చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..!

Publish Date:Dec 19, 2025

చలికాలంలో పార్టీస్.. ఈ డ్రెస్సులతో ధూమ్ ధామ్ లుక్ వచ్చేస్తుంది..! వేసవికాలంలో ఎండలు మండినట్టు చలికాలంలో చలి వణికిస్తుంది.  వద్దనుకున్నంత మాత్రాన ఇవన్నీ మాయమైపోవు. వాతావరణానికి తగ్గట్టు మనుషులే మారాలి.  ఆహారం,  వస్త్రధారణ అలవాట్లు మార్చుకోవాలి. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి డ్రస్సులు వేసుకున్నా  చెల్లుతుంది. కానీ పార్టీలు, ఫంక్షన్లకు చాలా అందంగా తయారై వెళ్లాలి. చలి కారణంగా అందంగా, అట్రాక్షన్ గా తయారవ్వడం కాసింత కష్టం అనిపిస్తుంది.  కానీ అమ్మాయిలు ఈ చలికాలంలో అందంగా, ఆకర్షణగా కనిపించడానికి కొన్ని డ్రస్సులు ఉన్నాయి.  వాటిని ధరిస్తే పార్టీలో సెంటరాప్ అట్రాక్షన్ గా ధూమ్ ధామ్ లుక్ లో కనిపిస్తారు. ఆ డ్రస్సులేంటో ఒక లుక్కేస్తే.. కో ఆర్డర్ సెట్.. పార్టీస్ లో అట్రాక్షన్ గా కనిపించడానికి కో ఆర్డర్ సెట్ చాలా బాగుంటుంది.  వెచ్చని క్రాప్ టాప్ తో అటాచ్ చేయాలి. పైన  బ్లేజర్ వేసుకోవడం వల్ల చాలా అట్రాక్షన్ వచ్చేస్తుంది.  క్యాజువల్ అమ్మయి అనే ట్యాగ్ పక్కన పెట్టి లేడీ బాస్ టైప్ ట్యాగ్ ఇచ్చేస్తారు.  ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పోనీ టైల్ వేస్తే ఇంకా అధిరిపోతుంది. లాంగ్ స్టైల్.. లేయరింగ్ ఇష్టపడే అమ్మాయిలు లాంగ్ డ్రెస్ లను నల్లటి స్కివ్వీస్ తో జత చేసి వేసుకోవచ్చు.  ఈ డ్రెస్ లో హీల్స్ ధరిస్తే క్లాసీ లుక్ వచ్చేస్తుంది.  దీనికి ఐ మేకప్ మరింత అట్రాక్షన్ తెస్తుంది. హెయిర్ ను అలా లూస్ గా వదిలేస్తే అదిరిపోతుంది. బాడీకాన్ తో భలే.. రంగు ఏదైనా సరే.. బాడీకాన్ డ్రెస్ లు చాలా బాగుంటాయి. అమ్మాయిలకు ఈ డ్రెస్ ఇచ్చే ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఇలాంటి డ్రెస్ కు ఫ్లీస్ లెగ్గింగ్స్ జతచేయాలి. డ్రెస్ పైన స్టూల్ లేదా బ్లేజర్ ధరిస్తే కంప్లీట్ లుక్ సొంతమైనట్టే.  ఇది పార్టీకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుంది.  నార్మల్ లుక్ ను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. కంఫర్ట్ లుక్.. దుస్తులను వివిధ రకాలుగా ధరించడం వల్ల లుక్ అయితే బాగుంటుంది కానీ కొన్ని సార్లు అవి అసౌకర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా కాకుండా కంఫర్ట్ గా ఉంటూ పార్టీస్ కు అటెండ్ అయ్యి  అట్రాక్షన్ గా నిలవాలంటే ఒక మంచి టాప్,  దానితో ఫిట్టెడ్ జీన్స్ ధరించాలి.  టాప్ పైన మంచి జాకెట్ ఒకటి ధరించాలి.  హెయిర్ ను లూస్ గా వదిలేసి తలకు  ఒక మంచి క్యాప్ ధరించాలి. ఈ డ్రెస్ కు హై లెంగ్త్ బూట్ లు వేసుకుంటే భలే కనిపిస్తారు.   ]పైన చెప్పుకున్నవే కాకుండా దుస్తుల పట్ల మంచి అభిరుచి ఉన్నవారు తమ దగ్గరున్న దుస్తులనే కాంబినేషన్ మారుస్తూ మంచి ఔట్ ఫిట్ ను రెఢీ చేసుకోవచ్చు. కొత్త ఫ్యాషన్ ను క్రియేట్ చేయవచ్చు.    *రూపశ్రీ. 
[

