Read more!

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...?

పిల్లల ఆలోచన ప్రవర్తనలలో మార్పు తేవాలంటే...?

పిల్లలు పెరిగి పెద్దవారవుతుంటే వారి ఆలోచన ప్రవర్తనలలో మార్పు వస్తుంటుంది. అయితే పిల్లల మనస్తత్వం మారుతోందన్న విషయం గమనించక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు మొండిగా తయారవుతున్నారని ఆరోపిస్తుంటారు. ముఖ్యంగా కొందరి మగపిల్లల్లో పది, పన్నెండేళ్ళు వచ్చేసరికి వారి ప్రవర్తన అనూహ్యంగా మారిపోతుంది. అప్పటివరకు ఇంట్లో సరదాగా ఉంటూ, ఇంటి పనుల్లో సహకరిస్తూ సర్దుకుపోతు ఉండేవాళ్ళు, కాస్తా అన్నింటికి విసుక్కోవడం వాదన చేయడం మొదలు పెడతారు. ఏ పని చెప్పిన, ఏ సలహా చెప్పిన తీవ్రంగా స్పందిస్తారు. గట్టిగ అరుస్తారు. తోడ పుట్టినవాళ్ళతో ఊరికే గొడవ పెట్టుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలకు, తల్లిదండ్రులకూ కూడా ఇది కొంత కష్టకాలమే మరి దీనిని ప్రశాంతంగా దాటాలంటే? నిపుణులు చేస్తున్న సూచనలు ఇవి.

తమ హెయిర్ స్టైయిల్ నుంచి వేసుకునే బట్టలు దాకా అన్నీ తమకు నచ్చినట్లు ఉండాలనుకుంటారు. అవి ఇంట్లో పెద్దవాళ్ళకు నచ్చవు.ఇలా ప్రతి విషయంలో పిల్లల అభిప్రాయాలూ మారిపోతుంటాయి. అసలు పది పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి పిల్లల్లో ఇలా మార్పు రావటానికి కారణం ఏంటి అన్న విషయంపై అవగాహనా వస్తే పిల్లలు గాడి తప్పకుండా చూసుకోవడం సులువవుతుంది అంటున్నారు నిపుణులు. పది పన్నెండేళ్ళ వయసంటే బాల్యానికి దూరంగా జరుగుతూ, క్రమేపి టీనేజ్ లోకి అడుగుపెడుతున్నదశ. ఈ దశలో హార్మన్ల ప్రభావం అధికంగా ఉంటుందట. దాని వలన శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయట. నిజానికి పది పన్నెండేళ్ళ పిల్లలు స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కావాలని ఆరాటపడుతుంటారు. ఒకోసారి పెద్దవారిలా వాదనలు పెట్టుకునే ఈ పిల్లలే మరోసారి చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా పెద్దల అజమాయిషీని ఎదుర్కోవడానికే, తమ ఇష్టాలను కాపాడుకోవడానికే మాత్రమే వీళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటారు. కాని అది మనకు మూర్ఖత్వంగా కనిపిస్తుంది. దానికి తల్లిదండ్రుల కూడా చేయి దాటిపోతున్నడంటూ కఠినంగ వ్యవహరించడమ మొదలు పెడతారు. దానితో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి దూరం మొదలవుతుంది. ఎవరికీ వాళ్ళు ఎదుటి వల్ల తీరు అంతే మారారు అనుకుంటూ ప్రతీ విషయంలో గొడవ పడటం మొదలవుతుంది. అయితే పిల్లల ఎదుగుదలలో భాగంగా వచ్చే మార్పులో ఇవన్నీ అని తెలిసుకుంటే తల్లిదండ్రులు పిల్లలలో వచ్చే మార్పుకు అంత తీవ్రంగా స్పందించారు అంటున్నారు నిపుణులు.

ఎదురుతిరగటం, తన ఇష్టాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం, స్వంత నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా పిల్లల ఎదుగుదలలో భాగంగా చూడాలి. అయితే పిల్లలు కోరే స్వేచ్చ ఇస్తూనే కొన్ని పరిమితులు విధించాలి. లేకపోతే పిల్లలు దరి తప్పే అవకాశం వుంది. అందుకు ఒకటే మార్గం. పిల్లల పరిమితులు, వారి ప్రవర్తకి సంబందించిన నిబంధనలను వారికీ వివరించాలి. అంటే "నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు కానీ ఈ పరిమితులు మాత్రం దాటకూడదు" అని ముందే వారికీ స్పష్టంగా చెప్పాలి. దానితో పిల్లలకి కూడా ఎంతవరకు తాము స్వేచ్చగా ఉండొచ్చో తెలుస్తుంది. అమ్మ నాన్న తనని కట్టిపడేయటం లేదని అర్ధమవుతుంది.. ఎదుగుతున్నకొద్ది వాళ్ళ స్వంత అభిప్రాయాలను ఇష్టాలను ఏర్పరచుకుంటారు. మనం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపిస్తే వాళ్ళు ఎదురు తిరగరు. ఆత్మ రక్షణగా మాత్రమే పిల్లలు ఎదురు తిగుతుంటారు. అందుకే వారికీ అవకాశం ఇవ్వకుండా వారికీ ఏది చెప్పాలన్న చర్చగా మార్చాలి. అంటే నేను చెబుతాను నువ్వు విను అన్నట్టు కాకుండా.. పిల్లలకి తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ తరవాత వారి అభిప్రాయం తప్పనిపిస్తే ఆలోచించు అని మాత్రమే చెప్పాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఏ విషయమైన అమ్మానాన్నలతో చెప్పటానికి సంశయించారు. పిల్లలని ఈ వయసులో దారిలోకి తేవటానికి ఒక్కటే సిక్రెట్. కమాండింగ్ గా వారికీ ఏది చెప్పకూడదు. కేవలం సూచనా చేస్తున్నట్టు మాత్రమే ఉండాలి. ఈ చిన్న సీక్రెట్ తో పిల్లలు టీనేజ్ జర్నీని సేఫ్ గా, హ్యాపీ గా దాటెయ్యొచ్చు. పిల్లలు తల్లిదండ్రులు కూడా..

- రమ.