కళ్ల కింద వాపు కనిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ సమస్య ఉండచ్చు!

కార్టిసాల్ ఫేస్.. ముఖం,  కళ్ల కింద వాపు కనిపిస్తున్నాయా.. అయితే మీకు ఈ సమస్య ఉండచ్చు! ముఖం అందంగా కనిపించాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే నేటికాలంలో చాలామంది ముఖం వాపు ఉండటం,  కళ్ల కింద వాపు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇది చర్మ సంబంధిత సమస్య అనుకుని చాలా రకాల చర్మ ఉత్పత్తులు ప్రయత్నిస్తుంటారు.  కానీ ఇది చర్మ సంబంధ సమస్య కాదని, ఇది పూర్తీగా కార్టిసాల్ పేస్ సమస్య అని అంటున్నారు వైద్యులు. ఇంతకూ కార్టిసాల్ పేస్ సమస్య ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. కార్టిసాల్ ఫేస్.. నేటి యువత రాత్రి ఆలస్యంగా  నిద్రపోవడం,  ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ ను ఉపయోగించడం,   నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు.  మరీ ముఖ్యంగా  జంక్ ఫుడ్‌ను అతిగా తింటుంటారు. ఇది మంటను పెంచుతుంది,  హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. చదువులు లేదా ఉద్యోగాల ఒత్తిడి కూడా మనస్సు  ప్రశాంతతను దెబ్బతీస్తుంది, ఇది ఒత్తిడికి దారితీస్తుంది. మనస్సు నిరంతరం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది చర్మ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనిని కార్టిసాల్ ఫేస్  అని కూడా పిలుస్తారు. కార్టిసాల్ అంటే.. కార్టిసాల్ అనేది ఒత్తిడి సమయంలో శరీరంలో గణనీయంగా పెరిగే హార్మోన్. ఇది తక్కువ మొత్తంలో అవసరం అయినప్పటికీ, ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే, దాని ప్రభావాలు ముఖంపై కనిపిస్తాయి. ముఖం ఉబ్బడం, కళ్ళ కింద ఉబ్బడం, తరచుగా మొటిమలు,   చర్మం  నిస్తేజంగా మారడం వంటివి సాధారణ లక్షణాలు. కొన్నిసార్లు ముఖం మెరుపు కూడా మాయమవుతుంది. శరీరంపై ప్రభావం.. ఒత్తిడి ముఖం మీద మాత్రమే కాకుండా మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. బరువు పెరగడం, అలసట,  జుట్టు రాలడం వంటి లక్షణాలు ఉంటాయి.  అయితే ముఖంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ముఖం పూర్తిగా నిర్జీవంగా కనిపిస్తుంది. కార్టిసాల్ ఫేస్ ఎలా నివారించాలి.. కార్టిసాల్ ఫేస్  సమస్యను నివారించుకోవాలనుకుంటే ముందుగా  నిద్రను మెరుగుపరచుకోవాలి. ప్రతిరోజూ కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవడం చాలా అవసరం. కొంచెం వ్యాయామం, యోగా,  ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.  ఆహారాన్ని మెరుగుపరచుకోవడం వల్ల  కార్టిసాల్  ఫేస్ ను నివారించవచ్చు. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు,  ప్రోటీన్లను  ఆహారంలో చేర్చుకోవాలి. శరీరంలో టాక్సిన్లు  బయటకు పంపడానికి ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. ముఖం పై వాపు లేదా మొటిమలు ఎక్కువ కాలం ఉంటే వైద్యుడిని తప్పకుండా కలవాలి.                                *రూపశ్రీ.

చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!

  చిన్నవయసులోనే పీరియడ్స్ వస్తే డేంజరా...ఆడపిల్లల తల్లులు తెలుసుకోవాల్సిన విషయం..!   పీరియడ్ అనేది సహజమైన ప్రక్రియ. ప్రతి అమ్మాయి ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఈ దశలోకి చేరడం సహజం.  భారతదేశంలో మొదటిసారి రజస్వల అయ్యే అమ్మాయిల  సగటు వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఈరోజుల్లో ఆడపిల్లలు 7-8 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న వయస్సులోనే రజస్వల  కావడం ఆరోగ్యకరం కాదట. దీని వల్ల భవిష్యత్తులో స్థూలకాయం, మధుమేహం వంటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఎముకల పెరుగుదల ఆగిపోతుందట.  దీని కారణంగా పిల్లల ఎత్తు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లీ దీని గురించి పూర్తీగా తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి  కారణం. సోషల్ మీడియాలో అడల్ట్ కంటెంట్, ప్రకటనలు లేదా ఫిల్మ్‌లను చూసే పిల్లలలో పిట్యూటరీ గ్రంధిపై చాలా ప్రభావం ఉంటుంది. ఇది హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ఆడపిల్లలో తొందరగా రజస్వల కావడానికి  కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల జీవనశైలి,  ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు ఉన్నాయి. బాల్యంలో నాన్-వెజ్ లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే అమ్మాయిలకు చిన్న వయస్సులో రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయట. ఇది ఆరోగ్యానికి హానికరం. చిన్నప్పటి నుండి పిల్లలు చాలా తీపి పదార్థాలు తింటారు. అది స్వీట్లు, చాక్లెట్లు లేదా ప్యాక్డ్ ఫుడ్ ఇలా చాలా ఉంటాయి.  వీటిలో ఉండే చక్కెర హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు ఆడపిల్లలు రెగ్యులర్ గా తీసుకుంటే త్వరగా  రజస్వల  రావచ్చు. రోజువారీ జీవితంలో సోమరితనం,  చురుకుగా లేని అమ్మాయిలకు  పీరియడ్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా 30-40 నిమిషాల పాటు ఎటువంటి శారీరక వ్యాయామం చేయని అమ్మాయిలకు నిర్ణీత వయసు కంటే  ముందే రజస్వల ప్రారంభమవుతుంది. పిల్లల మీద అతిప్రేమతో చాలా రకాల ఆహారాలు వద్దనకుండా కొనిపెట్టడం వల్ల  బరువు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు మరింకొంత మంది బరువు తక్కువగా ఉంటారు.  వీటి వల్ల కూడా  ప్రీమెచ్యూర్ పీరియడ్స్ రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన బరువు శరీరంలో  హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే అనారోగ్యకరమైన బరువు  హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది.  ఇది ఆడపిల్లలలో తొందరగా రజస్వల కావడానికి కారణం అవుతుంది.  ప్రారంభ కాలాల అవకాశాలను పెంచుతుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                                  *రూపశ్రీ.

పరిగెత్తేటప్పుడు లెగ్గింగ్స్ లేదా షార్ట్స్ ఏవి ధరిస్తే మంచిది!

