నేను చేసిన తప్పే నా కూతురు చేత చేయించలేను!
on Oct 7, 2022
శ్రీవాణి సోషల్ మీడియాలో వెరైటీ వెరైటీ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూ అందరికీ ఎంతో కొంత ఫన్ ని, కొంత జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీవాణి తన కూతురు నందినికి బట్టలు ఉతకడం నేర్పించింది. "చదివేది నైన్త్ క్లాస్.. స్కూల్ యూనిఫామ్, బాడ్మింటన్ యూనిఫామ్ ఉతుకు అని పనులు పురమాయిస్తుంది కానీ తాను చేసుకోవడానికి అస్సలు ఇంటరెస్ట్ ఉండదు" అంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్న కూతురిని పనిమాలా పిలిచి కూర్చోబెట్టి స్టెప్ బై స్టెప్ బట్టలు ఉతికే ప్రాసెస్ నేర్పించింది.
"ఏంటమ్మా ఇలా బట్టలు ఉతికితే పనిదాన్ని అనుకుంటారు" అనేసరికి, పనిదానివి అనుకోరు పనిమంతురాలు అనుకుంటారు" అని కరెక్షన్ చేసింది శ్రీవాణి. "జెనెరేషన్స్ మారుతున్నాయి నన్ను పని చేయమంటున్నావ్ ఏమిటి?" అని నందిని సీరియస్ అయ్యింది. "జెనరేషన్స్ మారినా యూనిఫామ్ మారదు కదా. చిన్నప్పుడు నా డ్రెస్సులు నేనే ఉతుక్కుని నా సాక్స్, షూస్ అన్ని రెడీ చూసుకునేదాన్ని. చిన్నప్పటినుంచి నీ చేత పని చేయించక ఇలా అయ్యావ్. ఇప్పటికైనా ఆ తప్పు నేను చేయను, నీకు అన్ని పనులు నేర్పిస్తా" అనేసరికి బిక్కమొహం వేసింది నందిని.
"ఇలాంటి పనులు చేసుకుంటే పొట్టలు రావు వర్కౌట్లు చేయక్కర్లేదు" అని కూతురికి హితబోధ చేసింది శ్రీవాణి. "ఎక్కడికి వెళ్లినా ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అవకుండా ముందు మాన్యువల్ గా నేర్చేసుకుంటే తర్వాత పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు.. అందుకే నందినికి అన్ని పనులు నేర్పిస్తున్నా" అంది శ్రీవాణి.
Also Read