శ్రీముఖి ఇంట్లో వండిపెట్టేది...నేను తినేదాన్ని
on Mar 13, 2025
తమన్నా సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు చూసిన తమన్నా సింహాద్రి శ్రీముఖి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా శ్రీముఖి, అవినాష్, తమన్నాసింహాద్రి వీళ్ళే ఎక్కువగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ని కూడా శ్రీముఖి ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవినాష్ కానీ తమన్నా కానీ శ్రీముఖి ఇంటికి వెళ్ళినప్పుడల్లా తానె ఇంట్లో వంట చేసి పెడుతూ ఉంటుంది. ఆ వీడియోస్ ని, రీల్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు తమన్నా సింహాద్రి తెగ ఫీలైపోతోంది. అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అమ్మే చేసిపెట్టేది..కాబట్టి ఎలాంటి శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తాను వంట చేసుకోవాలంటే చాలా బాధగా ఉందని చెప్పింది.
తనకు ఇప్పుడు శ్రీముఖి ఇల్లే గుర్తొస్తోందని చెప్పింది. శ్రీముఖి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ తానె చూసుకునేది అని కావాల్సినవి వండిపెట్టేది అని...హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని అని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు తన ఇంట్లో తాను వాడుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది అంటూ పాపం బాధపడుతూ చెప్పింది. తమన్నా సింహాద్రి బుల్లితెర మీద అడపాదడపా కనిపించేది కానీ ఇప్పుడు అసలు కనిపించడంలేదు. ఇక ఈమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. ఈమె జనసేనలో పని చేసింది. జనసేన తరపున మంగళగిరి సీటు రాకపోయేసరికి ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ఈ విషయంగా ఆమె అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు...ఇక బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది తమన్నా సింహాద్రి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
