పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు పెట్టండి చాలు!

పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఈ ఆహారాలు పెట్టండి చాలు..! పిల్లల రోగనిరోధక వ్యవస్థ పెద్దల కంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణంగా వాతావరణం మారేటప్పుడు తొందరగా ఇన్పెక్షన్ లు పిల్లలకు ఎదురవుతాయి.  బలమైన రోగనిరోధక వ్యవస్థ కేవలం మందుల ద్వారా మాత్రమే కాదు, చిన్నతనం నుండి  సరైన ఆహారం వల్లే ఏర్పడుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పిల్లల ఆహారంలో సహజంగా యాంటీఆక్సిడెంట్లు,  విటమిన్లు అధికంగా ఉండే పోషకాలు ఉండాలి. పిల్లల రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు ఏ ఆహారాలు ఇవ్వాలో తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మకాయలు, ఆమ్లా వంటి సిట్రస్ పండ్లు పిల్లల రోగనిరోధక శక్తికి చాలా అవసరం. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. వీటిని పిల్లలకు పండ్లుగా లేదా తాజా రసంగా ఇవ్వవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించడమే కాకుండా గాయం మానడానికి, ఐరన్  శోషణకు కూడా సహాయపడుతుంది. బాదం,  వాల్ నట్స్.. బాదం,  వాల్‌నట్స్‌లో విటమిన్ ఇ,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ అనేది కణాలను దెబ్బతినకుండా రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 3-4 నానబెట్టిన బాదంపప్పులు తినిపించాలి. వాటిని రాత్రిపూట నానబెట్టడం వల్ల వాటి పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి.    జ్ఞాపకశక్తి,  శారీరక బలాన్ని మెరుగుపరుస్తాయి. పెరుగు, ప్రోబయోటిక్స్.. మన శరీరంలోని 70% రోగనిరోధక శక్తి మన కడుపు ఆరోగ్యంపై  ఆధారపడి ఉంటుంది.  ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి పిల్లలకు ప్రతిరోజూ పెరుగు ఇవ్వాలి. పెరుగులో మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పెరుగును చేర్చడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ సజావుగా నడుస్తుంది.  వారి శరీరంలో హానికరమైన క్రిములు పెరగకుండా నిరోధిస్తుంది. పెరుగులో పండ్లను జోడించి ఫ్రూట్ కర్డ్ పేరుతో ఇవ్వడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. పసుపు పాలు, సమతుల్య ఆహారం.. ఆయుర్వేదంలో పసుపును "సహజ యాంటీబయాటిక్"గా పరిగణిస్తారు. నిద్రవేళకు ముందు పిల్లలకు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు ఇవ్వడం వల్ల అంతర్గత మంట తగ్గుతుంది.  నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సరైన ఆహారంతో పాటు తగినంత శారీరక శ్రమ,  9-10 గంటల నిద్ర రోగనిరోధక శక్తిని పెంచడానికి  సహాయపడతాయి.                              *రూపశ్రీ

పోలియో టీకాల ప్రాముఖ్యత ఏంటి.. పోలియో వ్యాధి గురించి అసలు నిజాలు ఏంటి!

పోలియో టీకాల ప్రాముఖ్యత ఏంటి.. పోలియో వ్యాధి గురించి అసలు నిజాలు ఏంటి! చిన్నతనం నుండి ప్రతి ఒక్కరు.. పోలియో చుక్కలు వేయించాలి,  పిల్లల భవిష్యత్తు కాపాడాలి అనే స్లోగన్ వినే ఉంటారు.  మరీ ముఖ్యంగా స్కూల్ పిల్లలతో టీచర్లు ఊరంతా ర్యాలీ నిర్వహిస్తూ.. పోలియో చుక్కల గురించి అవగాహన పెంచాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉంటారు.  అయితే పోలియో చుక్కలు ఎందుకు వేయిస్తారు,  పోలియో వ్యాధి ఎందుకు వస్తుంది,  ఎలా వస్తుంది? చాలామందికి వీటి గురించి పూర్తీగా తెలియదు.  అందరూ వేయిస్తున్నారు కాబట్టి,  వేయిస్తే మంచిది కాబట్టి.. అనే కోణంలో చాలామంది వేయిస్తుంటారు.  కానీ పోలియో వ్యాధి గురించి,  పోలియో టీకాల గురించి తెలుసుకుంటే.. పోలియో వ్యాధి.. పోలియో అనేది పిల్లలను వికలాంగులను చేసే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇందులో పిల్లల శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల కాళ్లు, చేతులలో ఎదుగుదల లోపించడం,  వికలాంగులుగా మారడం జరుగుతుంది. పోలియో వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.  ఈ వైరస్ నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది.  దీని వలన శరీర భాగాలు కదలకుండా పక్షవాతానికి గురవుతాయి.   పోలియో వ్యాధి వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో శ్వాస తీసుకోవడానికి కీలకమైన కండరాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.  కొన్నిసార్లు మరణానికి దారితీసే అవకాశం ఉంటుంది. పోలియో టీకా.. పోలియో టీకాలు ముఖ్యంగా పోలియో వ్యాధి నివారించడానికే వేస్తారు. పోలియో టీకాలు వేశాక పిల్లల శరీరంలో పోలియో వైరస్ వ్యాపించడానికి ఆస్కారం ఉండదు. ఇది పిల్లలను మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న ఇతర పిల్లల నుండి కూడా వ్యాధి వ్యాప్తి జరగకుండా చేస్తుంది. పోలియో టీకాలను నిరంతరంగా వేస్తూ ఉండటం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పోలియో దాదాపుగా నిర్మూలించబడింది. ప్రతి పిల్లవాడికి టీకాలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తీగా నిర్మూలించవచ్చని చెబుతున్నారు. వ్యాక్సిన్ మోతాదు.. పోలియో వ్యాక్సిన్ మోతాదు కూడా చాలా కీలకం.  సరైన మోతాదు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పోలియో నివారించడం చాలా సులభం.  ఇది ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ఇవ్వబడుతుంది.                                                  *రూపశ్రీ.

పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే..

పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే.. పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి  చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా?  అలా చేస్తే ఏమవుతుంది? నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు. మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం.                                                          *నిశ్శబ్ద.  

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..!