పరిగెత్తేటప్పుడు లెగ్గింగ్స్ లేదా షార్ట్స్ ఏవి ధరిస్తే మంచిది! పరుగు ఆరోగ్యానికి చాలామంచిది.  చాలామంది మహిళలు తమ ఆరోగ్యం గురించి అవగాహనతో రోజువారీ వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. అయితే చాలామంది వాకింగ్, రన్నింగ్,  యోగా వంటివి చేస్తున్నా.. వాటికి తగిన దుస్తులు ఎంపిక చేసుకోవడంలో, ధరించడంలో మాత్రం అంతగా అవగాహన కలిగి ఉండరు.  అయితే ముఖ్యంగా పరిగెత్తేటప్పుడు పాదాలు చురుగ్గా ఉంటాయి. ఇలాంటి సందర్బంలో దుస్తుల వల్ల ఏదైనా ఇబ్బంది ఎదురైతే రన్నింగ్ అయినా, వాకింగ్ అయినా సరిగా చేయలేరు.   ఇంతకూ రన్నింగ్ చేసేటప్పుడు లెగ్గింగ్స్ ధరించడం మంచిదా? లేదా షార్ట్స్ ధరించడం మంచిదా? తెలుసుకుంటే.. పరుగు ఆరోగ్యానికి చాలామంచిది. రోజూ కనీసం రెండు నుండి మూడు కిలోమీటర్లు అయినా రన్నింగ్ చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. రన్నింగ్ చేసేటప్పుడు  ప్రోఫెషనల్ రన్నర్ లు అయితే షార్ట్స్ ధరిస్తారు.  చాలామంది మహిళలు మాత్రం లెగ్గింగ్స్ ధరిస్తారు. రన్నింగ్ చేసేటప్పుడు ఏది ధరించాలి అనే విషయం తెలియని వారు మాత్రం గందరగోళంలో ఏదో ఒకటి అన్నట్టు ధరిస్తుంటారు. లెగ్గింగ్స్.. లెగ్గింగ్స్ కాళ్ల కండరాలకు బాగా సపోర్ట్ ఇస్తుంది.  ఎందుకంటే లెగ్గింగ్స్ సాగే గుణాన్ని కలిగి ఉంటాయి.  ఇది సాగడం కారణంగా కండరాలు సంకోచ, వ్యాకోచాలు సజావుగా జరుగుతాయి. కండరాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తాయి. ఎక్కువ దూరం పరిగెత్తినప్పుడు కాళ్ళు, ముఖ్యంగా తొడల చర్మం ఒరుసుకుని పోకుండా చేయడంలో లెగ్గింగ్స్ సహాయపడతాయి. దీని వల్ల చికాకు తగ్గుతుంది. చలికాలంలో లెగ్గింగ్స్ ధరించడం వల్ల కాళ్లు వెచ్చగా ఉంటాయి. కండరాలను చలి నుండి రక్షిస్తాయి. పరిగెత్తేటప్పుడు సౌకర్యంగా కూడా ఉంటాయి. లెగ్గింగ్స్ వేసుకున్నప్పుడు రన్నింగ్ చేయడానికే కాకుండా ముందుకు, వెనక్కు,  కూర్చోవడం, లేవడం వంటి కదలికలకు కూడా  బాగా సహాయపడుతుంది.  చాలామంది సాధారణ జీన్స్ వంటివి వేసుకోవడం వల్ల రన్నింగ్ మాత్రమే కాకుండా చాలా కదలికలకు ఇబ్బందిగా ఉంటుంది. మంచి నాణ్యత కలిగిన లెగ్గింగ్స్ అయితే చెమటను కూడా బాగా పీల్చుకోగలుగుతాయి. తద్వారా చర్మాన్ని పొడిగా కూడా ఉంచుతాయి. నడుస్తున్నప్పుడు లేదా రన్నింగ్ చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా కూడా ఉంచుతాయి. శరీరానికి సరిగ్గా సరిపోయే లెగ్గింగ్స్ వేసుకోవడం వల్ల రన్నింగ్ చాలా సజావుగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా బరువులు ఎత్తడం,  యోగా,  ఎరోబిక్స్ వంటి అన్ని రకాల వ్యాయామాలకు కూడా లెగ్గింగ్స్ బాగా సెట్ అవుతాయి. సరైన లెగ్గింగ్స్ ఎలా ఎంచుకోవాలంటే.. రన్నింగ్ కోసం అయితే నైలాన్,  స్పాండెక్స్ లేదా పాలిస్టర్ వంటి సింథటిక్, గాలి ప్రసరణ జరిగేలా ఉండే లెగ్గింగ్ లను ఎంచుకోవాలి.  ఇవి చెమటను తొందరగా తొలగించి చర్మాన్ని పొడిగా ఇంచుతాయి. లెగ్గింగ్స్ ను ఎప్పుడూ ఎక్కువ ఎలాస్టిక్ గుణం ఉన్నవే ఎంచుకోవాలి.  ఎలాస్టిక్ గుణం తక్కువ  ఉన్నవి ఎంచుకుంటే అసౌకర్యాన్ని కలిగిస్తాయి.                              *రూపశ్రీ.

45 నుండి 55 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!

45 నుండి 55 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన విషయం..! మహిళలలో నెలసరి  మొదలయ్యే దశ ఎలా ఉంటుందో.. అలాగే ముగిసే దశ కూడా ఉంటుంది.  నెలసరి చక్రం పూర్తీగా ఆగిపోయే దశను మెనోపాజ్ అని అంటారు.  మెనోపాజ్ అంటే కేవలం పీరియడ్స్ ముగియడం అని  తరచుగా అనుకుంటాము. కానీ ఇది మెదడు నిర్మాణాన్ని కూడా నిశ్శబ్దంగా మారుస్తుందని అంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్ అనేది కేవలం శారీరక మార్పు కాదు.. ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.   45 నుండి 55ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు తప్పక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వయసు గల వారిలోనే మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. పరిశోధనలు ఏం చెబుతున్నాయి.. మెదడు నిర్మాణంలో మార్పులు.. మెనోపాజ్  తర్వాత, మెదడులోని అనేక ముఖ్యమైన భాగాలలో 'బూడిద పదార్థం' పరిమాణం తగ్గినట్లు పరిశోధనలలో బయటపడిందని పరిశోధనా నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం..  ఆందోళన, నిరాశ,  నిద్ర సమస్యల స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనలలో  కనుగొనబడింది. మానసిక ఆరోగ్యంపై నిద్ర ప్రభావం.. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో రుతుక్రమం ఆగిన స్త్రీల కంటే మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు ఆందోళన లేదా నిరాశ కోసం వైద్యుడిని లేదా మానసిక వైద్యుడిని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రుతువిరతి తర్వాత నిద్రలేమి,  నిద్ర లేకపోవడం వంటి కంప్లైంట్ లు చాలా సాధారణం అయిపోయాయని చెబుతున్నారు. తగినంత నిద్రపోయిన తర్వాత కూడా మహిళలు ఎప్పుడూ  అలసిపోతున్నట్లు,  ఎంత విశ్రాంతి తీసుకున్నా, ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తిన్నాశరీరం అలసటగా ఉన్నట్టు చెప్పడం గమనార్హం. HRT అంటే హార్మోన్ పునఃస్థాపన చికిత్స తీసుకునే స్త్రీలలో ఆందోళన,  నిరాశ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నివేదించారు. అయితే నిశితంగా పరిశీలించినప్పుడు ఈ సమస్యలు మెనోపాజ్  ప్రారంభానికి ముందే ఉన్నాయని తేలింది. మెదడు మందగించడం, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం.. మెనోపాజ్ తర్వాత జ్ఞాపకశక్తికి,  ఏదైనా నేర్చుకోవడానికి కారణమయ్యే మెదడులోని ప్రాంతాలలో అంటే హిప్పోకాంపస్ వంటి ప్రాంతాలలో బూడిద రంగు పదార్థం తగ్గుతుందని కనుగొన్నారు.  వయసు పెరిగే కొద్దీ సహజంగా స్పందించే సామర్థ్యం మందగిస్తుంది, కానీ మెనోపాజ్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రభావితమైన మెదడు ప్రాంతాలు అల్జీమర్స్ వ్యాధితో సంబంధం ఉన్న ప్రాంతాల మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో చిత్తవైకల్యం వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని దీని కారణంగా చెబుతున్నారు.                      *రూపశ్రీ.

బీట్రూట్ లేదా గుమ్మడి గింజలు.. వేటిలో ఐరన్ మెరుగ్గా ఉంటుంది!

బీట్రూట్ లేదా గుమ్మడి గింజలు.. వేటిలో ఐరన్ మెరుగ్గా ఉంటుంది! ఆహారంతోనే ఆరోగ్యం సాధ్యమని  ఆయుర్వేదం ఎప్పుడో  చెప్పింది.  ఇప్పటికీ ఆరోగ్య సమస్యలకు చాలా వరకు ఆహారంతోనే పరిష్కారం చెప్పేది ఆయుర్వేదమే.. అయితే నేటికాలపు ఇంగ్లీషు వైద్య విధానం ప్రతి సమస్యకు ఒక కొత్త పేరు పెట్టి, వాటికి తగ్గ మందులను సూచిస్తుంది.  కానీ మనిషి శరీరంలో ఎంతో అత్యవసర ద్రవ్యమైన రక్తం విషయంలో మాత్రం ఏ వైద్యమైనా ఆహారం ద్వారా మెరుగు పడటమే ఉత్తమం అని చెబుతుంది.  మనిషి శరీరంలో రక్తం చాలా ముఖ్యమైనది. రక్తానికి రంగును, హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడేది ఐరన్. ఐరన్ వల్లే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరంలోని అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది.  పోషకాలు సరఫరా అవుతాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.   సాధారణంగా ఐరన్ కోసం చాలామంది బీట్రూట్ తినమని లేదా బీట్రూట్ జ్యూస్ తాగమని చెబుతుంటారు. కానీ ఐరన్,  గుమ్మడి గింజలు రెండింటిలో ఐరన్ ఉంటుంది.  అయితే.. ఈ రెండింటిలో ఎందులో ఐరన్ ఎక్కువ ఉంటంది? ఈ విషయం తెలిస్తే ఐరన్ కోసం ఏది తింటే బెటర్ అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. గుమ్మడి గింజలు.. శరీరంలో ఐరన్ లోపం ఉంటే.. దాన్ని తిరిగి భర్తీ చేయడంలో బీట్రూట్ బెస్ట్ అని అనుకుంటారు.  కానీ.. పోషకాహార నిపుణులు మాత్రం దీని గురించి  కొన్ని రహస్యాలు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలలో బీట్రూట్ కంటే ఎక్కువ శాతం ఐరన్ ఉంటుందట. గుమ్మడికాయ గింజలలో 100గ్రాముల గింజలలో దాదాపు 8.8mg ల నుండి 9mg ల వరకు ఐరన్ ఉంటుంది. రోజువారీ శరీరానికి అవసరం అయిన ఐరన్ లో ఎక్కువ శాతాన్ని గుమ్మడి గింజలు భర్తీ చేయగలుగుతాయి. గుమ్మడి గింజలు ఇలా తింటే బెస్ట్.. గుమ్మడికాయ గింజలలో నాన్-హీమ్ ఐరన్ ఉంటుంది.  శరీరానికి దీనిని సమర్థవంతంగా గ్రహించడానికి విటమిన్-సి అవసరం అవుతుంది. అందుకే ఈ విత్తనాలను కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ నీటితో తీసుకోవడం వల్ల ఐరన్ శోషణ మెరుగవుతుంది.   బీట్రూట్.. బీట్రూట్ హిమోగ్లోబిన్ ను పెంచుతుందని అనుకుంటారు. కానీ 100గ్రాముల బీట్రూట్ లో కేవలం 0.8mg ఐరన్ మాత్రమే ఉంటుంది. అందుకే గుమ్మడికాయ విత్తనాల కంటే బీట్రూట్ లో ఐరన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.                               *రూపశ్రీ.

30ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు.. ఇవి ఎంత ముఖ్యమంటే..!

30ఏళ్లు నిండిన ప్రతి మహిళ చేయించుకోవాల్సిన పరీక్షలు.. ఇవి ఎంత ముఖ్యమంటే..! మహిళల శరీరం ప్రతి దశలో చాలా మార్పులకు లోనవుతూ ఉంటుంది.  రుతుచక్రం మొదలైన దగ్గర నుండి వివాహం,  ప్రసవం,  మెనోపాజ్.. ఇలా చాలా దశలలో మహిళల శరీరం కుదుపులకు లోనవుతూ ఉంటుంది.  అంతేకాదు.. ఇలా దశలు మారుతున్నప్పుడు చాలా రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.  30ఏళ్లు నిండిన ప్రతి మహిళ కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.  వీటిని చేయించుకోవడం వల్ల శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి,  వాటికి తగిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు.  ఇంతకీ 30ఏళ్లు నిండిన మహిళలు చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటో తెలుసుకుంటే.. CBC టెస్ట్.. ఇది కంప్లీట్ బ్లట్ కౌంట్ టెస్ట్.  ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు.  భారతదేశంలో 80శాతం మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.  ఈ పరీక్ష చేయించుకోవడం ద్వారా రక్తహీనతను తగ్గించి ఆరోగ్యంగా మారడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్న మహిళలలో అలసట,  బలహీనత వంటి సమస్యలు ఉంటాయి.  చికిత్స తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడమే కాకుండా.. బలహీనత, అలసట వంటివి కూడా తగ్గుతాయి. బ్లడ్ షుగర్ టెస్ట్.. నేటికాలంలో మధుమేహం చాలా చిన్న వయులోనే వస్తోంది.  డయాబెటిస్ వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించడం వల్ల దాన్ని రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ముందుగానే ఈ పరీక్ష చేయించుకుంటే చాలా జాగ్రత్త పడవచ్చు. థైరాయిడ్ టెస్ట్.. చాలా మంది మహిళలు అసాధారణంగా బరువు పెరగడం,  బరువు తగ్గడం వంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే జుట్టు బాగా రాలిపోవడం,  అలసట,  నెలసరి సమస్యలు ఎదురుకావడం వంటివి కూడా ఎదుర్కొంటూ ఉంటారు.  ఇవన్నీ థైరాయిడ్ వల్ల ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.  థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినా,  సరిగా పనిచేయకపోయినా కూడా శరీరంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. లిపిడ్ ప్రోపైల్.. (కొలెస్ట్రాల్ టెస్ట్).. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి,  కొలెస్ట్రాల్ స్థాయిలు తెలుసుకోవడానికి లిపిడ్ ప్రోపైల్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పాప్ స్మియర్ టెస్ట.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా ముఖ్యమైనది.  ఇది చాలా ప్రమాదమైనది.  దీన్నే సర్వై కల్ క్యాన్సర్ అంటారు. 30ఏళ్లు దాటిన మహిళలు ప్రతి 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి.  అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విస్.. మహిళలలో గర్భధారణ సమస్యలు,  రక్తహీనత,  నెలసరి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, పెల్విన్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలను అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకోవడం మంచిది. ఇది పైబ్రాయిడ్స్, సిస్ట్స్, పిసిఓయస్,  గర్భాశయం, అండాశయాల ఆరోగ్యం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. విటమిన్-డి, విటమిన్-బి-12.. మహిళలలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా,  నరాల సమస్యలు లేకుండా బాగుండాలన్నా, అలసట, మూడ్ స్వింగ్స్ వంటివి లేకుండా ఉండాలన్నా విటమిన్-డి, విటమిన్-బి12 చాలాముఖ్యం.  ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా విటమిన్ లోపాలు తెలుసుకుని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు. రక్తపోటు.. బీపి.. చాలామంది చిన్న వయసులోనే హై బీపితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే హై బీపి అనేది ఒకేసారి బయట పడదు.  అందుకే అప్పుడప్పుడు బీపి చెక్ చేయించుకుంటూ ఉంటే దాని స్థాయులను బట్టి ఆహార జాగ్రత్తల ద్వారా బీపి కి చెక్ పెట్టవచ్చు. బరువు, బిఎంఐ.. నేటికాలంలో డయాబెటిస్,  పిసిఓయస్ వంటి సమస్యలు రావడానికి అధికబరువు కారణం అవుతుంది.  అందుకే  ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.  దీనికోసం బిఎంఐ టెస్ట్ బాగా సహాయపడుతుంది. అలాగే అప్పుడప్పుడు  బరువును చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రెస్ట్ పరీక్ష.. మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ లలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ముఖ్యమైనది.  బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవాలి.   ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని, తర్వాత సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం మంచిది. ఇది బ్లెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి సహాయపడుతుంది. పై పరీక్షలను ఏడాదికి ఒకసారి లేదా 2ఏళ్లకు ఒకసారి చేయించుకోవడం వల్ల మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు.                                       *రూపశ్రీ.

శీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది!

 శీతాకాలంలో ఉదయాన్నే వాకింగ్.. ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది! వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. వేసవికాలంలో అయినా, శీతాకాలంలో అయినా వాకింగ్ చేయడానికి మంచి వాతావారణం ఉండాలని అనుకుంటాం.  అయితే ప్రతి ఏడాది ఎండలు అయినా,  చలి అయినా విపరీతంగా పెరుగుతూ వస్తోంది.  దీని కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి.  ఉదయాన్నే వాకింగ్ చేయడం మంచిదే అయినా చలికాలంలో విపరీతమైన చలి,  పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఉదయం పూట వాకింగ్ ప్రమాదాలు కూడా కలిగించే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.  చలికాలంలో ఉదయాన్నే వాకింగ్ చేయడం గురించి ఆరోగ్య  నిపుణులు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకుంటే.. చలికాలంలో వాకింగ్.. మహిళకు మంచిదా? ఎముకలు, కండరాల సాంద్రత, బలం వంటివి మగవారితో పోలిస్తే ఆడవారిలో చాలా తక్కువ.  మహిళలు చాలా వరకు పోషకాలు, ప్రోటీన్ లోపాన్ని,  కాల్షియం లోపాన్ని ఎదుర్కుంటూ ఉంటారు. చలికాలంలో చలి కారణంగా ఎముకలు, కండరాల పనితీరు మారుతుంది. చలికి ఎముకలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. దీని వల్ల కీళ్లు, కండరాల నొప్పులు వంటివి దారుణంగా ఎదుర్కుంటూ ఉంటారు.  మహిళలకు మాత్రమే కాకుండా పురుషులకు కూడా చలికాలంలో ఉదయం వాకింగ్ అంత సేప్ కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వాకింగ్ ఎందుకు వద్దు.. తీవ్రమైన చలిలో ఉదయాన్నే బయటకు వెళ్లడం వల్ల కోల్డ్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.  గుండె జబ్బులు ఉన్నవారు, మహిళలు,  వృద్దులు సూర్యోదయం తర్వాత మాత్రమే బయటకు వెళ్లడం మంచిది.   శీతాకాలంలో సాధారణ రోజుల కంటే ఎక్కువగా కాలుష్యం ఉంటుంది. అది కూడా భూమికి దగ్గరగా ఉంటుంది. పొగమంచులో కాలుష్యం చిక్కుకుని ఉంటుంది. తెల్లవారుజామున వాకింగ్ వెళ్లడం వల్ల కలుషిత గాలి ఊపిరితిత్తులలోకి లోతుగా చేరే అవకాశం ఉంటుంది.  దీని వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి ఊపిరితిత్తుల, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాకింగ్ కు సరైన సమయం.. చలికాలంలో వాకింగ్ చేయాలంటే ఉదయం 5 లేదా 6 గంటలకు బయటకు వెళ్లడం సరికాదు. సూర్యుడి కిరణాలు బాగా ప్రసరించే సమయంలో వాకింగ్ కు వెళ్లడం ఉత్తమం.  ఉదయం పూట సుమారు 8 నుండి 9 గంటల మధ్య వాకింగ్ చేయడం మంచిది.  దీని వల్ల శరీరానికి విటమిన్-డి కూడా అందుతుంది. శరీర ఉష్టోగ్రత  బాలెన్స్డ్ గా ఉంటుంది. వాకింగ్ కు ప్రత్యామ్నాయం.. సాధారణంగా మహిళలకు ఉదయం సమయంలో ఇంటి పనులు అంటూ చాలా ఉంటాయి.  ఈ కారణంగా వాకింగ్ అనేది కుదరదు. అలాంటి వారు యోగా,  స్ట్రెచింగ్,  ఇంట్లోనే స్పాట్ రన్నింగ్ వంటివి చేయవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగై శరీర ఉష్ణోగ్రత బాగుంటుంది.  పైగా మహిళలు వంట పనితో పాటు ఇంట్లో పనులన్నీ చేసుకోవడం కోసం నీటిలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కాబట్టి వారి ఉష్ణోగ్రత   బాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం.                                   *రూపశ్రీ.

