Home

»

Tv News

Podharillu : చక్రి ఓవర్ యాక్షన్ తో కన్నా లవ్ ఫెయిల్.. శైలు మాటలకు షాక్ లో పెద్ది!

Aug 27, 2026 9:42AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 192 లో.....చక్రి కలర్ ఫుల్ గా ముస్తాబై రావడంతో ఇంట్లో అంతా పొగడ్తలు మొదలవుతాయి. మాధవ్ భలే ఉన్నావ్ రా అంటే బాగుంది, ఇప్పుడు దారిలోకి వచ్చావని మహా అంటుంది. పగటి వేషగాడ్ని ఎవరు రానిచ్చారని కేశవ కౌంటర్ వేస్తాడు. పగటి వేషగాడిలా ఉన్నానా  అంటే హీరోలా ఉన్నావ్ రా అని కవర్ చేస్తాడు. ఇదే టైమ్ లో మహా ఫోన్ కి విక్కీ కాల్ చేస్తే చక్రి లిఫ్ట్ చేసి లక్కీకి జ్వరం వచ్చింది. రెస్ట్ తీసుకుంటోంది.. మీరు నిన్న వచ్చారు కాబట్టే జ్వరం వచ్చింది.. ఇంక ఈ మ్యాటర్ గురించి మహాలక్ష్మీని అడగకండి అని వార్నింగ్ ఇచ్చి కట్ చేస్తాడు.

 

మరోవైపు కన్నా, మహాను తొందరపెడుతూ అందరి ముందు చెప్పలేనని రూంలోకి తీసుకెళ్లి బస్టాప్ లో తన కోసం అమ్మాయిలు ఎదురుచూస్తున్నారని సీక్రెట్ చెప్తాడు. ఆ మాటలు చక్రి వినేస్తాడు. భార్య మాటలు వినడం తప్పు అని పెద్ది చెప్పినా.. నా భార్య మాటలు వినే హక్కు నాకు లేదా అని చక్రి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కన్నాను.. బస్టాండ్, అమ్మాయిలు అంటూ ఆటపట్టిస్తాడు చక్రి. తను కూడా వస్తానని చక్రి పట్టుబట్టడంతో నువ్వు వస్తే రౌడీ అనుకుని పారిపోతారని కన్నా అంటాడు ‌నీకు ఆంటీలు కావాలి కదా అని మహా వారించినా  చక్రి వినడు.

కన్నా, మహా బస్టాప్ కి వెళ్లేలోపే చక్రి అక్కడికి చేరుకుని కావాలనే మహాను ఉడికిస్తాడు. రేయ్ కన్నా ఏ అమ్మాయిని నువ్వు కన్ఫర్మ్ చేసుకో, మిగిలిన అమ్మాయిని నేను చూసుకుంటానంటూ చక్రి రెచ్చగొడతాడు. ఇద్దరు అమ్మాయిలు రాగానే కన్నా సిగ్గుపడుతుంటే ఇద్దరూ భలే ఉన్నారు అంటూ చక్రి ఓవర్ చేస్తాడు. దీంతో ఆ అమ్మాయిలు.. వీడు అన్నని, అందరినీ పట్టుకొచ్చాడు, భయంగా ఉంది అని అనుకుని, ఫోటోలు తీసుకుని చక్రి ముందుకు రాగానే ఆటో ఎక్కి వెళ్లిపోతారు. చక్రి చేసిన హడావిడికి కన్నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది.

 

ఇక ఎపిసోడ్ చివర్లో శైలు ఎమోషనల్ ట్రాక్ మొదలవుతుంది. ఆ ముంగీస గాడు తాళి కట్టమంటే కట్టడం లేదు..  వాళ్ల అన్నకి పెళ్లి అయితేనే చేసుకుంటానంటున్నాడని రోడ్డు మీద బాధపడుతూ వెళ్తున్న శైలుకి సైకిల్ మీద పెద్ది కనిపిస్తాడు. మా ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరిగింది, పరువు హత్యలు జరుగుతాయేమోనని భయంగా ఉందని శైలు తన గోడు వెళ్లబోసుకుంటుంది. మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మీరు చేసుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది.. మా సంతోషం మీ చేతుల్లోనే ఉందని పెద్దిని శైలు నిలదీయడంతో పెద్ది షాక్ అయి ఆలోచనలో పడతాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com