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..! జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది.  మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వివాహం కానప్పుడు.. తల్లిదండ్రులు మనల్ని అరుస్తుంటే.. నేను పెద్దయ్యాక నా పిల్లలను ఇలా అరవను.. వారిని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని ఎన్నెన్నో మనసులో ప్రేమ్ చేసుకుంటాము.  కానీ తల్లిదండ్రులు అయ్యాక పిల్లను తిట్టడం,  కొట్టడం వంటివి చాలా జరుగుతూ ఉంటాయి.  అరవకుండా, తిట్టకుండా,  కొట్టకుండా పిల్లలను పెంచడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే.. అసలు పిల్లలను ఎందుకు అరుస్తారు? గొంతు పెంచకుండా, దెబ్బ వేయకుండా పిల్లలను దారిలో పెట్టే మార్గం లేదా.. దీని గురించి పిల్లల పెంపకం గురించి నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే.. జీవితంలో మొదటి ఏడు సంవత్సరాలలో నివసించే వాతావరణం ఆధారంగా ప్రతి వ్యక్తి మెదళ్ళు "ప్రోగ్రామ్" చేయబడతాయి. ఈ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరి  నిర్ణయాలలో 95 శాతం ఆలోచించకుండానే అలా జరిగిపోతుంది.మనం పిల్లలుగా ఉన్నప్పుడు చాలాసార్లు తిట్టించుకుని, కొట్టించుకుని ఉంటే..  మన మెదళ్లు కూడా ఇదిగో ఈ పరిస్థితిని డీల్ చేయడానికి ఇదే సరైన మార్గం అని బావిస్తాయి.  ఒత్తిడి సమయాల్లో దీన్నే రిపీట్ చేస్తూ ఉంటాము. ఒత్తిడి పెరిగినప్పుడు, ఆలోచించడానికి,  అర్థం చేసుకోవడానికి సహాయపడే మెదడు భాగం వెనక్కి తగ్గుతుంది. ప్రశాంతంగా స్పందించే బదులు,  భయం, భయాందోళన,  తొందరపాటుతో రియాక్ట్ అవుతాము. పిల్లల పైన అరిస్తే ఇవి జరుగుతాయి.. పిల్లల ప్రవర్తనను దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు అరుస్తుంటే  వారి దూకుడు ఇంకా పెరుగుతుంది. పిల్లలు ఏదైనా నేర్చుకోవడం,  వారిని వారు సేవ్ చేసుకోవడం వంటివి తగ్గిపోతాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య  బంధాన్ని బలహీనపరుస్తుంది,  మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది పిల్లల మీద అరిచేటప్పుడు కేకలు వేయడం, అవమానించినట్టు మాట్లాడటం,  కఠినమైన భాషను ఉపయోగిస్తే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. టార్గెట్.. చాలామంది ఏ పని మొదలు పెట్టినా దాన్ని సాధించడానికి కొన్ని రోజుల టైం తో టార్గెట్ పెట్టుకుంటారు. ఒక టైమ్ సెట్ చేసుకుని దాన్ని సాధించడానికి ఈ మార్గం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. కానీ దీన్ని  పిల్లల విషయంలో  అప్లై చేసినప్పుడు అది వారి జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వారికి టార్గెట్ పెట్టి ఒత్తిడి చేయకూడదు. చదవడం, రాయడం,  ఏదైనా నేర్చుకోవడం వంటి వాటికి టార్గెట్ లు పెట్టి వారిని ఒత్తిడిలోకి నెట్టకూడదు. 21రోజులు ఇలా చేస్తే.. 21రోజులు పిల్లల మీద అరవడం మానేస్తే చాలా ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. 7వ రోజు నాటికి ఆలోచనా మెదడు మళ్ళీ చురుగ్గా మారుతుంది. 14వ రోజు నాటికి తల్లిదండ్రుల మీద పిల్లల న్మకం మళ్లీ  బలపడటం ప్రారంభమవుతుంది. 21వ రోజు నాటికి పిల్లల ప్రవర్తన మారడం ప్రారంభమవుతుంది. దీనిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది భయంతో కాదు బలమైన అటాచ్మెంట్  ద్వారా జరుగుతుంది.                           *రూపశ్రీ.

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే!

పిల్లలు అల్లరి చేస్తే అరవకండి.. ఇలా చేస్తే వాళ్లలో ఎంత మార్పు వస్తుందంటే..! జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది.  మనం చిన్నగా ఉన్నప్పుడు ఇంకా వివాహం కానప్పుడు.. తల్లిదండ్రులు మనల్ని అరుస్తుంటే.. నేను పెద్దయ్యాక నా పిల్లలను ఇలా అరవను.. వారిని అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని ఎన్నెన్నో మనసులో ప్రేమ్ చేసుకుంటాము.  కానీ తల్లిదండ్రులు అయ్యాక పిల్లను తిట్టడం,  కొట్టడం వంటివి చాలా జరుగుతూ ఉంటాయి.  అరవకుండా, తిట్టకుండా,  కొట్టకుండా పిల్లలను పెంచడం అసాధ్యం అనిపిస్తుంది. అయితే.. అసలు పిల్లలను ఎందుకు అరుస్తారు? గొంతు పెంచకుండా, దెబ్బ వేయకుండా పిల్లలను దారిలో పెట్టే మార్గం లేదా.. దీని గురించి పిల్లల పెంపకం గురించి నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుంటే.. జీవితంలో మొదటి ఏడు సంవత్సరాలలో నివసించే వాతావరణం ఆధారంగా ప్రతి వ్యక్తి మెదళ్ళు "ప్రోగ్రామ్" చేయబడతాయి. ఈ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరి  నిర్ణయాలలో 95 శాతం ఆలోచించకుండానే అలా జరిగిపోతుంది.మనం పిల్లలుగా ఉన్నప్పుడు చాలాసార్లు తిట్టించుకుని, కొట్టించుకుని ఉంటే..  మన మెదళ్లు కూడా ఇదిగో ఈ పరిస్థితిని డీల్ చేయడానికి ఇదే సరైన మార్గం అని బావిస్తాయి.  ఒత్తిడి సమయాల్లో దీన్నే రిపీట్ చేస్తూ ఉంటాము. ఒత్తిడి పెరిగినప్పుడు, ఆలోచించడానికి,  అర్థం చేసుకోవడానికి సహాయపడే మెదడు భాగం వెనక్కి తగ్గుతుంది. ప్రశాంతంగా స్పందించే బదులు,  భయం, భయాందోళన,  తొందరపాటుతో రియాక్ట్ అవుతాము. పిల్లల పైన అరిస్తే ఇవి జరుగుతాయి.. పిల్లల ప్రవర్తనను దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు అరుస్తుంటే  వారి దూకుడు ఇంకా పెరుగుతుంది. పిల్లలు ఏదైనా నేర్చుకోవడం,  వారిని వారు సేవ్ చేసుకోవడం వంటివి తగ్గిపోతాయి. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య  బంధాన్ని బలహీనపరుస్తుంది,  మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది పిల్లల మీద అరిచేటప్పుడు కేకలు వేయడం, అవమానించినట్టు మాట్లాడటం,  కఠినమైన భాషను ఉపయోగిస్తే నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. టార్గెట్.. చాలామంది ఏ పని మొదలు పెట్టినా దాన్ని సాధించడానికి కొన్ని రోజుల టైం తో టార్గెట్ పెట్టుకుంటారు. ఒక టైమ్ సెట్ చేసుకుని దాన్ని సాధించడానికి ఈ మార్గం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. కానీ దీన్ని  పిల్లల విషయంలో  అప్లై చేసినప్పుడు అది వారి జీవితాన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. వారికి టార్గెట్ పెట్టి ఒత్తిడి చేయకూడదు. చదవడం, రాయడం,  ఏదైనా నేర్చుకోవడం వంటి వాటికి టార్గెట్ లు పెట్టి వారిని ఒత్తిడిలోకి నెట్టకూడదు. 21రోజులు ఇలా చేస్తే.. 21రోజులు పిల్లల మీద అరవడం మానేస్తే చాలా ఆశ్చర్యకరమైన మార్పులు జరుగుతాయి. 7వ రోజు నాటికి ఆలోచనా మెదడు మళ్ళీ చురుగ్గా మారుతుంది. 14వ రోజు నాటికి తల్లిదండ్రుల మీద పిల్లల న్మకం మళ్లీ  బలపడటం ప్రారంభమవుతుంది. 21వ రోజు నాటికి పిల్లల ప్రవర్తన మారడం ప్రారంభమవుతుంది. దీనిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇది భయంతో కాదు బలమైన అటాచ్మెంట్  ద్వారా జరుగుతుంది.                           *రూపశ్రీ.

పిల్లలను కింద పడుకోబెట్టగానే నిద్రలేస్తారు ఎందుకంటే..!