ఈ విటమిన్ బాగుంటేనే మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..!

ఈ విటమిన్ బాగుంటేనే  మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..! మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటేనే వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అయితే నేటికాలంలో  ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడం,  ఎగ్స్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  దీనికి గల కారణాలలో విటమిన్ లోపాలు కూడా ఒకటి. మరీ ముఖ్యంగా విటమిన్-డి లోపిస్తే మహిళలలో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందని,  ఎగ్స్ నిల్వలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఎగ్స్ విషయంలో విటమిన్-డి పాత్ర ఏమిటి? గర్బం దాల్చాలనుకునే మహిళలకు ఇది ఎంత అవసరం? మొదలైన విషయాలు తెలుసుకుంటే.. విటమిన్-డి.. విటమిన్-డి ప్రతి ఒక్కరి అవసరం.  దీన్ని సన్ లైట్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.  ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా,  డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గాలన్నా విటమిన్-డి స్థాయిలు పుష్కలంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ విటమిన్-డి మహిళలలో ఎగ్ క్వాలిటీ, ఎగ్ నిల్వల ఆరోగ్యానికి చాలా అవసరం అని అంటున్నారు. విటమిన్-డి, గుడ్ల నాణ్యత.. మహిళల అండాశయంలో గుడ్ల నాణ్యత బాగుంటే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగినంత విటమిన్ డి స్థాయిలు ఉన్న స్త్రీలలో మెరుగైన అండాశయ నిల్వలు,  అధిక-నాణ్యత గల గుడ్లను కలిగి ఉంటాయి. ఎందుకంటే విటమిన్ డి గ్రాహకాలు అండాశయాలలో ఉంటాయి. ఇక్కడ అవి ఫోలికల్ పెరుగుదల,  గుడ్డు పరిపక్వతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఫోలికల్ అబివృద్దిని, ఎగ్స్ మెచ్యురిటీని ప్రభావితం చేస్తాయి. ఇది  ప్రెగ్నెన్సీ  అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. విటమిన్-డి స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అయ్యే ప్రెగ్నెన్సీ లో కడుపులో బిడ్డ బలహీనంగా ఉండే అవకాశాలు  ఉంటాయి. విటమిన్-డి.. ఇంప్లాంటేషన్.. ఎగ్స్ హెల్తీగా, క్వాలిటీతో ఉండటానికే కాదు.. ఫలదీకరణంలో   కూడా విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.  గర్భం ప్రారంభం కావాలంటేట పిండం గర్భాశయ పొరలో సక్సెస్ గా అమరాలి.  ఈ ప్రక్రియకు రోగనిరోధక శక్తి బాలెన్స్డ్ గా ఉండటం చాలా అవసరం.  ఇది పిండాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.  విటమిన్-డి గర్బాశయంలోని రోగనిరోధక కణాలను మాడ్యులేట్ చేయడం ద్వారా పిండం గర్బాశయ పొరలో సక్సెస్ గా అమరడంలో సహాయపడుతుంది. IVF చికిత్సలో కూడా విటమిన్-డి స్థాయిలు అధికంగా ఉన్న మహిళలు,  విటమిన్-డి స్థాయిలు తక్కువగా ఉన్న మహిళల కంటే  తొందరగా గర్బం దాల్చగలుగుతారని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. అందుకే గర్భం దాల్చడానికి ప్రయత్నించే వారు విటమిన్-డి స్థాయిలు తగినంత ఉండేలా చూసుకోవాలి. అలాగే గర్భం దాల్చిన మహిళలు కడుపులో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-డి స్థాయిలు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.                                *రూపశ్రీ.

35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే!

35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే! ప్రతి స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన క్షణం. ఇది సాధారణ మహిళ నుండి అమ్మతనం వైపు మహిళను మార్పు చెందించే అంశం. కానీ వయసు పెరిగే కొద్దీ శరీర జీవ గడియారం నెమ్మదిస్తుంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో, చాలా మంది మహిళలు కెరీర్ కోసం, సెటిల్ కావడం కోసం,  వ్యక్తిగత లక్ష్యాల కారణంగా తల్లి కావడాన్ని  ఆలస్యం చేస్తున్నారు. మరీ ముఖ్యందా గత కొన్నేళ్లలో ఆలస్యంగా తల్లి కావడం అనే సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. వివాహం అయిన వెంటనే పిల్లలను కనాలని చాలా మంది పెద్దలు కొత్తగా పెళ్లైన జంటలను ఒత్తిడి చేస్తుంటారు.  వయస్సు దాటిపోతుందని లేదా పెద్ద వయస్సులో పిల్లలను కనడం సమస్యగా ఉంటుందని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే  తల్లి కావడానికి సరైన వయస్సు ఉందా? ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం  కష్టమవుతుందా? దీని గురించి తెలుసుకుంటే.. తల్లి కావడానికి సరైన వయస్సు.. వైద్యపరంగా 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గర్భధారణకు అత్యంత సురక్షితమైనదని,  చాలా   అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వయసులో మహిళల శరీరంలో అండాల  నాణ్యత అద్భుతంగా ఉంటుంది.  సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ కూడా పెద్ద కష్టం లేకుండా సులువుగానే సాధ్యమవుతుంది. గర్భధారణ సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ 30 లేదా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం ప్రమాదకరం లేదా అసాధ్యమని దీని అర్థం కాదు. ఇప్పట్లో  లక్షలాది మంది మహిళలు 35, 38, 40 ఏళ్లు పైబడిన వయసులో కూడా గర్భాన్ని దాల్చి  ఆరోగ్యకరమైన  బిడ్డలకు జన్మనిస్తున్నారు. అయితే  దీనికి కావలసిందల్లా కొంచెం అవగాహన,  వైద్యుల   పర్యవేక్షణ. 35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడంలో సమస్యలు.. స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె శరీరంలో కొన్ని సహజ జీవ మార్పులు జరుగుతాయి. అండాల సంఖ్య,  నాణ్యత.. పుట్టినప్పటి నుండి అండాల నిల్వ పరిమితంగా ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత అండాల నాణ్యత తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది గర్భం దాల్చే అవకాశాలను కొద్దిగా తగ్గిస్తుంది. క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం..  వయస్సు పెరిగే కొద్దీ పిండంలో క్రోమోజోమ్ లు అసాధారణంగా మారే  ప్రమాదం పెరుగుతుంది. ఇది గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది. గర్భధారణలో సమస్యలు.. అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లంప్సియా,  అకాల ప్రసవం వంటి సమస్యల ప్రమాదం 35 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది. కానీ వీటిని ఆధునిక చికిత్స,  రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సంతానోత్పత్తి.. 40 సంవత్సరాల తర్వాత సహజంగా గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కొన్నిసార్లు IVF లేదా ఇతర మార్గాలు అవసరం కావచ్చు.                              *రూపశ్రీ.

రక్తం తక్కువ ఉన్నప్పుడు ఏం తినాలి...

