TeluguOne App Promotion
● # Tweets

Home

»

టీవీ

Priyanka Jain: తడిచీరలో సెగలు పుట్టిస్తున్న ప్రియాంక  జైన్... తన అందాలతో వీడియో వైరల్!

May 31, 2024 11:17AM

 

సోషల్ మీడియాలో మాములుగానే సెలబ్రిటీల ఫోటోల కోసం కొంతమంది నెటిజన్లు చూస్తుంటారు. అంతకముందు ఒకరో.. ఇద్దరు భామలు.‌. తమ హాట్ ట్రీట్ తో సోషల్ మీడియాని షేక్ చేయగా ప్రస్తుతం.. సాధరణంగా కనపడే కొంతమంది అమ్మాయిలు అందాల ఆరబోత ఇస్తూ నెట్టింట సెగ పుట్టిస్తున్నారు‌. అలా ప్రియాంక జైన్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ప్రియాంక జైన్ సంప్రదాయంగా, పద్దతిగా కనిపిస్తుంటుంది. అయితే బిగ్ బాస్ లో గ్లామర్ షోతో ఆడియన్స్ కు షాకిచ్చింది. హౌస్ లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కన్పించగా.. తన గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి‌. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి తన అందచందాలతో ఆడియన్స్ కు ట్రీట్  ఇచ్చింది. తను ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పర్పుల్ కలర్ చీరలో.. తడిసిన అందాలను చూపిస్తూ సెగ పుట్టించేస్తోంది. పైగా ఈ వీడియోకి.. ఆర్టిస్ట్‌గా నాలోని భిన్నమైన షేడ్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అయితే సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సైతం ఈ వీడియోకి హాట్ ఈమోజీలని కామెంట్లుగా పెట్టేస్తున్నారు. ఇలా సెలెబ్రిటీలే కామెంట్లు చేయగా సాధరణంగా ఇన్ స్టాగ్రామ్ చూసే వీక్షకుల కామెంట్లు ఎలా ఉంటాయో తెలిసిందేగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.  హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు.  ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్.‌ అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.
 

google-ad-img