TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

రాజీవ్ వచ్చి అలా నిలబడితే సుమ అంత కసిగా ముద్దు పెట్టేస్తుందట

May 16, 2024 2:12PM

 

సుమ ఎం చేసినా ఎలాంటి డైలాగ్స్ వేసినా ఫుల్ కామెడీగా ఉంటుంది. సుమ అడ్డా షోకి ఎవరొచ్చినా బాగా నవ్విస్తుంది. రీసెంట్ గా సుమ అడ్డా షోకు.. భజే వాయువేగం మూవీ టీం వచ్చింది. ఈ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారి సినిమాను ప్రమోట్ చేస్తూనే గేమ్స్ ఆడింది సుమ. అలాగే విపరీతమైన పంచులు వేసింది. ఇందులో ఒక గేమ్ షోలో మనసులో ఏం ఉందో అని చూపించే ఒక బౌల్ ని తీసుకొచ్చింది. దాని మీద చేతులు పెట్టమని కళ్ళు మూసుకుంటే మనసులో ఉన్న ఇమేజ్ ఎదురుగా స్క్రీన్ మీద కనబడుతుంది.  అయితే ముందుగా దీనిపై నరసింహ చేయి పెట్టించింది .. ఫస్ట్ నైట్ డెకరేషన్ రూంను చూపించారు. దాన్ని చూసిన నరసింహ  ఇదెక్కడ ఉందో చెబితే  వెళ్తాను అని అడిగాడు. దానికి అందరూ నవ్వేశారు.

ఇక ఆ తర్వాత భజే వాయు వేగం మూవీ  హీరో కార్తికేయ చేయి పెట్టాడు. దాంతో బోల్డు మంది అమ్మాయిల బొమ్మలు కనిపించాయి.  చివరికి ఇదే గేమ్ ని సుమతో ఆడించాడు కార్తికేయ. అలా సుమ చేయి పెట్టగానే.. తన కొడుకు రోషన్ కనకాల హీరోగా చేసిన బబుల్ గమ్ సినిమా పోస్టర్ కనిపించింది. అందులో హీరోయిన్ హీరో చెంపను కొరికేస్తూ ఉన్న పిక్ అయ్యేసరికి సుమ షాకైపోయింది.  అయితే అప్పటికప్పుడు రాజీవ్ కనకాలను చూడగానే అలాగే చేస్తారన్నమాట అని చెప్పేసరికి సుమ తెగ సిగ్గుపిడపోతూ కాదని చేయి ఊపింది. ఇక్క అక్కడ అందరూ నవ్వేశారు.

 

google-ad-img