డాక్టర్ బాబు ఇంటికి వచ్చి వంట చేసిన వంటలక్క!
on Dec 2, 2022
డాక్టర్ బాబు, వంటలక్క 'కార్తీక దీపం' సీరియల్‌తో ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. ఈ సీరియల్ ఆరేళ్ళ నుంచి సాగుతున్నా కూడా డాక్టర్ బాబు ఒక్క సారి కూడా వంటలక్కను తన ఇంటికి ఇన్వైట్ చేయలేదట. వంటలక్క అన్ని సార్లు అడిగేసరికి ఫైనల్‌గా ఇప్పుడు తన ఇంటికి ఇన్వైట్ చేసాడు. వంటలక్కకు తన ఇల్లంతా తిప్పి చూపించాడు నిరుపమ్. అలాగే తన కుమారుడు రిక్కీ వేసిన పెయింటింగ్స్ చూపించింది నిరుపం భార్య మంజుల. ఇక నిరుపమ్ వాళ్ళ అమ్మ వంటలక్కను చూసి చాలా ఖుషి ఐపోయింది.
ఇక షూటింగ్ సెట్లో వంటలక్క ప్రొడక్షన్ బాయ్ తెచ్చే ఫుడ్‌కి రకరకాల పేర్లు పెడుతుందని బాగా వండేవాళ్లు కూడా ఇలా పేర్లు పెట్టరని అనేసరికి వంటలక్కకు కోపమొచ్చింది. దాంతో "బాగోకపోతే బాగోలేదని చెప్పాలి కదా. మా ఇంట్లో నేనే వంట చేస్తాను" అంది.
"ఐతే ఈరోజు నువ్వు మా ఇంట్లో సాంబార్ పెట్టాలి" అని నిరుపమ్ అనేసరికి, "ఓహ్ ఈ రోజు మీ ఇంట్లో వంట మనిషి రాలేదా.. అందుకే నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేసావా?" అని కౌంటర్ వేసింది. దాంతో అందరూ నవ్వేశారు. ఈ సరదా సరదా వీడియోను నిరుపమ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాడు.
Also Read