TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

సుప్రితకి పెళ్ళి చేసుకోవడానికి మంచి వ్యక్తి కావాలంట!

May 15, 2024 12:03PM

 

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విష‌యాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె.  అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి రాకముందే సుప్రిత సోషల్‌ మీడియాలో బాగా ఫేమస్‌. 

తల్లి సురేఖతో తరచూ రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. అంతేకాదు తన గ్లామరస్‌ లుక్‌తోనూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఆమె ట్రోలర్స్‌ నుంచి ట్రోల్స్‌ కూడా ఎదుర్కునేది. అయినా తగ్గేదేలే అంటూ తన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదిక షేర్‌ చేస్తూనే ఉంటుంది.

సుప్రితకి ఇన్ స్టాగ్రామ్ లో 859K ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్ గా అమర్ దీప్ తో కలిసి ఓ షోకి హాజరు అయ్యింది. అందులో యాంకర్ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడగడంతో .. అవి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి. సుప్రిత ఒక్కొసారి ట్రెండీ లుక్‌లో, ఒక్కొసారి ట్రెడిషనల్‌గా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మొత్తానికి ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సుప్రిత తాజాగా చీరలో సుప్రిత అందంగా ముస్తాభైంది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్‌ చేస్తూ.. అలెక్సా, మంచి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సుప్రిత పెళ్లికి రెడీ అయ్యిందా ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రిత సారీ లుక్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి. 

 

google-ad-img