Beauty

]

చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా!

Publish Date:Dec 12, 2025

చలికాలం కదా అని ముఖం మీద క్రీమ్స్ పూస్తున్నారా... ఈ షాకింగ్ నిజాలు తెలుసా! చలికాలం చర్మానికి పరీక్ష కాలం.  చలి,  చల్లగాలి కారణంగా చర్మం పగులుతుంది. చలి కారణంగా చాలామంది నీరు తక్కువ తాగుతారు.  ఈ కారణంగా కూడా శరీరంలో నీరు తగ్గి చర్మం పొడిబారుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి చాలామంది మాయిశ్చరై జింగ్ క్రీములు, స్కిన్ కేర్ క్రీములు,  స్కిన్ రిపేర్ క్రీములు అంటూ చాలా రకాలు పూస్తుంటారు. ఇవి చర్మానికి తేమను అందించడంలో సహాయపడతాయని,  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని అనుకుంటారు. కానీ ఈ క్రీములను ఇష్టమొచ్చినట్టు వాడినా, లేక తప్పుగా ఉపయోగించినా చర్మానికి చాలా డేంజర్ అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. స్కిన్ క్రీమ్స్.. చర్మానికి ఉపయోగించే క్రీములలో ప్రోటీన్లు,  కొవ్వులు అధికంగా ఉంటాయి.  ఇవి కొంతమంది చర్మంపై దద్దుర్లు, బ్లాక్ హెడ్స్ లేదా మొటిమలు వంటివి కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు,  జిడ్డు చర్మం గలవారు ఈ క్రీమ్స్ ను వాడటం వల్ల అలెర్జీ కి గురికావడం లేదా చర్మ రంధ్రాలు మూసుకుపోయి చర్మ సంబంధ సమస్యలు రావడం వంటి వాటికి కారణం అవుతుంది. స్కిన్ కోసం వాడే క్రీములు తాజాగా లేకపోయినా లేదా చర్మం మీద ఎక్కువ సేపు ఉంచినా అవి చర్మ ఇన్ఫెక్షన్లు,  నల్లటి మచ్చలు రావడానికి కూడా కారణం అవుతుంది.అందుకే చర్మానికి వాడే క్రీములు తాజాగా ఉండాలి. అలాగే చర్మానికి క్రీమ్స్ రాసేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  అదేవిధంగా చర్మానికి కేవలం వారంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వాడటం మంచిది. క్రీమ్స్  ఉపయోగించేవారు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. క్రీమ్స్ ను జాగ్రత్తగా వాడినప్పుడే వాటి ఫలితం బాగుంటుంది.  లేకపోతే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి.                                                *రూపశ్రీ.
[

Health

]

35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే!