పిల్లలను కింద పడుకోబెట్టగానే నిద్రలేస్తారు ఎందుకంటే..! చిన్న పిల్లల విషయంలో చాలా మంది ఎదుర్కునే అతి పెద్ద సమస్య వారిని నిద్రపుచ్చడం.  పిల్లలను ఎత్తుకుని నిద్ర పుచ్చినా సరే.. వాళ్లను మంచం మీద లేదా ఉయ్యాలలో పడుకోబెట్టగానే టక్కున లేస్తుంటారు. చాలామంది తల్లులు ఈ సంఘటనలకు పిల్లల మీద చిరాకు కూడా పడుతూ ఉంటారు. అయితే పిల్లలు కావాలని ఇలా నిద్రలేవరు. దీని వెనుక చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి.   అవేంటో తెలుసుకుంటే.. పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.  వారి శరీరంలో కదలికలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి.  వారి శరీరం అభివృద్ది చెందే దశలో ఉంటుంది. తల్లుల కంటే కూడా పిల్లల శరీరం చాలా చురుగ్గా రియాక్ట్  అవుతుంది.  మరీ ముఖ్యంగా నవజాత శిశువులు చాలా తొందరగా రియాక్ట్ అవుతారు.   స్టార్టల్ రిప్లెక్స్.. మోరో రిఫ్లెక్స్ నే స్టార్టెల్ రిఫ్లెక్స్ అని కూడా పిలుస్తారు.   పడుకున్నప్పుడల్లా  బిడ్డ మేల్కొనడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఇది మొదటి 4 నెలలు చాలా బలంగా ఉంటుంది. ఇది ఉష్ణోగ్రత తగ్గడం, ఉష్టోగ్రతలో మార్పు లేదా ఉన్నట్టుండి కదలడం  వంటి చర్యల ద్వారా జరుగుతుంది. బిడ్డ చేతులు చాచి, శరీరాన్ని బిగించి, ఏడుస్తూ మేల్కొనేలా చేస్తుంది.  శిశువులకు శారీరక సాన్నిహిత్యం మరియు స్పర్శ కోసం బలమైన కోరిక ఉంటుంది, ముఖ్యంగా మొదటి 6 నెలలు ఇది ఎక్కువగా ఉంటుంది.  పిల్లలు తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు భద్రతగా ఫీలవుతారు. గ్యాస్, రిప్లక్స్.. పిల్లలు పాలు తాగిన తర్వాత వారిని ఎత్తుకుని ఉన్నప్పుడు కడుపులో గాలి బుడగలు త్రేన్పుల రూపంలో బయటకు వచ్చేస్తాయి.  కడుపు హాయిగా అనిపిస్తుంది. కానీ పిల్లలను పడుకోబెట్టినప్పుడు గాలి కదలకుండా గ్యాస్ గా మారి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది.  ఇది పిల్లలు మేల్కోవడానికి కారణం అవుతుంది.                            *రూపశ్రీ.  

పిల్లలు బరువు పెరుగుతున్నారా.. దయచేసి లైట్ తీసుకోకండి!

పిల్లలు బరువు పెరుగుతున్నారా.. దయచేసి లైట్  తీసుకోకండి! పిల్లలు బరువు పెరుగుతుంటే ముద్దుగా, బొద్దుగా ఉన్నారని మురిసిపోతారు తల్లిదండ్రులు.  ఎవరైనా సరే వారి లావు గురించి మాట్లాడితే దిష్టి పెడుతున్నారని మండిపడతారు కూడా. అయితే పిల్లలు బరువు పెరగడం అనే విషయాన్ని తీవ్రంగా పరిగణించకూడదని అంటున్నారు చిన్న పిల్లల వైద్యులు. బరువు పెరిగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటున్నారు. అసలు పిల్లలు బరువు పెరిగితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుంటే.. తల్లిదండ్రుల పొరపాటు.. పిల్లలు ముద్దుగా, బొద్దుగా ఉంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. పిల్లల లావు, బరువు వారి  ఆరోగ్యానికి ప్రధానం అని తల్లిదండ్రులు అనుకుంటారు.  అయితే పిల్లలు ఎక్కువగా బయటకు వెళ్లకుండా,  బయటి ప్రదేశంలో ఆడుకోకుండా,  ఎలాంటి శారీరక శ్రమ లేదా వ్యాయామం వంటివి లేకుండా ఉంటే అది పిల్లలకు చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అదిక బరువు లేదా ఊబకాయం.. ప్రమాదాలు.. చిన్నతనంలోనే అధిక బరువు ఉండటం వల్ల కలిగే అతిపెద్ద సమస్య.. టైప్ 2 డయాబెటిస్‌. చిన్నతనంలో   టైప్-2 డయాబెటిస్ కు, అదిక బరువుకు చాలా  బలమైన సంబంధం  ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదిక బరువు ఉన్న పిల్లలలో టైప్-2 డయాబెటిస్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊబకాయం ఉన్న పిల్లలు అధిక రక్తపోటు,  లిపిడ్ స్థాయిలు అసాధారణంగా ఉండటం, ఫ్యాటీ లివర్,   హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. పాఠశాలకు వెళ్లే పిల్లలు.. భారతదేశంలో పాఠశాల వయస్సు పిల్లలలో ఎక్కువ భాగం ఊబకాయంతో బాధపడుతున్నారని జాతీయ,  ప్రాంతీయ స్థాయిలో జరిపిన పరిశోధనలలో వెల్లడైందని సమాచారం.   గత  10 సంవత్సరాల కాలంలో  ఈ రేటు క్రమంగా పెరిగింది. ఆందోళ కలిగించే విషయం ఏంటంటే.. ఈ సమస్య కేవలం పట్టణాలలో నివసించే పిల్లలలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాలలో నివసించే పిల్లలలో కూడా ఉంటోంది. పిల్లలో ఊబకాయం ఎందుకంటే.. నేటి తరం పిల్లలు జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు,  చక్కెర అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతోంది. తల్లిదండ్రుల జాగ్రత్త..  తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే తమ పిల్లల ఆహారంపై శ్రద్ధ వహించాలి. పిల్లలకు సమతుల్య,  పోషకమైన ఆహారం అందించాలి. ఈ ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు,  తగినంత ప్రోటీన్ ఉండాలి. పిల్లలు చక్కెర, ఉప్పు,  అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం పరిమితం చేయడం  చాలా ముఖ్యం. శారీరక శ్రమ కూడా ఆహారంతో పాటు ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.  పిల్లలు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాలు తేలికగా  లేదా తీవ్రమైన వ్యాయామంలో పాల్గొనాలి. తల్లిదండ్రులు పిల్లలు నడక, సైక్లింగ్, బయట  ఆటలు ఆడటం,  వివిధ క్రీడలలో పాల్గొనమని ప్రోత్సహించాలి.  స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం,  తగినంత నిద్ర పొందడం కూడా ఊబకాయాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు దీనిని గుర్తుంచుకోవాలి.                              *రూపశ్రీ.

పిల్లలు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి..!