రక్తం తక్కువ ఉన్నప్పుడు ఏం తినాలి.. ప్రతి జీవికి రక్తం ప్రదానమైనది.  ఆహారం ద్వారా లభించే శక్తి రక్తం ద్వారానే శరీర అవయవాలకు చేరుతుంది.  ఆక్సిజన్ సరఫరాకు రక్తమే ప్రధానం,  శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలన్నా, గుండె పనితీరు బాగుండాలన్నా, ముఖ్యంగా మహిళలకు నెలసరి సమస్యలు లేకుండా ఆరోగ్యం బాగుండాలన్నా,  కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలన్నా,  సుఖ ప్రసవం జరగాలన్నా ప్రధానమైనది రక్తమే. రక్తంలో  రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి.  ఒకటి ఎర్ర రక్త కణాలు, రెండవది  హిమోగ్లోబిన్. ఇవి రక్త స్థాయిలను నిర్ణయిస్తాయి. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు రక్తహీనత అనే సమస్య వస్తుంది. రక్తహీనత  మొత్తం శరీర పనితీరును దెబ్బతీస్తుంది. ఇది అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, శ్వాస ఆడకపోవడం,  హృదయ స్పందనలు వేగంగా ఉండటం,కాళ్లు, చేతులు చల్లగా ఉండటం,  తలనొప్పి అధికంగా ఉండటం వంటి సమస్యలకు  కారణమవుతుంది. ఇది  మెదడు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఐరన్ కు రక్తానికి మధ్య సంబంధం.. శరీరంలో రక్త స్థాయిలు ఆరోగ్యంగా ఉండటానికి  ఐరన్ చాలా  అవసరం.  ఎందుకంటే ఇది హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల నుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకెళుతుందని. రక్తహీనతకు యాపిల్ .. రక్తహీనతకు యాపిల్  తినడం చాలా మంచి మార్గమని వైద్యులు చెబుతున్నారు. యాపిల్స్ లో ఐరన్  పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ యాపిల్స్ తినడం వల్ల ఐరన్  తిరిగి లభిస్తుంది.  రక్త స్థాయిలు మెరుగుపడతాయి. యాపిల్స్ చాలా పోషకమైన పండు. కానీ రక్తాన్ని పెంచడానికి చాలామంది   దానిమ్మపండ్లను సజెస్ట్ చేస్తుంటారు. కానీ యాపిల్స్ రక్తాన్ని పెంచడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. యాపిల్ లో ఐరన్ కంటెంట్.. 1 కప్పు తొక్క తీసిన ఆపిల్ ముక్కలలో 0.8mg ఐరన్  ఉంటుంది. పురుషులకు రోజుకు 8mg ఐరన్  అవసరం,  స్త్రీలకు ఇంకా  ఎక్కువ అవసరమవుతుంది. యాపిల్  తింటే కలిగే ఇతర బెనిఫిట్స్.. యాపిల్ పండు బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది.  యాపిల్స్ లో  విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ తో పాటు నీటి శాతం కూడా మెరుగ్గా ఉంటాయి.  కాబట్టి రక్తహీనత ఉన్నవారు వీలైనంత వరకు యాపిల్స్ ను తింటూ ఉంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి.                              *రూపశ్రీ.  

పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..!

పాలకూర, బీట్ రూట్ కంటే ఎక్కువ ఐరన్ ఉండే విత్తనాలు.. లేడీస్ తప్పనిసరిగా తినాలి..! ఆడవారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఐరన్ లోపం,  పోషకాల లోపం వల్ల అనీమియా, కండర ద్రవ్యరాశి,  ఎముకలు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి.  అయితే తక్కువ పరిమాణంలో తిన్నా శరీరానికి మెరుగ్గా పోషకాలు అందించగల ఆహారాలు ఇలాంటి లేడీస్ సమస్యలకు చక్కగా చెక్ పెడతాయి. అలాంటి వాటిలో గుమ్మడికాయ విత్తనాలు ప్రముఖమైనవి. అసలు గుమ్మడికాయ విత్తనాలలో ఉండే పోషకాలేంటి? వీటిని ఆహారంలో ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు? తెలుసుకుంటే.. గుమ్మడికాయ గింజలలో పోషకాలు.. గుమ్మడికాయ గింజలు ప్రోటీన్, మెగ్నీషియం,  ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా ఐరన్  కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతిరోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల  ఆరోగ్యం బలోపేతం అవుతుందని మహిళా వైద్యులు అంటున్నారు. ఐరన్ కు పవర్ హౌస్.. గుమ్మడికాయ గింజలు ఐరన్ కు  అద్భుతమైన మూలం. వాటిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పాలకూర,  బీట్ రూట్ వంటి ఐరన్ సోర్స్ ఎక్కువగా ఉన్న  ఆహారాల కంటే ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి,  శరీరమంతా ఆక్సిజన్ రవాణాకు ఐరన్ చాలా అవసరం. ఈ విత్తనాలను ప్రతిరోజూ గుప్పెడు తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.  ఇది రోజంతా  శక్తివంతంగా ఉంచుతుంది. మంచి నిద్ర, మనశ్శాంతి.. గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ట్రిప్టోఫాన్ మెదడును ప్రశాంతపరుస్తుంది,  సెరోటోనిన్ అనే హార్మోన్ స్రావంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  సెరోటోనిన్ ను హ్యాపీ ఫీలింగ్ హార్మోన్ అని అంటారు.  ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.   హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్.. గుమ్మడికాయ విత్తనాలలోని మెగ్నీషియం  ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. మెగ్నీషియం శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ కణాలు రక్తంలో చక్కెరను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్,  ప్రీ-డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. చర్మం, జుట్టు, గోళ్లు.. గుమ్మడికాయ గింజలు జింక్,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన కలయిక. జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది,  చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  విటమిన్ E జుట్టు కుదుళ్లకు పోషణ ఇస్తాయి. ఇవి జుట్టు, చర్మం,  గోళ్లను ఆరోగ్యంగా, మెరిచేలా,  బలంగా ఉంచుతాయి.                                  *రూపశ్రీ.

మహిళలు చేసే ఈ తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి..!

మహిళలు చేసే ఈ తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి..!  గర్భాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో గర్భాశయంలో ప్రారంభమయ్యే తీవ్రమైన క్యాన్సర్. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమావైరస్. ఇది   లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. HPV ఇన్ఫెక్షన్ చాలా సాధారణం అయినప్పటికీ, ఇది  సోకిన ప్రతి స్త్రీకి క్యాన్సర్ రాదు. చాలా HPV ఇన్ఫెక్షన్లు శరీరం తనకు తానే పరిష్కరించుకుంటుంది.  ఇది దాదాపు 2 సంవత్సరాలలో నయం అయిపోతుంది. కానీ మహిళల  రోజువారీ అలవాట్లు కొన్ని ఈ వైరస్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ అలవాట్లు శరీరం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి, ఇది HPV సంక్రమణను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతుంది.  ఇన్ఫెక్షన్ చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఇది  చివరికి క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రమాదానికి మూల కారణాలను అర్థం చేసుకుని, సరైన సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నివారించవచ్చు. మహిళలు రోజువారీ చేసే ఏ తప్పుల వల్ల గర్బాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందో తెలుసుకుంటే.. స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా.. క్రమం తప్పకుండా గర్భాశయ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోకపోవడం చాలా పెద్ద తప్పు. ఈ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్‌గా మారడానికి ముందే క్యాన్సర్‌కు ముందు వచ్చే మార్పులను గుర్తిస్తుంది. 25 మరియు 65 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌లు చేయించుకోవాలి. ఈ పరీక్షను వాయిదా వేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆహారం.. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.  ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు,  తక్కువ పండ్లు,  కూరగాయలు తిన్నప్పుడు  ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. ఈ లోపం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు HPV ఇన్ఫెక్షన్‌తో ఎక్కువ కాలం పోరాడలేరు. దీని వలన ఇన్ఫెక్షన్ కొనసాగి,  క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భధారణ నిర్ణయాలు.. చిన్న వయసులోనే మొదటి గర్భం దాల్చడం, పదే పదే గర్భం దాల్చడం వల్ల గర్భాశయ కణాలు మరింత సున్నితంగా మారతాయి.  అలాగే.. ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల ఏదైనా  గర్భనిరోధక మాత్ర తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                 *రూపశ్రీ.

వెట్ వైప్స్.. చాలామంది మహిళలు ఉపయోగించే వెట్ వైప్స్ గురించి ఈ నిజాలు తెలుసా..

 వెట్ వైప్స్.. చాలామంది మహిళలు ఉపయోగించే వెట్ వైప్స్ గురించి ఈ నిజాలు తెలుసా.. చర్మ సంరక్షణలో భాగంగా చాలామంది మహిళలు వెట్ వైప్స్వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి తగిన సమయం లేదా వాతావరణం లేనప్పుడు, మేకప్ తొలగించడానికి సమయం లేనప్పుడు వెట్ వైప్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా తొందరగా ముఖ చర్మం మీద మురికి, నూనె,  మేకప్.. మొదలైనవాటిని తొలగిస్తాయి. ఇవి చర్మ సంరక్షణకు మంచిదే అయినప్పటికీ వీటిని పదే పదే ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  ఇంతకీ వెట్ వైప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలేంటి? వీటి గురించి చాలామందికి తెలియని నిజాలు తెలుసుకుంటే.. వెట్ వైప్స్ లో ఏముంటుంది? వెట్ వైప్స్ లో ఆల్కహాల్,  రసాయనాలు, సువాసనలు ఉంటాయి.  ఇవి చర్మానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. వెట్ వైప్స్ ఎక్కువగా వాడితే ఏం జరుగుతుంది? వెట్ వైప్స్‌ను చాలా ఎక్కువగా  ఉపయోగిస్తే, వాటిలోని ఆల్కహాల్,  రసాయనాలు  చర్మంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. ఇది కొన్నిసార్లు  చర్మాన్ని చాలా పొడిగా చేస్తుంది. ఎంత మాయిశ్చరైజర్ వాడినా దానిని తగ్గించడం కష్టం అవుతుంది. ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వెట్ వైప్స్ ను పదే పదే ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం, దురద,  దద్దుర్లు వస్తాయి. కొన్నిసార్లు, ఈ చికాకు చాలా ఎక్కువగా  అవుతుంది. ఇది హాస్పిటల్స్ కు వెళ్లే పరిస్థితిని కూడా తీసుకురావచ్చట.  ఇప్పటికే సెన్సిటివ్ స్కిన్ ఉంటే వెట్ వైప్స్ వాడకపోవడం బెటర్. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్  సులభంగా మొటిమలకు, ర్యాషెస్ కు గురవుతుంది. చిన్న వయసులోనే ముసలి వాళ్ల లాగా ముఖ చర్మం కనిపిస్తుంటే.. వెట్ వైప్స్ వాడటం కారణం కావచ్చు.   వెట్ వైప్స్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం సహజత్వాన్ని కోల్పోయి చాలా త్వరగా వృద్దాప్యానికి లోనవుతుంది.                             *రూపశ్రీ.

మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి!

మహిళల్లో అత్యంత ప్రాణాంతకర క్యాన్సర్ ఇదే.. దీని గురించి తప్పక తెలుసుకోవాలి!   ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  అన్ని రకాల క్యాన్సర్‌లతో ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తాయి.  గర్భాశయ క్యాన్సర్ అలాంటి తీవ్రమైన సమస్య.  2020లో గర్భాశయ క్యాన్సర్ 6.04 లక్షల కొత్త కేసులు,  3.42 లక్షల కంటే ఎక్కువ మరణాలు చేసింది.  ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్ . ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ఈ ఆరోగ్య   సమస్య గురించి ప్రజల్లో అవగాహన పెంచడం,  నివారణ, స్క్రీనింగ్,  చికిత్స గురించి మహిళలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జనవరి నెలను 'సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెల'గా జరుపుకుంటారు. సర్వైకల్ క్యాన్సర్.. సర్వైకల్ క్యాన్సర్  గర్భాశయంలో వచ్చే క్యాన్సర్. ఇది యోనితో అనుసంధానించబడిన గర్భాశయం యొక్క దిగువ భాగం. ఈ క్యాన్సర్ తరచుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.  దీని లక్షణాలను గుర్తించడం కష్టం. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) గర్భాశయ క్యాన్సర్  రావడానికి  అత్యధిక  కారణమవుతుంది. HPV అనేది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఒక సాధారణ అంటువ్యాది. శరీరం  రోగనిరోధక వ్యవస్థ HPV వైరస్‌ను నాశనం చేయగలిగినప్పటికీ తక్కువ శాతం మంది వ్యక్తులలో వైరస్ సంవత్సరాలు శరీరంలోనే ఉండి క్యాన్సర్‌కు కారణమవుతుంది. గర్భాశయ క్యాన్సర్  లక్షణాలు.. సాధారణంగా గర్భాశయ క్యాన్సర్  ప్రారంభ దశలలో ఎటువంటి లక్షణాలు కనిపించవు, అందుకే దాని ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నప్పుడు, కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి, వీటి గురించి  శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. సంభోగం తర్వాత లేదా పీరియడ్స్ లేకపోయినా, లేదా  మెనోపాజ్ తర్వాత యోనిలో రక్తస్రావం. భారీ ఋతు రక్తస్రావం లేదా సాధారణం కంటే ఎక్కువ కాలం ఉండటం. యోని ద్వారం దుర్వాసన. సంభోగం సమయంలో పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది? ఆరోగ్య నిపుణుల ప్రకారం కొన్ని పరిస్థితులు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నా. లైంగిక భాగస్వాములు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇది కాకుండా చిన్న వయస్సులో సెక్స్ చేయడం కూడా HPV ప్రమాదాన్ని పెంచుతుంది. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) కూడా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.  రోగనిరోధక వ్యవస్థ మరొక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బలహీనపడి  HPV ఇన్ఫెక్షన్ వస్తే గర్భాశయ క్యాన్సర్‌ కు గురయ్యే అవకాశం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ధూమపానం చేసే  మహిళలకు HPV ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉండచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను ఎలా నివారించాలి? కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ను అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం HPV వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. HPV సంక్రమణను నివారించడానికి టీకాలు వేయడం గర్భాశయ క్యాన్సర్,  ఇతర HPV సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. HPV వ్యాక్సిన్  సరైనదా, కాదా అని  వైద్యుడిని అడగి తీసుకోవాలి.  ఇది కాకుండా డాక్టర్ సలహాపై రెగ్యులర్  పరీక్ష చేయించుకోవాలి. పాప్ పరీక్ష గర్భాశయంలో క్యాన్సర్ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడుతుంది.                                                        *నిశ్శబ్ద.

మహిళలూ ఈ లక్షణాలను విస్మరించకూడదు.. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు!

మహిళలూ ఈ లక్షణాలను విస్మరించకూడదు.. బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు!   బ్రెస్ట్ క్యాన్సర్ ( రొమ్ము క్యాన్సర్) నేటికాలంలో మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒక్కటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఈ మహమ్మారి వల్ల దాదాపు పదిమిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో 2.26మిలియన్ల మంది బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని WHO వెల్లడించింది. మనదేశంలో ఏటా దీని బారినపడి మరణిస్తున్నవారి సంఖ్య లక్షల్లో ఉందంటే ఈ మహమ్మారి ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు. 40ఏళ్లుదాటిన మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కానీ నేటికాలంలో మూడుపదుల వయస్సు దాటనివారిపై కూడా ఈ మహమ్మారి పంజావిరుస్తోంది. సరైన అవగాహన ఉన్నట్లయితే... ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. స్త్రీలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవల్సిన సమయంలో ఎన్నో బాధ్యతలు వారిని నిర్లక్ష్యం చేస్తాయి. కుటుంబ బాద్యత ఆమెదే. కానీ ఆమె ఆరోగ్యం విషయంలో మాత్రం వెనక్కు తగ్గుతుంది. ఈ నిర్లక్ష్యమే వారిలో ఎన్నో జబ్బులకు కారణం అవుతుంది. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న జబ్బుల్లో బ్రెస్ట్ క్యాన్సర్. నేటికాలంలోనూ చాలామంది మహిళల్లో ఈ మహమ్మారి గురించి అవగాన లేదు. చాలామందిలో మూడోదశకు వచ్చినప్పుడు మాత్రమే గుర్తిస్తున్నారు. గ్రామీణ, అరబ్ ప్రాంతాల నుండి మెట్రో పాలిటిక్స్ సిటీ వరకు, మహిళలు ఇప్పటికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ లేదా ఇతర రకాల రొమ్ము పరీక్ష ప్రక్రియలకు భయపడుతున్నారు. మహిళలు తమ ఆరోగ్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి? స్త్రీలలో వచ్చే వ్యాధులలో ఒకటి రొమ్ము క్యాన్సర్. ఇది రొమ్ములో అభివృద్ధి చెందుతుంది. ఈ క్యాన్సర్ పురుషుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మహిళలకు మాత్రమే అవకాశం ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అనేది చిన్న గడ్డలతో ఏర్పడుతుంది. రొమ్ము లోపల లేదా బయట ఏర్పడతాయి. ఇది ప్రారంభ దశలో చిన్నపాటి నొప్పితో ఉంటుంది. ఆ సమయంలోనే గుర్తించినట్లయితే...ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.   రొమ్ము క్యాన్సర్ లక్షణాలు: -రొమ్ములోని ఏ భాగంలోనైనా భరించలేని నొప్పి -రొమ్ము ఆకృతిలో మార్పు -చనుమొన నుండి పాలు కాకుండా ద్రవం కారడం. -రొమ్ము వాపు, నొప్పి, బిగుతుగా అనిపించడం -చనుమొన ఎరుపు రొమ్ము క్యాన్సర్ ప్రమాద కారకాలు: -పీరియడ్స్ ముందుగానే రావడం. -శారీరకంగా చురుకుగా లేకపోవడం. -కుటుంబ చరిత్ర -గర్భనిరోధక మాత్రలు -వ్యాయామం చేయకపోవడం. -అనారోగ్యకరమైన ఆహారం రొమ్ము క్యాన్సర్ చికిత్స: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, బయాప్సీని ఉపయోగిస్తారు. సరైన సమయంలో రొమ్ము క్యాన్సర్  ను గుర్తిస్తే  చికిత్స, నివారణ రెండూ సాధ్యమే. డైటరీ థెరపీ, బ్రెస్ట్ సర్జరీ, మందులు, హార్మోన్ల ఇంజెక్షన్లు మొదలైన వాటిని నివారించాలి. అయితే, దాని చికిత్స అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో క్యాన్సర్ దశ, రోగి వయస్సు, స్థానం, మానసిక ఆరోగ్యం, రోగి యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!     గర్భధారణ స్త్రీకి మరొక కొత్త ప్రపంచాన్ని పరచయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  గర్భవతులైన స్త్రీలు సమతుల ఆహారాన్ని,  పోషకాలు సమృద్దిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.  అయితే కొంతమంది మహిళలు ముందు రోజు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ తింటూ ఉంటారు. రుచి కోసమో లేక మిగిలిపోతుందనో.. లేక ఖరీదైనదనో.. ఏదో ఒక కారణం తో ముందురోజు ఆహారం తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే.. గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చేసే తప్పులలో అతి పెద్ద తప్పు ముందురోజు ఆహారాన్ని తినడం. ఇలా పాతబడిన ఆహారం తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు తాజాగా వండిన పోషకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని వారు చెబుతున్నారు. ముందురోజు ఆహారం లేదా పాతబడిన ఆహారం తినడం వల్ల గర్భవతులలో చాలా ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కడుపులో పిండం అభివృద్ది మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.  ముందురోజు మిగిలిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇలా గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడితే అది అకాల ప్రసవాలకు,  గర్భస్రావాలకు, తక్కువ బరువు ఉన్న శిశువు జననానికి దారి తీస్తుందట. ముందురోజు మిగిలిపోయిన ఆహారం ఎందుకు తినకూడదు అనే విషయాన్ని కూడా వైద్యులు వివరించారు.  ముందురోజు ఆహారంలో సాల్మోనెలోసిస్,  లిస్టెరియోసిస్ వంటి బ్యాక్టీరియా,  వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు అతిపెద్ద కారణాలు. గర్భం ధరించాలని అనుకునే మహిళలు, గర్భవతులు ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు. బయట నుండి తెచ్చిన ఆహారానికి వీలైనంత దూరం ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో తెచ్చినా దాన్ని వేడిగా ఉన్నట్టే తినాలి. బయట తెచ్చిన ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు.                                          *రూపశ్రీ.