Publish Date:Dec 13, 2025

35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడం మంచిదేనా.. వైద్యులు ఏం చెప్తున్నారంటే! ప్రతి స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది మధురమైన క్షణం. ఇది సాధారణ మహిళ నుండి అమ్మతనం వైపు మహిళను మార్పు చెందించే అంశం. కానీ వయసు పెరిగే కొద్దీ శరీర జీవ గడియారం నెమ్మదిస్తుంది. నేటి వేగవంతమైన ప్రపంచంలో, చాలా మంది మహిళలు కెరీర్ కోసం, సెటిల్ కావడం కోసం,  వ్యక్తిగత లక్ష్యాల కారణంగా తల్లి కావడాన్ని  ఆలస్యం చేస్తున్నారు. మరీ ముఖ్యందా గత కొన్నేళ్లలో ఆలస్యంగా తల్లి కావడం అనే సంఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. వివాహం అయిన వెంటనే పిల్లలను కనాలని చాలా మంది పెద్దలు కొత్తగా పెళ్లైన జంటలను ఒత్తిడి చేస్తుంటారు.  వయస్సు దాటిపోతుందని లేదా పెద్ద వయస్సులో పిల్లలను కనడం సమస్యగా ఉంటుందని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే  తల్లి కావడానికి సరైన వయస్సు ఉందా? ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం  కష్టమవుతుందా? దీని గురించి తెలుసుకుంటే.. తల్లి కావడానికి సరైన వయస్సు.. వైద్యపరంగా 20-30 సంవత్సరాల మధ్య వయస్సు గర్భధారణకు అత్యంత సురక్షితమైనదని,  చాలా   అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఈ వయసులో మహిళల శరీరంలో అండాల  నాణ్యత అద్భుతంగా ఉంటుంది.  సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ కూడా పెద్ద కష్టం లేకుండా సులువుగానే సాధ్యమవుతుంది. గర్భధారణ సమస్యలు తక్కువగా ఉంటాయి. కానీ 30 లేదా 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడం ప్రమాదకరం లేదా అసాధ్యమని దీని అర్థం కాదు. ఇప్పట్లో  లక్షలాది మంది మహిళలు 35, 38, 40 ఏళ్లు పైబడిన వయసులో కూడా గర్భాన్ని దాల్చి  ఆరోగ్యకరమైన  బిడ్డలకు జన్మనిస్తున్నారు. అయితే  దీనికి కావలసిందల్లా కొంచెం అవగాహన,  వైద్యుల   పర్యవేక్షణ. 35ఏళ్ల తర్వాత గర్బం దాల్చడంలో సమస్యలు.. స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె శరీరంలో కొన్ని సహజ జీవ మార్పులు జరుగుతాయి. అండాల సంఖ్య,  నాణ్యత.. పుట్టినప్పటి నుండి అండాల నిల్వ పరిమితంగా ఉంటుంది. 35 సంవత్సరాల తర్వాత అండాల నాణ్యత తగ్గడం ప్రారంభమవుతుంది, ఇది గర్భం దాల్చే అవకాశాలను కొద్దిగా తగ్గిస్తుంది. క్రోమోజోమ్ సమస్యల ప్రమాదం..  వయస్సు పెరిగే కొద్దీ పిండంలో క్రోమోజోమ్ లు అసాధారణంగా మారే  ప్రమాదం పెరుగుతుంది. ఇది గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది. గర్భధారణలో సమస్యలు.. అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లంప్సియా,  అకాల ప్రసవం వంటి సమస్యల ప్రమాదం 35 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది. కానీ వీటిని ఆధునిక చికిత్స,  రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సంతానోత్పత్తి.. 40 సంవత్సరాల తర్వాత సహజంగా గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. కొన్నిసార్లు IVF లేదా ఇతర మార్గాలు అవసరం కావచ్చు.                              *రూపశ్రీ.

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..!