పిల్లలు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి..! డబ్బు మనిషి బ్రతకడానకి కీలక పాత్ర పోషిస్తుంది. నేటి కాలంలో డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం.  పెద్దలు డబ్బు గురించి అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటూ డబ్బు పొదుపు చేయగలుగుతారు. కానీ పిల్లలకు అంత అవగాహన ఉండదు.  పిల్లలకు వారికి నచ్చినది దక్కించుకోవడం మాత్రమే తెలుసు. తమకు నచ్చిన వాటి కోసం పిల్లలు అలుగుతారు,  కోప్పడతారు, ఏడుస్తారు, చివరకు తిండి మానేసి నిరసన కూడా చేస్తారు. అయితే ఇవన్నీ కాకుండా వారికి కూడా డబ్బు విలువ తెలిస్తే తల్లిదండ్రుల మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పాలి ఎందుకంటే.. డబ్బును అర్థం చేసుకోవడం, దాని విలువ తెలుసుకోవడం  వల్ల పిల్లలు సరైన మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. చిన్న వయసులోనే డబ్బు విలువను అర్థం చేసుకున్న పిల్లలు అప్పులకు దూరంగా ఉండి, తరువాత జీవితంలో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డబ్బు విలువ, డబ్బును ఎలా వాడాలి వంటి విషయాలు స్కూల్లో చెప్పే పాఠాలలో ఉండవు. వీటిని తల్లిదండ్రులే నేర్పించాలి.   డబ్బు గురించి అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి?  చిన్న పిల్లలకు డబ్బు గురించి అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద  పాఠాలు చెప్పడం,  క్లాసులు తీసుకోవడం చేయాల్సిన అవసరం లేదు.  పిల్లలకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు నేర్పించాలి. నాణేలు,  నోట్లను గుర్తించడం నేర్పించాలి. రెండింటికి మద్య విలువను వారు అర్థం చేసుకునేలా చేయాలి.   డబ్బు కష్టపడి సంపాదిస్తేనే వస్తుందని  వారు అర్థం చేసుకునేలా చేయాలి. అవసరాలు,  కోరికల మధ్య తేడాను గుర్తించడం నేర్పించడం చాలా ముఖ్యం. పిల్లలు ఆర్థిక విషయాలు అర్థం చేసుకునేది ఈ అడుగుతోనే. కిరాణా కొట్టులో ఏమైనా కొనుగోలు చేయడం,  ఇంటి ఖర్చులను పిల్లలతో నోట్సులో రాయించడం ఇలాంటివి పిల్లలతో చేయించాలి. పిల్లలకు ఒక పిగ్గీ బ్యాంకు లేదా ప్రత్యేకంగా వారి సేవింగ్స్ కోసం ఏదైనా మార్గం ఎంచుకోవాలి.  పొదుపు నేర్పడానికి ఇది సులభమైన మార్గం. ఇది పిల్లలు తమ పొదుపులను లెక్కించడానికి,  క్రమంగా పొదుపు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ అలవాటు తరువాత ఆర్థిక ప్రణాళికలో వారికి సహాయపడుతుంది. డబ్బు అనేది తనంతట తానుగా రాదని పిల్లలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న పనులు లేదా బాధ్యతలకు బదులుగా వారికి పాకెట్ మనీ ఇవ్వడం వల్ల కష్టపడి పనిచేయడం,  సంపాదన మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. ఖర్చు చేయడం గురించి బాగా ఆలోచిస్తారు. తెలివిగా ఖర్చు చేసే అలవాటు పిల్లలు దుబారా ఖర్చులను నియంత్రించడంలో, నివారించడంలో సహాయపడుతుంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి వారికి సహాయపడుతుంది. ఇంట్లో డబ్బు గురించి చర్చించడం తప్పని అనుకుంటారు. కానీ పిల్లల ముందు ఆర్థిక విషయాలు వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం చాలాముఖ్యం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న డబ్బు గురించి కూడా ఎప్పటికప్పుడు వారితో చెబుతూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు కష్టం తెలియకుండా పెంచాలని కోరుకుంటారు. కానీ పిల్లలకు కష్టం గురించి చెబుతూ, కష్టాన్ని అదిగమించడానికిఏం చేయాలి అనే విషయాలు కూడా చెబుతూ పెంచాలి. లేకపోతే పిల్లలు డబ్బుకు విలువ ఇవ్వకపోవడమే కాదు.. తల్లిదండ్రులకు  కూడా విలువ ఇవ్వలేని విదంగా తయారవుతారు.                                                *రూపశ్రీ.

చలికాలంలో చేసే ఈ ఒక్క మిస్టేక్ పసిబిడ్డల ప్రాణాలు తీస్తాయ్..!

బేబీ కేర్* చలికాలంలో చేసే ఈ ఒక్క మిస్టేక్ పసిబిడ్డల ప్రాణాలు తీస్తాయ్..! చలికాలం అనగానే చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  చలి తీవ్రతకు పెద్దలే వణికిపోతుంటారు. ఇక చిన్న పిల్లలకు చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈ చలికాలం. ఎందుకంటే చిన్నపిల్లలకు త్వరగా జలుబు వస్తుంది.  దీని వల్ల తొందరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో తల్లిదండ్రులు పసిపిల్లల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో పిల్లలను  ఇన్ఫెక్షన్ల నుండి  రక్షించుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల పసిపిల్లలు నిద్రలోనే మరణించే అవకాశం కూడా  ఉంటంది.  చిన్న పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో చిన్నపిల్లలకు జాగ్రత్తలు.. చలికాలంలో  ముందుగా పిల్లల తల,  కాళ్ళను టోపీ,  సాక్స్ తో కవర్ చేయాలి. గది ఉష్ణోగ్రతను కొద్దిగా వెచ్చగా ఉంచాలి. నిద్రపోయేటప్పుడు పిల్లలపై దుప్పటి వేయకూడదు. ఇది SIDS (సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్) ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో SIDS మరణానికి ఇలా దుప్పటి కప్పడం  ఒక సాధారణ కారణమని వైద్యులు చెబుతున్నారు.అలాగే స్నానం చేయడానికి గోరువెచ్చని నీటిని వాడాలి. అంతేకాదు.. ఎక్కువసేపు నీటిలో ఉంచి స్నానం చేయించకూడదు. ఇన్పెక్షన్ రాకుండా ఉండాలంటే.. పిల్లలు పుట్టిన తర్వాత మొదటి వారాలలో ఎక్కువ మందిని ఇంటిని రాకుండా చూసుకోవాలి. వీలైనంత తక్కువ మంది ఉంటే మంచిది. పిల్లవాడిని ఎత్తుకునే ముందు  చేతులను బాగా కడుక్కోవడం తప్పనిసరి చేయాలి.  తల్లిదండ్రులే కాదు.. పిల్లలను ఎవరు ఎత్తుకున్నా.. ఎత్తుకునే ముందు చేతులు బాగా కడుక్కోమని చెప్పాలి. జలుబు లేదా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారిని పిల్లల నుండి దూరంగా ఉంచాలి.  లేకపోతే పిల్లలకు ఇన్పెక్షన్ వస్తుంది పిల్లలు  నిద్రపోయే, ఆడుకునే,  తినే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి. పిల్లల ఆరోగ్యం కోసం వేసే అన్ని రకాల టీకాలను సరైన సమయంలో వేయించాలి.  పిల్లలకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తుంటే వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించాలి.. పిల్లలు శ్వాస తీసుకోవడానికి చాలా వేగంగా లేదా శ్రమతో కూడిన శ్వాస తీసుకుంటూ ఇబ్బంది పడుతుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. పాలు తాగడానికి నిరాకరిస్తున్నా  లేదా చాలా తక్కువ పాలు తాగుతున్నా వైద్యుడిని సంప్రదించాలి జ్వరం లేదా  జలుబు ఎక్కువగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వేద్యుడిని సంప్రదించాలి. పిల్లలు సరిగా స్పందించకపోవడం,  వారిలో చలనం సరిగా లేకపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. చర్మం  రంగు మారడం  లేదా  పాలిపోయినట్లు అనిపించడం వంటివి జరిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.   పిల్లల విషయంలో ఎప్పుడూ సొంతవైద్యం లేదా నిర్గక్ష్యం, పాత మందులు వాడటం వంటివి చేయకూడదు. ఇది పిల్లల ప్రాణాలను బలితీసుకోవచ్చు.                                    *రూపశ్రీ.

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..!

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..! ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివిగా ఉండాలని కోరుకుంటారు.  అయితే పిల్లల చిన్నతనం చాలా వరకు తల్లి చుట్టూనే గడుస్తుంది. ఈ కారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినా,  లేదా అల్లరి చేసినా, పిల్లల నడవడిక తప్పుగా ఉన్నా.. వెంటనే తల్లినే నిందిస్తూ ఉంటారు చాలామంది.  కానీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలన్నా,  వారి నడవడిక చక్కగా ఉండాలన్నా ప్రతి తల్లి కొన్ని పనులు చేయాలి.  ఆ పనులేంటో తెలుసుకుంటే.. లైబ్రరీ.. పిల్లలను లైబ్రరీకి తీసుకెళ్లడం లేదా ఇంట్లోనే మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి.  పిల్లలు ఏదైనా చదువుతున్నప్పుడు చదివిన విషయం ద్వారా వారు ఏం అర్థం చేసుకున్నారు అడగాలి.  ఇది పిల్లల ఆలోచన తీరును మారుస్తుంది. కమ్యూనికేషన్.. పిల్లలు తెలివిగా మారాలంటే తల్లులకు ఓపిక చాలా ముఖ్యం.  ప్రతి తల్లి పిల్లలతో చాలా ఓపెన్ గా మాట్లాడాలి.  పిల్లలు చెప్పే విషయాన్ని చిరాకు పడకుండా శ్రద్దగా వినాలి. అలాగే పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాలి. పిల్లలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి.  వారు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకోవాలి. పిల్లలు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. పరిష్కారాలు.. పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి.  అవన్నీ వారికి చాలా పెద్దవిగా, పెద్దలకు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి.  పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని ప్రతిది తల్లిదండ్రులు చెప్పకూడదు.  ముఖ్యంగా పిల్లల సమస్యలకు నువ్వేతై ఏం చేస్తావ్,  ఎలా ఉంటే బాగుంటుంది వంటి ప్రశ్నలు వేసి పిల్లల సమస్యలకు పరిష్కారం వారే వెతుక్కునేలా చేయాల్సింది తల్లులే. రోల్ మోడల్.. పిల్లలను రూలింగ్ చేయడం కాదు.. వారికి రోల్ మోడల్ గా ఉండాలి. పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం, ప్రతి  పనిని శ్రద్దగా చేయడం,  ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండటం, పెద్దలు, ఇతరులతో గౌరవంగా మర్యాదగా మాట్లాడటం వారికి నేర్పాలి. పిల్లల స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది.  వారితో మాట్లాడేటప్పుడు వారి పెద్దతరం అనే గీత నుండి బయటకు వచ్చి వారితో సరదాగా కలిసిపోయి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే పిల్లలు పెద్దలు చెప్పినదాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలరు. పైన చెప్పుకున్న పనులన్నీ చేయగలిగితే ప్రతి తల్లి తమ పిల్లలను తెలివైన వారిగా మార్చడంలో తమ వంతు కృషి చేసినట్టే.                           *రూపశ్రీ.

