బిగ్ బాస్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్!
on Dec 4, 2022
బిగ్ బాస్ లో నిన్న మొన్నటి దాకా సాగిన ఫ్యామీలి వీక్ టాస్క్ అత్యంత ఆదరణ పొందింది అనే విషయం తెలిసిందే. రేవంత్ వాళ్ళ భార్య అన్విత బిగ్ బాస్ టీవిలో కనిపించింది. "బాగా ఆడు ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. హైపర్ అవ్వకు" అని చెప్పింది. అలా అన్విత చెప్పినప్పటి నుండి ఎమోషనల్ అవ్వకుండా కంట్రోల్ లో ఉంటూ వస్తోన్నాడు రేవంత్. మొన్న జరిగిన టాస్క్ లో కూడా హైపర్ అవ్వకుండా నార్మల్ గా ఉన్నాడు. హౌస్ లో ఇప్పటికి అయితే ఏ గొడవలు లేకుండా ఉంటూ వస్తున్నాడు రేవంత్.
కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో మోస్ట్ హార్ట్ టచింగ్ సీన్ జరిగింది. ఒక సర్ ప్రైజ్ ఉంది అని నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పాడు. అదేంటంటే రేవంత్ పాపని టీవీలో చూపించాడు. అందులో తన పాపని చూస్తూ రేవంత్ కంటతడిపెట్టుకున్నాడు. హౌస్ మేట్స్ అంతా ఓ అంటూ అరుస్తూ తమ సంతోషాన్ని తెలిపారు. టీవీలో తన పాపని చూస్తూ రేవంత్ మురిసిపోయాడు. కన్నీళ్ళు వస్తున్నా ఆపుకుంటూ ఉండగా, "ఏడ్చేయ్ రేవంత్" అని నాగార్జున అన్నాడు. "లేదు సర్.. ఏడ్వనని అన్వితకి మాట ఇచ్చాను సర్" అని రేవంత్ అన్నాడు. "లక్ష్మీదేవి పుట్టింది .. ఎప్పుడు పుట్టిందో? తారీఖు చెప్పండి సర్" అని నాగార్జున తో అన్నాడు. ఆ తర్వాత "లవ్ యూ.. లవ్ యూ అన్విత. అసలు ఈ టైంలో నేను నీ పక్కన ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నాను. ఏదైనా మన మంచికే, అంతా మంచే జరుగుతుంది" అని రేవంత్ అన్నాడు.
Also Read