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకో గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో తెలుసా...   మూసాంబి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.  దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మూసాంబి జ్యూస్, సిట్రస్ ఫ్రూట్, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. మోసంబి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది.   ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబును నివారిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది: మీ శరీరానికి డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి, కాలుష్యం యొక్క విష ప్రభావాలను తొలగిస్తుంది, ఇది శరీరం యొక్క సహజ డిటాక్స్ సూపర్ స్టార్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి రక్షణ: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, మొసాంబి మంట, వాపు నుండి రక్షణ, నివారణను అందిస్తుంది. ఈ అద్భుతమైన పండు ఆస్టియో ఆర్థరైటిస్,  రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం: మూశంబి రసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మీ కోరికలను అణచివేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల అదనపు కేలరీలు కరిగిపోతాయి. మోసంబి రసం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది: మెరిసే చర్మం పొందడానికి రోజూ ఒక గ్లాసు మోసాంబి జ్యూస్ తాగండి. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. మూసాంబిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ పవర్‌తో, మీ చర్మం రక్షించబడి కాంతివంతంగా ఉంటుంది. మీ డల్ స్కిన్ కి గ్లో ఇస్తుంది. జీర్ణక్రియకు మంచిది: మోసంబి జ్యూస్ కేవలం దాహాన్ని తీర్చేది కాదు. సమతుల్య జీర్ణవ్యవస్థకు ఇది మంచి పానీయం. మీ జీర్ణ రసాలు శక్తిని పెంచుతాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందుతాయి. ఇది జీర్ణ రసాలు, ఆమ్లాలు, పిత్త స్రావాన్ని పెంచడం ద్వారా జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే ఫ్లేవనాయిడ్ల యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల, అజీర్ణం, క్రమరహిత ప్రేగు కదలికలు, ఇతర జీర్ణశయాంతర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మోసంబి జ్యూస్ చాలా మేలు చేస్తుంది.

సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి..!

సిజేరియన్ ప్రసవాన్ని ఎంచుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి..!   ప్రతి మహిళ గర్బం దాల్చడం,  ప్రసవించడం చాలా గొప్ప అనుభవం. వారికి ఒక కొత్త ప్రపంచాన్ని తెచ్చిపెడుతుంది ఈ దశ. అయితే ఈ రోజుల్లో సిజేరియన్ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. నేటి మహిళలు త్వరగా సిజేరియన్ చేయించుకుని ప్రసవం చేసుకోవాలని కోరుకుంటున్నారు.  సాధారణ ప్రసవం శ్రమతో, నొప్పితో కూడుకున్నదని, అందుకే సిజేరియన్ చేయించుకోవడం మంచిదని అనుకునేవారు చాలా ఎక్కువ.  అయితే చాలామంది మహిళలకు తెలియని షాకింగ్ నిజాలను గైనకాలజిస్టులు తెలిపారు.  సిజేరియన్ బెస్ట్ అనుకునే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలేంటో తెలుసుకుంటే.. గతంలో సాధారణ ప్రసవాలు ఎందుకు సమస్య లేకుండా జరిగాయి? పాత కాలంలో మహిళలు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకునేవారు. ఉదయం లేచిన తర్వాత ఇల్లు ఊడ్చడం, తుడవడం, బట్టలు ఉతకడం, మెట్లు ఎక్కడం,  వంట చేయడం,  ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినడం వంటివి జరిగేవి.   అప్పట్లో ఏది తిన్నా జీర్ణమయ్యేది. అందుకే బరువు పెరగలేదు. ఇప్పట్లో బరువు పెరుగుదల.. ఇప్పటి కాలంలో మహిళలు కూడా నిశ్చలంగా ఉండే జీవనశైలిలో ఎక్కువ గడుపుతుంటారు. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు చూడటం, పుస్తకాలు చదవడం,  జంక్ ఫుడ్ లేదా చిప్స్ తినడం  చేస్తారు. శీతల పానీయాలు తాగడం కూడా సర్వసాధారణమైపోయింది. వీటికి తోడు వ్యాయామం లేకపోవడం కూడా బరువు పెరగడానకి దారి తీస్తుంది. సమస్య ఇదే.. శారరీక వ్యాయామాన్ని జీవనశైలి లో భాగం చేసుకోకపోవడం వల్ల  బరువు పెరగడం జరుగుతోంది. దీని వల్ల రక్తపోటు,  , మధుమేహం,  థైరాయిడ్ సమస్యలు గతంలో కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా, గర్భం ధరించాక ప్రసవానికి దగ్గర పడే కొద్ది  మహిళలు మానసికంగా బలహీనంగా మారతారు.  అందుకే చాలా మంది మహిళలు ప్రసవానికి ముందు ధైర్యం కోల్పోయి సిజేరియన్ డెలివరీని ఎంచుకుంటారు. మహిళల జీవనశైలి మారడం,  శారీరక శ్రమ లేకపోవడం సిజేరియన్ ప్రసవాలు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. అందువల్ల, గర్భధారణ సమయంలో వీలైనంత చురుకుగా ఉండాలి.  శారీరకంగా చురుకుగా ఉండడం ద్వారా సి-సెక్షన్ కాకుండా సాధారణ డెలివరీ చాలా సులభంగా జరుగుతాయి.                              *రూపశ్రీ.

