బీఎండబ్ల్యూ కారు కొన్న షన్ను!
on Oct 6, 2022
షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. యూట్యూబ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ పేరు సంపాదించాడు. ఇలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న టైంలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ ఆటిట్యూడ్ వలన తన ప్రేమికురాలు దీప్తి దూరమైపోయింది.
ఇకపోతే లేటెస్ట్ గా షన్ను వాళ్ళ అమ్మానాన్నతో కలిసి ఖరీదైన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కి చెందిన కారును కొన్నాడు. ఈ కారు మీద కూర్చుని 'బాస్' అన్న టీషర్ట్ వేసుకుని దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కార్ ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ పేజీ లో షేర్ చేసాడు షన్ను. "ఇదంతా ఒక డ్రీమ్ లా ఉంది. నా ఫామిలీ తర్వాత నన్ను ఈ పొజిషన్లో చూడాలనుకున్న మీరే.. ఇది మన కార్..ఎప్పుడు కనిపించిన ఆపండి.. లిఫ్ట్ ఇస్తా ఇది పక్కా" అని ఒక టాగ్ లైన్ పెట్టాడు. ఇక ఫాన్స్ అందరూ కూడా షన్నుని విష్ చేస్తూ మెసేజెస్ పెట్టారు.