్యులు అంటున్నారు. పండ్లు తింటే చర్మం మృదువుగా,  ప్రకాశవంతంగా,  యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాదు.. కేవలం తినడానికే కాకుండా నేరుగా చర్మం పైన ఉపయోగించినా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి.

అరటిపండు..

అరటిపండు చర్మాన్ని లోపలి నుండి, వెలుపలి నుండి కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే ఎక్స్ఫోలియేషన్ లక్షణాలు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి.  మొటిమలను కూడా తగ్గిస్తాయి.

నారింజ..

నారింజలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.  ఇవి చర్మాన్ని ఇన్ఫెక్షన్లు, ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.  ఇది సహజ బ్లీచ్ గా పనిచేస్తుంది. మచ్చలు, గుర్తులను తొలగిస్తుంది.

బొప్పాయి..

బొప్పాయి చర్మానికి చాలా అద్బుతంగా పనిచేస్తుంది.  చర్మం పై మృత కణాలను తొలగించి కొత్త కణాలు ఏర్పడటంలో సహాయపడుతుంది.  ఇది మెటిమలు, పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి,  సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు..

స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని యువి కిరణాల నుండి రక్షిస్తాయి.  స్ట్రాబెర్రీ చర్మం రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కిన్ కేర్ లో చాలా మంది స్ట్రాబెర్రీని ఎంచుకుంటారు.

కీర దోస..

కీర దోసకాయ చర్మాన్ని హెడ్రేట్ గా ఉంచుతుంది. చర్మంలో ఉండే అధిక వేడిని తగ్గిస్తుంది.   ఇది చలువ గుణం కలిగి ఉండటం వల్ల వడదెబ్బ,  చికాకు తగ్గిస్తుంది. చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచుతుంది.

కెవి..

కివిలో విటమిన్-సి, ఇ పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి.  ఇది చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా, హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

                                    *రూపశ్రీ.