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మహిళలలో ఉన్న అపోహలు.. వాస్తవాలు!   ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల జీవితంలో అయినా గొప్ప సందర్భం ఏదైనా ఉందంటే అది వారు తల్లికావడమే. నవమాసాలు మోసి బిడ్డను కంటారనే విషయం తెలిసిందే అయినా ఆ తొమ్మిది నెలలు మహిళలు తమ జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కొంటార. ఆహారం దగ్గర నుండి శరీరాకృతి వరకు ప్రతి ఒక్కటీ మారిపోతుంది. అయితే ప్రసపం తరువాత పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం. సుమారు 6నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు కూడా చెబుతారు. అయితే తల్లిపాలు ఇవ్వడం గురించి చాలామంది మహిళలలో అపోహలు ఉన్నాయి. పాలు తక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని,  ఎన్ని నెలల వరకు పిల్లలకు పాలు ఇవ్వాలని, తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏమిటని ఇలా చాలా విషయాలలో  అపోహలు, వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే అందరికీ ఈ విషయంలో ఒక అవగాహన ఏర్పడుతుంది. పాలివ్వడంలో అసౌకర్యం.. ప్రసవించిన తరువాత పిల్లలకు పాలివ్వడంలో ప్రతి తల్లీ అసౌకర్యానికి గురవుతుంది. పిల్లలు పాలు తాగడం లేదని, పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటుంటారు. అయితే మొదటిసారి ప్రసవం అయిన మహిళలకు పిల్లలను హ్యాండిల్ చేయడం, రొమ్ములకు దగ్గరగా పిల్లలను పెట్టుకోవడం, పిల్లలకు సౌకర్యంగా ఉండటం వంటి వాటిలో కాస్త విఫలం అవుతారు. ఇది రోజులు గడిచేకొద్ది అలవాటు అవుతుంది. పిల్లలకు పాలిచ్చేటప్పుడు పెద్దల సహాయం తీసుకుంటే ఇందులో ఇబ్బంది చాలా వరకు అధిగమిస్తారు. పాలిచ్చే ముందు శుభ్రత.. చాలామంది పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములను, చనుమొనలను శుభ్రం చేసుకోవడం గురించి మాట్లాడుతుంటారు. అయితే ఇలా శుభ్రం చేయాల్సిన అవసరమే లేదు. పిల్లలు ప్రసవించిన తరువాత తల్లిని వాసన, స్పర్శ ద్వారా గుర్తిస్తారు. చనుమొనలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీని వాసన కారణంగా పిల్లలు తమ తల్లులను గుర్తిస్తారు. ఇది  పిల్లలకు  ఉపయోగకరమైనది. కాబట్టి పాలిచ్చే ముందు రొమ్ములను శుభ్రం చెయ్యాల్సిన అవసరం లేదు. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగించకూడదు.. పాలిచ్చే తల్లులు మందులు ఉపయోగిస్తే అవి పిల్లలకు చెడు చేస్తాయని చాలామంది అంటారు. అయితే పాలిచ్చే తల్లులు తమ సమస్యలను వైద్యులతో చెప్పేటప్పుడు పిల్లలకు పాలిస్తున్న విషయాన్ని చెప్పాలి. దీన్ని బట్టి వైద్యులు ప్రత్యేక మందులు సిఫారసు చేస్తారు. వీటి వల్ల తల్లీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే వైద్యులు సూచించిన విధంగానే మందులు తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోవాలి. సొంతంగా మందులు వాడటం, వైద్యులు చెప్పిన నిర్ణీత కాలం కంటే  ఎక్కువ రోజులు  మందులు పొడిగించి వాడటం చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిపాలివ్వకూడదు.. తల్లులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలకు పాలివ్వకూడదని చాలా మంది అంటారు. అయితే ఇది తల్లులకు ఉన్న సమస్య పైన ఆధారపడి ఉంటుంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలో కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే  ఆహారం, పుష్కలంగా ద్రవాలు తీసుకోవడం తల్లులకు ఎంతో ముఖ్యం. అనారోగ్యాన్ని బట్టి వైద్యుల సలహా మీద మాత్రమే పిల్లలకు పాలివ్వడం మంచిది. తల్లులకు పాల కొరత.. చాలామంది మహిళలు తమకు పాలు తక్కువ పడుతున్నాయని, పిల్లలకు సరిపోవడం లేదని ఫర్యాదు చేస్తుంటారు. అయితే ఇది చాలా వరకు అపోహే అని అంటున్నారు. బిడ్డను రొమ్ముపై సౌకర్యవంతంగా ఉంచుకుని పాలివ్వడంలోనే చాలావరకు పొరపాటు జరుగుతుందట. సౌకర్యవంతంగా పిల్లలకు రొమ్ము అందిస్తే పిల్లలు కూడా కడుపు నిండుగా పాలు తాగుతారు. అలాగే పిల్లలు పాలు ఎంత బాగా తాగితే తల్లులలో పాలు అంత బాగా ఉత్పత్తి అవుతాయి. ఆహారం.. పాలిచ్చే తల్లులు ఆహారం విషయంలో ఎలాంటి గందరగోళం చెందాల్సిన పనిలేదు. అందరిలానే పాలిచ్చే తల్లులు కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తల్లులు ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారిలో పాలు ఉత్పత్తి కావడంలో సమస్యలు ఎదురే కావు. గమనిక: పై విషయాలు పోషకాహార నిపుణులు, మహిళా వైద్యులు పలుచోట్ల ప్రస్తావించిన అంశాల ఆధారంగా పొందపరచబడినవి.                                         *నిశ్శబ్ద. 

ఆయుర్వేదం ప్రకారం అమ్మాయిలు పీరియడ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఆయుర్వేదం ప్రకారం అమ్మాయిలు పీరియడ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..   పీరియడ్స్ అమ్మాయిలకు ఒక దశ వచ్చాక ప్రతి నెల పలకరిస్తుంటాయి.  నిజానికి చాలామంది పీరియడ్స్ వల్ల వచ్చే నొప్పుల గురించి, అసౌకర్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ పీరియడ్స్ రాకపోయినా కంగారు పడాల్సిందే.  పీరియడ్స్ ప్రతినెలా కరెక్ట్ గా వస్తుంటేనే అమ్మాయిలలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  ఆయుర్వేదం అమ్మాయిల నెలసరి విషయంలో కొన్ని జాగ్రత్తలు సూచించింది.  అమ్మాయిలకు నెలసరి వచ్చాక మూడు రోజుల పాటు కొన్ని జాగ్రత్తలతో కూడిన నియమాలు తప్పనిసరి అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మహిళలలో నెలసరి సమయంలో పునరుత్పత్తి ఆరోగ్యం, హార్మోన్లు, భావోద్వేగాల ఆరోగ్యంగా పేర్కొనే మానసిక  ఆరోగ్యం మొదలైనవి కాపాడటానికి 3రోజుల దినచర్యను ఆయుర్వేదం పేర్కొంది. దీన్నే ఋతు సంరక్షణ లేదా నెలవారీ రీసెట్ అని అంటారు. నెలవారీ రీసెట్ సూత్రం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పనిచేయకూడదు.  ఒక పని చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం వల్ల హార్మోన్ల ప్రవాహం ఆరోగ్యంగా ఉండి నెలసరి సమయంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. పైన పేర్కొన్న కారణాల వల్లే నెలసరి వచ్చాక మొదటి మూడు రోజులు పూర్తీగా విశ్రాంతి తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతుంది.  ఈ కారణంగానే నెలసరి వచ్చినప్పుడు మూడు రోజులు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ కదలకుండా ఒక చోట కూర్చుని విశ్రాంతి తీసుకోమని చెబుతారు. కానీ నేటి కాలం దీన్ని అర్థం చేసుకోకుండా వక్రీకరిస్తుంది. కొందరు ఈ మూడు రోజుల సమయంలో మహిళలకు విశ్రాంతి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ దుర్భాషలాడుతూ ఉంటారు.  మరికొందరు ఇంటి పనులకు దూరంగా ఉండాలనే విషయాన్ని అంటరానితనం తో చూస్తూ నెలసరి సమయంలో ఉన్న మహిళలను, అమ్మాయిలను మాటలతో చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. నెలసరి సమయంలో మనస్సును,  శరీరాన్ని  ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల హార్మోన్లు ప్రశాంతంగా ఉంటాయి. మహిళల శరీరంలో వచ్చే మార్పులు అయినా, అనారోగ్యాలు అయినా చాలా వరకు హార్మోన్లు బ్యాలెన్స్ తప్పడం వల్లనే వస్తుంటాయి. అందుకే నెలసరి సమయంలో మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం, జపం,  లేదా నిశ్శబ్ద సాధన వంటివి చేయడం చాలా సహాయపడతాయి. నెలసరి సమయంలో తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు,  వెచ్చని  ఆహారాలు తీసుకోవాలి. ఈ సమయంలో మరీ చల్లగా ఉన్న ఆహారం లేదా చాలా వేడిగా ఉన్న ఆహారం నిషేధించాలి. ఆహారంలో కిచిడి, గంజి, ఉడికించిన  కూరగాయలు, మజ్జిగ వంటివి బాగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు.. కారంగా ఉండే ఆహారాలు,  మాంసాహారం, మద్యం తీసుకోవడం, శీతలపానీయాలు అస్సలు తీసుకోకూడదు. జీర్ణం కావడానికి కష్టమైన ఆహారాలు తీసుకుంటే రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. ఆయుర్వేదం  ప్రకారం శరీర ఉష్టోగ్రతను తల నియంత్రిస్తుందట. అందుకే నెలసరి వచ్చిన మూడు రోజులలో తలస్నానం చేయకూడదని చెబుతారు.  ఒక వేళ తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత దెబ్బతిని రక్తస్రావ ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందట. నెలసరి సమయంలో ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే అది నెలసరి సమయంలో అధిక నొప్పి,  పిసిఓయస్ వంటి హార్మోన్ సమస్యలు,  పిల్లలు కనడంలో ఇబ్బందులు వంటివి రావడానికి కారణం అవుతాయని అంటున్నారు. ఆధునిక వైద్యశాస్త్రం కూడా నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవాలని, అది ఆరోగ్యం పై,  హార్మోన్ల పై ప్రభావం చూపించి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతోంది. ఈ సమయంలో గర్భాశయం మరమ్మత్తు చేయడం, రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి అంతర్గతంగా జరుగుతాయట. కాబట్టి ఆయుర్వేదం చెప్పిన జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించడం మంచిది.                                    *రూపశ్రీ.