
బుల్లితెర మీద శ్రీముఖి ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. చాలా షోస్ కి ఈమె హోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కొన్ని మూవీస్ లో కూడా నటించింది కూడా. జులాయి, జెంటిల్మన్, ప్రేమ ఇష్క్ కాదల్ , నేను శైలజ వంటి మూవీస్ లో నటించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళొచ్చింది. ఇక ఇప్పుడు "మా ఇంటి బంగారం" అనే మూవీలో నటిస్తోంది. ఐతే అందులో తనతో కలిసి నటించిన అలనాటి లేడీ కమెడియన్ కారు మేఘాలు బస్సు మేఘాలు అంటూ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేసిన నటి.

ఇక శ్రీముఖి ఆమెతో కలిసి చేసిన చిన్న రీల్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. "నాతో పాటు ఎవరున్నారో చూపించినా నా పేరుతో మ్యాచ్ అయ్యే పేరు అరటిపండు లంబ లంబ శ్రీలక్ష్మి గారు" అనేసరికి ఆవిడ కూడా దణ్ణం పెట్టి మాట్లాడారు. "నా క్యూటీ పై . మా ఇంటి బంగారం సెట్ లో నేను అందరికంటే ఎక్కువగా ఈవిడతోనే కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉంటా ఎంత మంచిగా, ముద్దుగా ఉంటారో..ఐ లవ్ యు " అని శ్రీముఖి ఆవిడని వర్ణించింది.
"నిజమే..నువ్వు ముద్దుగా ఉన్నావమ్మా నేనేముంది. నీ మనసు మంచిది. ఐ లవ్ యు టూ" అని చెప్పారు శ్రీలక్ష్మి. "నువ్వు నిజంగా మా ఇంటి బంగారానివి అంటే కాదు నువ్వే నిజంగా మా ఇంటి బంగారానివి అనుకున్నారు ఇద్దరూ. ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్ ఈ మూవీ షూటింగ్ అని శ్రీముఖి అడిగేసరికి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నా.. సినిమా ఐపోవస్తోంది అంటేనే అదొకలాంటి ఫీలింగ్ వస్తోంది. బాధగా ఉంది అని చెప్పారు . ఈ రోజు సాంగ్ షూటింగ్ లో ఉన్నాము. మా బామ్మా శ్రీలక్ష్మి కూడా డాన్స్ చేశారు అని చిన్న స్టెప్స్ వేయించింది శ్రీముఖి.




.webp)