Publish Date:Dec 16, 2025

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..! కీళ్ల నొప్పులు మహిళలలోనే ఎక్కువ కనిపిస్తుంటాయి.  సాధారణంగా పురుషుల కంటే మహిళలలోనే ఎముకల బలహీనత ఉంటుంది. ఈ కారణంగా కాల్షియం లోపం కూడా బయటపడుతూ ఉంటుంది.  మరీ ముఖ్యంగా గర్భధారణ,  బరువు పెరగడం, తిరిగి బరువు తగ్గడం, కేవలం ఇంటి పనులు మాత్రమే చేస్తూ వ్యాయామం వంటివి చేయకపోవడం, ఆహారం పట్ల నిర్లక్ష్యం.. ఇలా చాలా విషయాలు మహిళలలో కీళ్ళ నొప్పులు రావడానికి కారణం అవుతాయి.  కీళ్ల నొప్పులను వైద్య భాషలో ఆర్థరైటిస్ అని అంటారు.  ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో కీళ్ళ నొప్పులతో పాటు కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి.  కూర్చోవడం, లేవడం వంటి పరిస్థితులలో ఇది చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ కీళ్ల నొప్పులకు చెక్ పెట్టడానికి ఆహారం చాలా కీలకం అని వైద్యులు,  పోషకాహార నిపుణులు  అంటున్నారు.  ఇంతకూ కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఏం తినాలి? తెలుసుకుంటే.. కీళ్ల నొప్పులకు ఒమేగా-3.. ఒమేగా-3 శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల వాపు,  నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులకు అవిసె గింజలు.. అవిసె గింజలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో ప్రభావవంతగా పని చేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవిసె గింజలలోని పోషకాలు..  అవిసె గింజలలో ఫైబర్, కాల్షియం,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి,  ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలను  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా,  మొత్తం గుండె ఆరోగ్యం,  జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. అవిసె గింజలు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభించే  ఉత్తమ శాఖాహార పదార్థాలలో అవిసె గింజలు  ఒకటి.  ముఖ్యంగా ALA అంటే.. ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం వీటిలో ఉంటుంది. ALA శరీరంలో శోథ నిరోధక సమ్మేళనంగా మారుతుంది. అవిసె గింజలను పొడిగా చేసి పెరుగు, ఓట్ మీల్ లేదా స్మూతీలలో కలపి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. చియా విత్తనాలు.. చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న విత్తనాలు నీటిని పీల్చుకుని, కీళ్లను ద్రవపదార్థం చేయడానికి సహాయపడే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. చియా గింజలను రాత్రిపూట నీటిలో లేదా పెరుగులో నానబెట్టి  చియా పుడ్డింగ్‌గా తయారు చేయవచ్చు. గుమ్మడి.. గుమ్మడికాయ గింజలలో  జింక్,  మెగ్నీషియం  పుష్కలంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌లో మంటను నియంత్రించడంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. నువ్వులు.. నువ్వులలో సెసామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. నువ్వుల గింజలు కాల్షియం,  ఐరన్  కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి,  మరమ్మత్తుకు అవసరం. సన్ ఫ్లవర్ సీడ్స్..  విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది.  అలాంటి విటమిన్-E పుష్కలంగా లభించే విత్తనాలలో పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రధానమైనవి.  విటమిన్ E వాపును తగ్గించడంలో,  కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలు మెగ్నీషియం ను  కూడా అందిస్తాయి.  పైన పేర్కొన్న విత్తనాలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే మహిళలలో కీళ్ల నొప్పు,  ఎముకల సమస్యలు నెమ్మదిగా తగ్గిపోయి ఎముకలు దృఢంగా మారతాయి.                             *రూపశ్రీ.
[

Yoga

]

PCOS సమస్యకు చెక్ పెట్టేందుకు సహాయపడే యోగా ఆసనాలు..!

