'నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి'.. పాట పాడిన సురేఖ
on Aug 16, 2022
సురేఖా వాణి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల ఈమె వార్తల్లో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కూతురికి మందు తాగిస్తూ అనే టైటిల్స్ తో కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతోంది సురేఖా వాణి. తన లైఫ్ లో తన కూతురు అంటే తనకు చాలా ఇష్టం కూడా. సురేఖ వాణి భర్త మరణించాక కూతురే లోకంగా బతుకుతోంది.
ఇటీవల 'నిఖిల్‌తో నాటకాలు' యూట్యూబర్ వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసాడు. సురేఖా వాణి మళ్ళీ పెళ్లి చేసుకోబోతోందా? అనే ప్రశ్నకు "నో" అంటూ సమాధానం ఇచ్చింది. ఐతే ఆమె కూతురు సుప్రీత మాత్రం "ఎస్" అని ఆన్సర్ చేసింది. "సింగిల్ గా ఉంటే నా బుర్ర తింటది. అందుకే ఆమెకు పెళ్లి చేసేద్దాం" అంటూ అల్లరి చేసింది.
మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? అని సుప్రీతని అడిగేసరికి "నన్ను భరించగలిగే వాడు ఐతే చాలు" అంటూ ఆన్సర్ ఇస్తుంది. ఇక సురేఖ.. "సిక్స్ ఫీట్ హైట్ ఉండాలి, అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, లైట్ గా గడ్డం కూడా ఉండాలి" అని ఆన్సర్ ఇచ్చింది. "బిగ్ బాస్ హౌస్ లోకి సురేఖ వాణి వెళ్తున్నారట" అన్న ప్రశ్నకు "నో.. ఏమో తెలీదు" అంటూ తల్లీ కూతుళ్లిద్దరూ ఆన్సర్ ఇచ్చారు.
"సాధారణంగా తనకు కోపం రాదు కానీ ఒకవేళ వస్తే మాత్రం వేరే లెవెల్" అంటూ చెప్పింది సురేఖ వాణి. ఇక సురేఖ, సుప్రీతా కలిసి "నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలేరా" అంటూ సాంగ్ పాడి ఫన్ చేశారు.
Also Read