'జబర్దస్త్'కి మనో కూడా హ్యాండ్ ఇచ్చినట్టే?
on Aug 2, 2022
జబర్దస్త్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకప్పుడు టాప్ రేటింగ్ సంపాదించుకున్న ఈ షో ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ స్టేజి మీద నుంచి కమెడియన్స్, యాంకర్స్, జడ్జెస్ ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నప్పుడల్లా వచ్చే వారం నుంచి అసలు జబర్దస్త్ ఉంటుందా.. ఉండదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆడియన్స్ నుంచి. ఇక ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇందులో ఊహించని విషయం ఏమిటి అంటే జడ్జిగా వ్యవహరిస్తున్న మనో గారు మాత్రం కనిపించలేదు. రాబోయే ఎపిసోడ్ లో మనో గారి ప్లేస్ లో నటి సంగీత కనిపించబోతోంది. చలాకి చంటి, సునామి సుధాకర్ స్కిట్ లో మనో గారిపై ఒక సెటైర్ కూడా పేలింది. "ఈ వారం మనో గారు లేరేమిటి?" అని చంటిని అడుగుతాడు సుధాకర్. "సంగీతం తెలిసిన మనో గారే ఆ స్టేజి మీద ఉంటే ఈ స్టేజి కళకళలాడిపోయేది. అలాంటిది సంగీతనే తీసుకొచ్చి స్టేజి మీద కూర్చోబెట్టారు. ఇంతకంటే ఏం కావాలి" అంటాడు చంటి.
ఇదంతా చూసేసరికి సింగర్, జడ్జి మనో కూడా ఈ షోని వదిలేసి వెళ్ళిపోతున్నారేమో అనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. కొంతకాలం క్రితం వరకు అన్ని ఎపిసోడ్స్ లో మనో కనిపించేవారు కానీ ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. ఇవన్నీ చూసాక సింగర్ మనో కూడా ఈ షోకి దూరమైపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. జడ్జెస్ ఇలా ఒక్కొక్కరిగా వెళ్లిపోతుంటే కొత్త జడ్జెస్ ని వెతికి తీసుకురావడం మల్లెమాలకు పెద్ద ప్రహసనంగా మారిపోయింది.