పిల్లల పాదాలను మసాజ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలుసా..

పిల్లల పాదాలను మసాజ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని తెలుసా.. పుట్టిన పిల్లల లైఫ్ స్టైల్ లో మసాజ్ అనేది కీలకంగా ఉంటుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజూ పాదాలకు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. బేబీకి మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మంచి మసాజ్ రోజంతా అలసట,  నొప్పి నుండి ఉపశమనం పొందడానికి, రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నవజాత శిశువుల నుండి పరిగెత్తే పిల్లల వరకు..  పాదాలకు మసాజ్ చేయడం వారి శారీరక అభివృద్ధికి మాత్రమే కాకుండా వారి మానసిక,  భావోద్వేగ అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. పిల్లల పాదాలను మసాజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పాదాలను మసాజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. పిల్లల పాదాలకు మసాజ్ ఎందుకు చేయాలి? పాదాల మసాజ్ పిల్లలలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చాలాసార్లు పిల్లలు స్కూల్,  చదువు లేదా సామాజిక ఒత్తిడి కారణంగా ఒత్తిడికి గురవుతారు.  ఇలాంటి పరిస్థితులలో పాదాల మసాజ్ మెదడును శాంతపరచడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.. పాదాల మసాజ్ పిల్లలు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పాదాల మసాజ్ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది ప్రశాంతంగా,  గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లల మెరుగైన శారీరక,  మానసిక అభివృద్ధికి దారితీస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కండరాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేస్తుంది. ఇది పిల్లల శక్తిని పెంచుతుంది. మసాజ్ చేయని పిల్లలతో పోలిస్తే మసాజ్ చేసే పిల్లలు మరింత చురుకుగా చదవగలరు,  ఆడగలరు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.. పాదాల రిఫ్లెక్సాలజీ శిశువులు,  పిల్లలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.. పిల్లల పాదాలు ఆటలు ఆడిన తర్వాత నొప్పిగా లేదా అలసిపోయినట్లు అనిపించవచ్చు. పాదాల మసాజ్ కండరాలను సడలించడం ద్వారా నొప్పిని తగ్గిస్తుంది. పాదాలను మసాజ్ చేసేటప్పుడు, పిల్లలతో సమయం గడుపడటం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య   భావోద్వేగ బంధం బలపడుతుంది. జీర్ణవ్యవస్థ.. పాదాలపై కొన్ని రిఫ్లెక్స్ పాయింట్లు జీర్ణవ్యవస్థకు సంబంధించినవి ఉంటాయి. వాటిని మసాజ్ చేయడం వల్ల పిల్లలలో మలబద్ధకం, అపానవాయువు,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కొబ్బరి లేదా బాదం వంటి నూనెలను ఉపయోగించి పిల్లలకు మసాజ్ చేయడం మంచిది. శిశువు చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి మసాజ్ చేసేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు.  బిడ్డకు ఏవైనా గాయాలు లేదా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మసాజ్ చేయడం మంచిది కాదు.                                     *రూపశ్రీ.

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!!

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!! చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి.  అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు.. పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది. పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు. ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయించడం,  స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది.  పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.                                        ◆నిశ్శబ్ద.

చలి కాలాల్లో పిల్లల చర్మ సమస్య గురించి షాకింగ్ నిజాలు..!

చలి కాలాల్లో పిల్లల చర్మ సమస్య గురించి షాకింగ్ నిజాలు..! వర్షాకాలం, చలి కాలంలో చిన్న పిల్లల్లో చర్మ సమస్యలు..  ముఖ్యంగా దురదలు, ర్యాషెస్, చర్మంపై ఎర్రటి మచ్చలు చాలా సాధారణం. కానీ ఇవి ఎందుకు వస్తాయి, ఎప్పుడు ఇంటి చిట్కాలు సరిపోతాయి, ఎప్పుడు వైద్యుడి వద్దకు వెళ్లాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. దీని వల్ల కొన్నిసార్లు పిల్లల సమస్య పెరగడం లేదా సమస్య పెద్దగా లేకున్నా వైద్యుల వద్దకు వెళ్ళడం వల్ల వైద్య ఖర్చు ఎక్కువగా రావడం వంటివి కూడా జరుగుతాయి. అటు పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, అతిగా వైద్య ఖర్చుకు ఉండకూడదు అన్నా.. చలికాలంలో పిల్లలకు వచ్చే చర్మ సమస్యల గురించి,వాటిని ఇంట్లోనే తగ్గించుకోవడం గురించి తెలుసుకోవాలి..  వర్షం–చలి కాలంలో పిల్లల్లో దురదలు, ర్యాషెస్ ఎందుకు వస్తాయి? చలి వాతావరణం & పొడి చర్మం.. చల్లటి గాలి కారణంగా చర్మంలో తేమ తగ్గిపోతుంది. ఇది dry skin dermatitis లేదా winter rash అనే స్థితిని కలిగిస్తుంది. తడి బట్టలు లేదా చర్మంపై తేమ ఎక్కువగా ఉండడం.. వర్షపు నీరు, చెమట లేదా తడి బట్టలు ఎక్కువసేపు ఉండడం వల్ల fungal infection లేదా హీట్ ర్యాష్ వస్తుంది. సబ్బులు లేదా డిటర్జెంట్ల ప్రభావం.. ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఉన్న సబ్బులు, డిటర్జెంట్లు చిన్నారుల చర్మానికి హానికరం. బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్లు వర్షాకాలంలో  సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి, ప్రత్యేకంగా చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన గోళ్ల మధ్య, మడమల దగ్గర, కాళ్ళ కింద, మెడ చుట్టూ. ఇంట్లోనే సులువుగా చేసుకొదగ్గ సేఫ్ చిట్కాలు చర్మం తడిగా కాకుండా ఉంచడం పిల్లల బట్టలు పూర్తిగా పొడిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. తడిగా ఉంటే వెంటనే మార్చాలి. నేచురల్ ఆయిల్ మాయిశ్చరైజర్.. రోజూ స్నానం తర్వాత కొబ్బరి నూనె లేదా బాదం నూనెను పలుచగా రాసి మసాజ్ చేయాలి. ఇది చర్మాన్ని తేమతో ఉంచి దురదను తగ్గిస్తుంది.  స్నానానికి సహజ చిట్కాలు స్నానానికి చాలా వేడి నీరు కాకుండా  సాధారణ గోరువెచ్చని నీరు ఉపయోగించడం మంచిది.  సబ్బు బదులు వారానికి 2-3సార్లు  సెనగపిండి + పాలు + తేనె మిశ్రమంతో శుభ్రం చేయవచ్చు. ఓట్స్ బాత్.. ఒక కప్పు ఓట్స్ పొడి చేసుకుని స్నానానికి నీటిలో కలిపితే దురద, ర్యాషెస్ తగ్గుతాయి. బట్టల జాగ్రత్తలు సున్నితమైన నూలు బట్టలు వేయడం మంచిది.  కొత్త బట్టలు మొదటిసారి వేసే ముందు ఒకసారి వాష్ చేసి తర్వాత వేయడం  మంచిది. పిల్లకు తగినంత నీరు తాగించాలు.. చలి కాలంలో పిల్లలు నీరు తక్కువ తాగుతారు, దాంతో చర్మం ఇంకా పొడిగా మారుతుంది.  వైద్యుడి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి? ర్యాష్ ఎర్రగా పాకిపోవడం లేదా పుస్ రావడం. బుడగలు, చర్మం ఊడిపోవడం. పిల్లకు జ్వరం రావడం లేదా అసహనం, నిద్రలేమి. దురద చాలా ఎక్కువగా ఉండి రాత్రి నిద్రపట్టకపోవడం. కళ్ళ చుట్టూ లేదా జననేంద్రియాల దగ్గర ర్యాషెస్ రావడం. చర్మం పగలడం, రక్తం కారడం, లేదా తీవ్రమైన పొడిబారడం. వంటి సమస్యలు ఉంటే ఇంటి చిట్కాలు సరిపోవు. డాక్టర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. . ఈ జాగ్రత్తలు కూడా.. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఏ నూనె లేదా చిట్కా వాడే ముందు ఒక చిన్న ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. సుగంధ ద్రవ్యాలు, రంగులు ఉన్న ఉత్పత్తులను దూరంగా ఉంచాలి. చల్లటి కాలంలో రోజుకు ఒకసారి మాత్రమే స్నానం చేయించాలి. .                   *రూపశ్రీ.