Publish Date:Dec 5, 2025

PCOS సమస్యకు చెక్ పెట్టేందుకు సహాయపడే యోగా ఆసనాలు..! PCOS మహిళలను చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య.  భారతదేశంలో చాలామంది మహిళలు PCOS తో సఫర్ అవుతున్నాయి. చాలమంది మహిళలకు అసలు తమకు PCOS ఉన్నట్టు కూడా తెలియదు. పిసిఓయస్ సమస్య  ఉన్న స్త్రీలలో నెలసరి సరిగా లేకపోవడం,  బరువు పెరగడం, అవాంఛిత రోమాలు, హార్మోన్ల అసమతుల్యత, గర్భం ధరించడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతుంటాయి.  హార్మోన్ల అసమతుల్యత,  ఇన్సులిన్ నిరోధకత, ఒత్తిడి మొదలైనవి పిసిఓఎస్ కు కారణం అవుతాయి.  వీటన్నింటిని తగ్గించడంలో యోగా మెరుగ్గా పనిచేస్తుంది. తద్వారా పిసిఓఎస్ సమస్యకు చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది, అండాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,  జీవక్రియను పెంచుతుంది. పిసిఓఎస్ తగ్గడానికి సహాయపడే 5 యోగాసనాల గురించి తెలుసుకుంటే.. PCOS/PCOD తగ్గడంలో సహాయపడే ఆసనాలు.. భుజంగాసనం.. థైరాయిడ్,  అండాశయ పనితీరును తిరిగి మెరుగ్గా ఉండేలా చేస్తింది.  హార్మోన్లను బ్యాలెన్స్  చేస్తుంది. భుజంగాసనాన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్  చేయడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గుతుంది. సేతుబంధాసనం.. సేతుబంధాసనం  ఉద్రిక్తత,  వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని ప్రాక్టీస్  చేయడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. బాలసన.. బాలసన ప్రాక్టీస్ చేస్తే  మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఒత్తిడి హార్మోన్ అయిన  కార్టిసాల్‌ను తగ్గిస్తుంది. ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పశ్చిమోత్తాసనము.. పశ్చిమోత్తాసనం అండాశయాలు,  గర్భాశయ కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఋతు చక్రం మెరుగుపడుతుంది. సుప్త బద్దకోణాసనం..  PCOSలో కటి ఆరోగ్యానికి  సుప్త బద్దకోణాసనం  అత్యంత ప్రభావవంతమైన ఆసనాలలో ఒకటి. ఇది చేయడం వల్ల పొత్తి కడుపు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  పొట్ట ఆరోగ్యానికి  ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది                            *రూపశ్రీ.

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..!

Publish Date:Dec 18, 2025

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..! ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివిగా ఉండాలని కోరుకుంటారు.  అయితే పిల్లల చిన్నతనం చాలా వరకు తల్లి చుట్టూనే గడుస్తుంది. ఈ కారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినా,  లేదా అల్లరి చేసినా, పిల్లల నడవడిక తప్పుగా ఉన్నా.. వెంటనే తల్లినే నిందిస్తూ ఉంటారు చాలామంది.  కానీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలన్నా,  వారి నడవడిక చక్కగా ఉండాలన్నా ప్రతి తల్లి కొన్ని పనులు చేయాలి.  ఆ పనులేంటో తెలుసుకుంటే.. లైబ్రరీ.. పిల్లలను లైబ్రరీకి తీసుకెళ్లడం లేదా ఇంట్లోనే మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి.  పిల్లలు ఏదైనా చదువుతున్నప్పుడు చదివిన విషయం ద్వారా వారు ఏం అర్థం చేసుకున్నారు అడగాలి.  ఇది పిల్లల ఆలోచన తీరును మారుస్తుంది. కమ్యూనికేషన్.. పిల్లలు తెలివిగా మారాలంటే తల్లులకు ఓపిక చాలా ముఖ్యం.  ప్రతి తల్లి పిల్లలతో చాలా ఓపెన్ గా మాట్లాడాలి.  పిల్లలు చెప్పే విషయాన్ని చిరాకు పడకుండా శ్రద్దగా వినాలి. అలాగే పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాలి. పిల్లలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి.  వారు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకోవాలి. పిల్లలు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. పరిష్కారాలు.. పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి.  అవన్నీ వారికి చాలా పెద్దవిగా, పెద్దలకు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి.  పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని ప్రతిది తల్లిదండ్రులు చెప్పకూడదు.  ముఖ్యంగా పిల్లల సమస్యలకు నువ్వేతై ఏం చేస్తావ్,  ఎలా ఉంటే బాగుంటుంది వంటి ప్రశ్నలు వేసి పిల్లల సమస్యలకు పరిష్కారం వారే వెతుక్కునేలా చేయాల్సింది తల్లులే. రోల్ మోడల్.. పిల్లలను రూలింగ్ చేయడం కాదు.. వారికి రోల్ మోడల్ గా ఉండాలి. పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం, ప్రతి  పనిని శ్రద్దగా చేయడం,  ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండటం, పెద్దలు, ఇతరులతో గౌరవంగా మర్యాదగా మాట్లాడటం వారికి నేర్పాలి. పిల్లల స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది.  వారితో మాట్లాడేటప్పుడు వారి పెద్దతరం అనే గీత నుండి బయటకు వచ్చి వారితో సరదాగా కలిసిపోయి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే పిల్లలు పెద్దలు చెప్పినదాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలరు. పైన చెప్పుకున్న పనులన్నీ చేయగలిగితే ప్రతి తల్లి తమ పిల్లలను తెలివైన వారిగా మార్చడంలో తమ వంతు కృషి చేసినట్టే.                           *రూపశ్రీ.

