మోర్ రెమ్యూనరేషన్.. ఫుల్ ఫ్రీడమ్.. అందుకే షోని వీడిన అనసూయ!
on Aug 2, 2022
జబర్దస్త్ నుంచి హోస్ట్ అనసూయ వెళ్ళిపోయింది. ఆమె ప్లేస్ లో కొత్త యాంకర్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. అనసూయ స్టార్ మాలో జాయిన్ ఐన కారణంగా జబర్దస్త్ నుంచి తప్పుకున్నట్లు అధికారికంగా చెప్పింది. ఐతే ఇప్పుడు అనసూయ షో నుంచి వెళ్లిపోవడానికి తక్కువ పారితోషికం వల్లనే షోని వీడిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ ఒక్క రోజు షోకి 3 లక్షల పారితోషికం వచ్చేది. స్టార్ మాలో ఇప్పుడు చేస్తున్నందుకు 5 లక్షలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక స్టార్ మాలో చేసే షోస్ కి డేట్ల విషయంలో అనసూయకి ఫుల్ ఫ్రీడమ్ ఉందట. ఆమె ఇష్టమైన సమయంలో వచ్చి షో చేసుకుని వెళ్లే అవకాశాన్ని కల్పించింది. ఇన్ని అవకాశాలు ఉండేసరికి అనసూయ జబర్దస్త్ ని వీడిందనే మరో టాక్ కూడా హల్చల్ చేస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నుంచి కేవలం పారితోషికం కోసమే అనసూయ మారింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గతంలో తాను మూవీస్ లో నటించాలని అనుకుంది కాబట్టి జబర్దస్త్ ని వీడుతున్నట్లుగా ప్రకటించింది అనసూయ. ఐతే ఇప్పుడు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ, సుడిగాలి సుధీర్ వెళ్లిపోయారు. అనసూయ ఇక కనిపించదు కాబట్టి లేటెస్ట్ జబర్దస్త్ కి ఎవరు వస్తారు, రేటింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.