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి!   చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు. పనులు అప్పగించాలి.. పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు.  కొత్తగా ఉండాలి.. పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు  కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు  నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు. భాగమవ్వాలి… పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి. ప్రకృతికి దగ్గరగా.. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి.  కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి.                                           *నిశ్శబ్ద.

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు!

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు! బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి  వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో  వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు...  సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది. ఆటలు ముఖ్యం.. పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్‌బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.  ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం.  సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం.  పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ.  ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు  ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం  తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి.  పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.  ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి.                              ◆నిశ్శబ్ద.

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు..

పిల్లల పెంపకం బాధ్యత ముఖ్యంగా స్త్రీల మీదనే ఉంటుంది ఎందుకు..   తల్లిదండ్రుల అవసరం లేకుండా పిల్లల్ని పెంచిన వారే ఉత్తమ తల్లిదండ్రులు. ప్రతి క్షణం పిల్లలకు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో చెప్పే తల్లిదండ్రుల లక్షణం ఎలా ఉంటుందంటే…  మనం మొక్కలు పెంచేటప్పుడు ఆ చెట్టుకు కావలసిన నీరు, ఎరువులు సమకూరుస్తాం కానీ చెట్టుకు ఇలా ఎదుగు, అలా ఎదుగు అని ప్రతిక్షణం చెప్పం కదా! అలాగే పిల్లలకు ప్రేమ, స్వేచ్ఛను ఇవ్వాలే గానీ బందీలు చేయరాదు. తల్లిదండ్రులు తాము సాధించలేకపోయిన వాటిని పిల్లల నుండి సాధించుకోవాలనే ఆలోచన పెంచుకొని వారి మీద వత్తిడి పెంచుతున్నారు. అటువంటి వారు మంచి తల్లిదండ్రులు కాలేరు. పిల్లలు ఉత్తమంగా ఎదిగే వాతావరణం కల్పించేలా చేసే వారే మంచి తల్లిదండ్రులు. పిల్లల పెంపకం వ్యక్తిగతమైనదైనా తల్లిదండ్రులు ఆ పనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి సమాజానికి తమ సేవను సమర్ధవంతంగా నిర్వహించడానికి దీక్షతో కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల దృష్టిలో పెద్దవారు. వారు చేసే పనులు గమనిస్తూ అనుసరిస్తారు. దానిని బట్టే వారి నడవడిక, ప్రవర్తన ఆధారపడతాయి. ప్రపంచంలో సర్వదోషాలకు ఈర్ష్య, స్వార్థాలు కారణం. ఇవి పెద్దల వలన పిల్లలపై ప్రభావం చూపి చెడును ప్రేరేపిస్తాయి. పిల్లలను హద్దులో పెట్టి బాగు చేసే ప్రయత్నం కన్నా పెద్దలలో మంచి మార్పు తెచ్చుకొని బాగుచేయడం మంచిది. తల్లిదండ్రులు వారి పిల్లలను భావి పౌరులుగా ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తున్నారు. ఆ ఉత్పత్తి ప్రక్రియలో నాణ్యతా లోపం చోటు చేసుకుంటే ఆ నష్టాన్ని సమాజం 60-70 సంవత్సరాల పాటు భరించవలసి వస్తుంది.  పిల్లలను ఎలా పెంచాలి? ఐదు సంవత్సరాలు వచ్చే వరకూ పిల్లలను రాజకుమారుల్లా, అతి గారాభంగా పెంచాలి. ఆపై పదిహేను సంవత్సరాల వరకు సేవకుడిలా ఆజ్ఞాపించాలి. పదహారు సంవత్సరాల తరువాత మిత్రునిలాగా భావించి పెంచాలి. అప్పుడే ప్రయోజకులవుతారు. పిల్లల్ని ప్రేమతో చూడడం వేరు, గారాబంగా పెంచడం వేరు. ప్రేమతో పెంచితే ప్రయోజకులవుతారు. గారాబంగా పెంచితే మీకూ, దేశానికీ, కట్టుకున్న వారికీ సమస్య అవుతారు. చిన్నతనం నుంచీ మన తల్లి తండ్రి నుంచి మనం ఏమి కోల్పోయామో, ఏ విషయాల ద్వారా జీవితంలో ఈ స్థితికి వచ్చామో గమనించి ఆ తప్పులే మళ్ళి మనం చేయకూడదు. పిల్లలు పెరిగి ప్రయోజకులుగా మారి, మనల్ని ఉద్దరించే స్థితిలో ఉండాలి. కానీ మనమే వారిని చూసే స్థితి వస్తే ఖచ్చితంగా మనం మన పిల్లల్ని సరైన దారిలో పెంచలేదని తెలుసుకోవాలి. చిరుప్రాయంలో తల్లి ఇచ్చే శిక్షణా విధానం పిల్లల భవిష్యత్ జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న విషయంపై కొన్నేళ్ళ క్రితం ఓ సర్వే జరిగింది. ఆ సర్వేలో వెళ్ళడైన విషయం ఇది. "ఓ తల్లి పిల్లవాడికి నడక నేర్పే ప్రయత్నంలో పిల్లవాడికి కొంత దూరంలో నిలబడి తన వైపు రమ్మని ప్రోత్సహిస్తుంది. అప్పుడు పిల్లవాడు తల్లిని చేరుకోవాలని ఆశతో ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియలో పిల్లవాడు అదుపుతప్పి పడిపోయి, ఏడవడం ప్రారంభించాడు. వెంటనే తల్లి పరుగున వెళ్ళి పిల్లవాణ్ణి ఓదారుస్తూ, చీ పాడునేల! నీవల్లే మా పిల్లాడికి దెబ్బలు తగిలాయంటూనే నేలను కొట్టింది. అప్పుడు పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. ఇదే విధంగా మరో తల్లి తన పిల్లవాడికి నడక నేర్పేటప్పుడు, ఆ పిల్లవాడు తల్లి వైపు నడుస్తూ ఉండగా పడిపోయాడు. అప్పుడు ఆమె పిల్లవాడి దగ్గరకు వెళ్ళకుండా దూరం నుండే 'లే నాయనా! లే లేచిరా!' అంటూ ఉత్సాహపరిచింది. ఆ పిల్లవాడు మెల్లగా లేచి నడుచుకుంటూ తల్లిని చేరుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళయిన తరువాత వారి స్వభావాన్ని పరిశీలిస్తే తేలిందేమిటి. మొదటి పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలకు, అపజయాలకు బయట పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులే కారణమని నిందించే స్వభావం కలిగిన వాడయ్యాడు. రెండవ పిల్లవాడు తనకు ఎదురైన కష్టాలు, అపజయాలను ఎదుర్కోగల మనోబల సంపన్నుడయ్యాడు. ఆలోచనలు మనం చేసే పనుల యొక్క సున్నిత రూపాలు. అవి మెదడులో చిన్న విద్యుత్తరంగాలుగా జీవం పోసుకొని, చుట్టూ ఉండే గాలిలాగ, పీల్చుకొనే ఊపిరిలాగ మనకు తెలియకుండానే మన బాహ్యమనోపరికరాలను ప్రభావితం చేస్తాయి. అందుకే  ముఖ్యంగా పిల్లల పెంపక బాధ్యత స్త్రీల మీదే ఆధారపడి వుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..!

మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..!   శరీరానికి  ముఖ్యమైన ఖనిజాలలో ఐరన్ ప్రధమ స్థానంలో ఉంటుంది.  మహిళలకు అయినా, పురుషులకు అయినా, పిల్లలకు అయినా, వృద్దులకు అయినా.. ఇలా మానవులందరికీ ఐరన్ చాలా ముఖ్యమైనది. మనిషి శరీరంలో రక్తాన్ని హిమోగ్లోబిన్ ఆధారంగా అంచనా వేస్తారు. మహిళలకు 12 నుండి 16 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అలాగే పురుషులకు 14 నుండి 18 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి.  కానీ ప్రపంచంలో.. ముఖ్యంగా భారతదేశంలో అధికశాతం మంది మహిళలు  ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. భారతదేశంలో 50 శాతం కంటే ఎక్కువ మంది వయోజన మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు.  చాలామంది తమకు ఐరన్ లోపం ఉందన్న విషయాన్ని తెలుసుకోకుండానే కాలం వెళ్లబుచ్చుతుంటారు. అసలు శరీరానికి ఐరన్ ఎందుకు ముఖ్యం? మహిళలు ఐరన్ లోపాన్ని లైట్ తీసుకుంటే జరిగేదేంటి? తెలుసుకుంటే.. ఐరన్.. ఐరన్ మనిషి శరీరానికి కీలకమైన సూక్ష్మపోషకం. ఇది హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. ఇది శరీరమంతా ఆక్సిజన్ సరఫరా కావడంలో సహాయపడుతుంది.  అంటే.. ఐరన్ ఎంత సమృద్దిగా ఉంటే శరీరానికి ఆక్సిజన్ సరఫరా అంత మెరుగ్గా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే అది హిమోగ్లోబిన్ తగ్గడానికి దారితీస్తుంది.  ఈ పరిస్థితిని ఐరన్ లోపం లేదా రక్తహీనత అని అంటారు. రక్తహీనతను లైట్ తీసుకుంటే.. చాలామంది మహిళలు రక్తహీనతను లైట్ తీసుకుంటారు.  తమకు రక్తహీనత సమస్య ఉందని తెలిసినా కొందరు జాగ్రత్తలు తీసుకోవడం,  ఐరన్ ఫుడ్ తీసుకోవడం,  హిమోగ్లోబిన్ మెరుగు పరుచుకోవడం లాంటివి చేయరు. అయితే రక్తహీనత ఉంటే మహిళలల శరీరం ఎప్పుడూ అలసటగా ఉంటుంది.  అలాగే ఆకలి లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం మొదలైన వాటికి కారణం అవుతుంది.  ఐరన్ లోపం చాలా ఎక్కువ ఉంటే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మహిళల నెలసరి.. మహిళలకు ప్రతి నెల నెలసరి కారణంగా దాదాపు 30 నుండి 40 మిల్లీలీటర్ల రక్తం కోల్పోవడం జరుగుతుంది. పైగా నెలసరి తర్వాత గర్బం దాల్చడం,  ప్రసవాలు,  గర్భసమస్యలు,  సర్జరీలు.. ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి.  ఈ కారణంగా పురుషుల కంటే మహిళలలో రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా  ఉంటుంది. గర్భధారణ సవాల్.. గర్భధారణ మహిళలకు చాలా సవాల్ విసిరే దశ అనుకోవచ్చు.  గర్భం దాల్చినప్పుడు మహిళలకు ఐరన్ అవసరం సాధారణం కంటే  ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐరన్ కేవలం తల్లికే కాకుండా కడుపులో బిడ్డకు కూడా అవసరం అవుతుంది. అందుకే సాధారణం కంటే 2 లేదా 3 రెట్లు ఐరన్ అవసరం పెరుగుతుంది. పిల్లలకు పాలిచ్చే తల్లులు.. పిల్లలకు పాలిచ్చే మహిళలు అవసరానికి అనుగుణంగా ఆహారంలో ఐరన్ తీసుకోవాలి.  లేకపోతే రక్తహీనత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గర్బిణీ స్త్రీలు గర్బం దాల్చిన మూడవ నెల నుండి శరీరానికి అవసరమైన ఐరన్ తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  అలాగే పాలిచ్చే తల్లులు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ వైద్యుల సలహాతో ఐరన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. ఐరన్ లోపానికి ఇలా చెక్ పెట్టాలి.. ఐరన్ లోపాన్ని చెక్ పెట్టడానికి ఆకుకూరలు,  గింజలు,  బీన్స్,  మాంసం,  చేపలు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవాలి.  ఐరన్ సమృద్దిగా లభించే నువ్వులు, వేరుశనగలు,  బెల్లం,  ఖర్జూరం వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. కాఫీ, టీ లు మానేయాలి.. చాలామందికి కాఫీ, టీ వంటివి ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే.. ఎక్కువగా తీసుకునే కాఫీ, టీ లు శరీరం ఐరన్ ను గ్రహించకుండా చేస్తాయి.  అందుకే శరీరానికి ఐరన్ బాగా లభించాలంటే కాఫీ, టీ తీసుకోవడం పరిమితం చేయాలి. ఇంకా ఆరోగ్యం కోసం అవి కూడా మానేయవచ్చు. ఐరన్ ను గ్రహించే ఆహారాలు.. విటమిన్-సి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.  అందుకే ఐరన్ తో పాటు నిమ్మ, ఉసిరి,  నారింజ,  విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.                            *రూపశ్రీ.

చిన్నపిల్లకు ప్లాస్టిక్ బాక్సులలో టిఫిన్, లంచ్ ఇవ్వడం సరైనదేనా...

చిన్నపిల్లకు ప్లాస్టిక్ బాక్సులలో టిఫిన్, లంచ్ ఇవ్వడం సరైనదేనా...   తల్లిదండ్రులు  పిల్లలను పెంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  వారికి కావలసినవి సమకూర్చడం నుండి వారికి ఆహారం ఇవ్వడం వరకు.. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.  అయితే కొన్నిసార్లు చిన్న తప్పులు జరిగిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే.. అది తప్పు అనే విషయం పిల్లలకు, పెద్దలకు కూడా తెలియదు. పిల్లలను స్కూల్ కు పంపేటప్పుడు చాలా వరకు తల్లులు టిఫిన్, లంచ్, స్నాక్స్ వంటివి బాక్స్ లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. అయితే చాలా వరకు ప్లాస్టిక్ బాక్స్ లలో ఇలా ఆహారం ఇవ్వడమే అసలైన మిస్టేక్ అనే విషయం చాలా మందికి తెలియదు. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారం ప్యాక్ చేస్తున్నారా? పిల్లల ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సులలో ప్యాక్ చేయడం వల్ల వారి ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. చాలా ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఉన్నాయి, వాటిలో వేడి ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల వాటిలో ఉండే హానికరమైన రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనివల్ల పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గురవుతారు. మైక్రోప్లాస్టిక్స్ ప్రమాదం.. కొన్నిసార్లు ప్లాస్టిక్ చిన్న కణాలుగా విచ్ఛిన్నమవుతుంది, వీటిని మైక్రోప్లాస్టిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ కణాలు పిల్లల ఆహారంలోకి చేరి, వారి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  దీనివల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాక్టీరియా పిల్లలకు హాని చేస్తుంది.. ప్లాస్టిక్ టిఫిన్లలో బాక్టీరియా సులభంగా పేరుకుపోతుంది. ఇది అనారోగ్యానికి కూడా దారితీస్తుంది. తరచుగా ప్లాస్టిక్ బాక్సులను  ఎక్కువ కాలం  ఉపయోగించడం వల్ల సరిగ్గా శుభ్రపరచలేరు. లోపల పేరుకుపోయే బ్యాక్టీరియా పిల్లలకు హాని కలిగిస్తుంది. స్టీల్ పాత్రలు.. ప్లాస్టిక్ పాత్రలను స్క్రబ్ చేయడం వల్ల వాటి పూత తొలగిపోతుంది. ఇది పిల్లల ఆహారంలో అంటుకుని  శరీరంలోకి ప్రవేశించి, పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవడానికి కారణం అవుతుంది. ఈ సమస్యలను నివారించడానికి పిల్లలకు స్టీల్ పాత్రలను ఉపయోగించడం మంచిది.  స్టీల్ బాటిల్లు..  ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులే కాదు.. నీళ్ల బాటిల్లు కూడా ప్లాస్టిక్ ఇస్తుంటారు.  వెంటనే ప్లాస్టిక్ ను  వాడటం మానేయడం మంచిది.  స్టీల్ బాటిల్ వాడటం మంచిది.                            *రూపశ్రీ.