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..!

Publish Date:Dec 17, 2025

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..! అందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా.. ఎక్కువకాలం బ్రతకాలని అందరి డ్రీమ్. కానీ నేటి కాలంలో చాలా రకాలుగా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడం చాలా మందిని కలతకు గురి చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, చర్మం ముడతలు పడటం చూస్తూ ఉంటాం.  ఇలాంటి వారు చాలా ఆత్మన్యూనతా భావం కు లోనవుతారు.  కానీ చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలతో ఇబ్బంది పడుతున్న వారు నేటి కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు.  వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.  కానీ ఫలితం అంతగా ఉండదు. ఇలా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలు రావడం రూజువారి చేసే కొమమ్ తప్పుల వల్ల జరుగుతుందట.  ఇంతకీ ఆ  అలవాట్లు ఏంటి? వాటి వల్ల చర్మం ఎందుకు తొందరగా వృద్దాప్యానికి గురి అవుతుంది.  తెలుసుకుంటే..  చర్మం తొందరగా ఎందుకు వృద్దాప్యానికి గురవుతుంది? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది యువకులు ఒత్తిడి,  నిద్ర సరిగా లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ముడతలు,  బలహీనత వంటి  ఏర్పడి తొందరగా ముసలి వాళ్లలా కనిపిస్తుంటారు. ఎక్కువ చక్కెర,  ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర కణాలలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చర్మం ముడుచుకుపోతుంది.  చిన్న వయసులోనే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి . చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడానికి కారణమయ్యే అలవాట్లు.. నిద్ర.. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో మంచి నిద్ర కరువవుతోంది.  ప్రతి రాత్రి కనీసం 7 నుండి 9 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ ఎక్కువగా  ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి, దీని వలన ముఖంపై ముడతలు త్వరగా కనిపిస్తాయి. ఆహారం.. ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్,  చక్కెర ఆహారాలు చాలా హానికరమైన ఆహారాల లిస్ట్ లో ఉన్నాయి.  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  స్వీట్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీర కణాలలో గ్లైకేషన్ అనే ప్రక్రియ పెరుగుతుంది. ఈ ప్రక్రియ చర్మం పొడిబారడానికి కారణమవుతుంది,  ముడతలు కనిపించడానికి దారితీస్తుంది. శ్రమ.. నేటి జీవనశైలిలో శారీరకంగా కష్టపడే పనులు ఏమీ లేవు.  కేవలం కూర్చుని చేసే ఉద్యోగాలే ఉన్నాయి.  వీటి వల్ల మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది.  శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనం అయ్యి   అది చిన్న వయసులోనే ముసలితనానికి దారి తీస్తుంది. ఒత్తిడి..  ఒత్తిడి నేటి కాలంలో చాలామంది ఎదుర్కునే పరిస్థితి. అయితే ఎక్కువ  ఒత్తిడికి గురైతే  శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతంది.  ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేయడం, చర్మం మీద గీతలు రావడం వంటి సమస్యలకు కారణమై చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనబడటానికి కారణం అవుతుంది. పైన చెప్పుకున్న అలవాట్లను మెల్లిగా మానేయడం వల్ల చిన్న వయసులోనే వృద్దాప్య సమస్యను అధిగమించవచ్చు.                              *రూపశ్రీ.  

Makara Sankranthi Special Muggulu

Publish Date:Jan 13, 2025

 

Pongal Muggulu

Publish Date:Jan 13, 2025