అందమైన చర్మం కావాలంటే.. వీటిని ఎక్కువగా తినాలి..!

అందమైన చర్మం కావాలంటే.. వీటిని ఎక్కువగా తినాలి..! చర్మం అందంగా , కాంతివంతంగా ఉంటే వయసు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కారణంగా చాలా మంది చర్మం యవ్వనంగా, అందంగా ఉండాలని కోరుకుంటారు.  దీనికోసం చాలా రకాల టిప్స్ కూడా ఫాలో అవుతారు. కొందరు అయితే చర్మం ఆరోగ్యంగా, అందంగా, యవ్వనంగా ఉండటం కోసం ఖరీదైన స్కిన్ ట్రీట్మెంట్లు,  ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులు కూడా ఉపయోగిస్తారు. కానీ చర్మ సంరక్షణ నిపుణులు, ఆహార నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం.. నిజమైన అందం అనేది కేవలం పైన పూసే క్రీములు, తీసుకునే ట్రీట్మెంట్ల మీద కాదు.. లోపలి నుండి వస్తుంది. ఇదేలాగంటే.. చర్మాన్ని అందంగా, యవ్వనంగా  కనిపించేలా చేయడంలో ఆహారానిదే కీలకపాత్ర. సరైన పోషకాహారం, చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. అయితే కేవలం ఒకే ఒక కూరగాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం అద్బుతంగా మారుతుంది. అదేంటో తెలుసుకుంటే.. టమోటా.. చర్మ ఆరోగ్యానికి టమోటా అద్బుతంగా పనిచేస్తుంది. ఈ విషయం తెలిసి చాలా మంది షాకవుతారేమో.. కానీ చర్మం అందంగా, ప్రకాశవంతంగా మారడంలో టమోటాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. టమోటాలలో లైకోపిన్,  విటమిన్-సి, యాంటీఆక్సిండెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  తద్వారా చర్మాన్ని రక్షిస్తాయి.  చర్మం అందంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తాయి. టమోటాలు చర్మ ట్యాన్ తొలగించడంలో ఉపయోగిస్తారని చాలామందికి తెలిసే ఉంటుంది.  అయితే టమోటాలు కేవలం ట్యాన్ ను తొలగించడమే కాదు.. బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  చర్మపు రంగును ప్రకాశవంతం  చేయడంలో కూడా టమోటాలు సహాయపడతాయి. చర్మ సంరక్షణ కోసం టమోటాలను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు.  ఒకటి టమోటాలను నేరుగా తినడం. వీటిని శుభ్రంగా కడిగి సలాడ్ లాగా తినవచ్చు. ఇక టమోటా రసం చర్మానికి మ్యాజిక్ లాగా పనిచేస్తుంది.  టమోటా జ్యూస్ ను కాటన్ బాల్ తో అద్దుకుని ముఖానికి మొత్తం అప్లై చేసి ఆరిపోయిన తరువాత సాధారణ నీటితో కడుక్కోవాలి. ఇవి చాలా ప్రబావావంతంగా పనిచేస్తాయి. టమోటా జ్యూస్ ను నేరుగా అప్లై చేయలేకపోయినా,  జ్యూస్ ను ఏదైనా ఫేస్ ప్యాక్ లో కూడా జతచేసుకోవచ్చు. ఇది మరింత మెరుగ్గా ఉంటుంది.                                   *రూపశ్రీ. 

పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకుంటే కోప్పడుతున్నారా..ఈ నిజాలు తెలుసా!

  పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకుంటే కోప్పడుతున్నారా..ఈ నిజాలు తెలుసా! పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోవడం చాలా సహజం. చాలామంది తల్లిదండ్రులు దీన్ని చెడ్డ అలవాటుగా పరిగణిస్తారు.  పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం చూడగానే తల్లిదండ్రులకు ఎక్కడలేని కోపం వస్తుంది.  తల్లిదండ్రులు వెంటనే వేళ్లను నోట్లో నుండి  బయటకు తీస్తారు. ఇది సరైనదేనా? నోటిలో వేళ్లు పెట్టడం పిల్లల పరిశుభ్రతకు మంచిది కాదని చాలామంది అబిప్రాయం. అంతేకాకుండా ఇది హాని కలిగించే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల ఈ అలవాటును మాన్పించే క్రమంలో కొన్నిసార్లు పిల్లలను  కొట్టడానికి కూడా వెనుకాడరు. కానీ పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం, బొటనవేలు చప్పరించడం వల్ల  ముఖ్యంగా 0 నుండి 2 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందట.  దీని గురించి తెలుసుకుంటే.. ఉల్లాసం.. పిల్లలు తమ వేళ్లను నోటిలో పెట్టుకున్నప్పుడు అది వారిని రిలాక్స్ చేస్తుందట. నిజానికి పిల్లలు అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు, వారి వేళ్లను చప్పరించడం ప్రశాంతతను కలిగిస్తుందట. ఇది పిల్లలు తమకు తాము ఏదైనా ఒక ఎమోషన్ నుండి బయటకు రావడంలో సహాయపడుతుందని అంటున్నారు. దంతాలు వచ్చేటప్పుడు.. శిశువు దంతాలు బయటకు వస్తున్నప్పుడు వారి చిగుళ్ళు దురదగా, బాధాకరంగా మారుతాయి. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి వారు తమ వేళ్లను నోటిలో పెట్టుకుంటారు. ఇది వారికి  ఓదార్పునిస్తుందట. రోగనిరోధక శక్తి.. కొన్ని పరిశోధనల ప్రకారం పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం వల్ల వారి రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుందట.  ఎందుకంటే ఇది శరీరం తేలికపాటి బ్యాక్టీరియాను ఎదుర్కోవడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. నోరు,  చేతిని  ఉపయోగించే  నైపుణ్యాలు.. ఈ అలవాటు నవజాత శిశువుల శరీర నియంత్రణ,  కదలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుందట. ఇది నోటి-చేతిని ఉపయోగించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పిల్లలు వేళ్లు చప్పరిస్తుంటే వారిని తిట్టి అడ్డుకోకూడదు అంటున్నారు పిల్లల వైద్యులు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం ఎప్పుడు ఆపాలి?  పిల్లలు 3 నుండి 4 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, నిరంతరం వేలు పీలుస్తుంటే అది వారి దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే ఈ అలవాటును మాన్పించడం మంచిదని అంటున్నారు. అతిగా వేలు చప్పరించడం వల్ల నోటిలో చర్మ వ్యాధులు లేదా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం చాలా అవసరం. బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పరంగా ఈ అలవాటు మంచిది కాదు.                          *రూపశ్రీ.