పంచాయతీ మళ్ళీ షురూ.. 28న తేలిపోనుంది!
on May 4, 2024
ఎస్ .. గట్టిగా కొట్టబోతున్నాం.. పంచాయతి రాబోతుంది. ఓటీటీ ప్రేక్షకులకి తీపికబురు వచ్చేసింది. హిందీ వెబ్ సిరీస్ లలో మస్త్ క్రేజ్ తెచ్చుకున్న సిరీస్ " పంచాయత్" . ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు వచ్చాయి. ప్రతీ సీజన్ సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సిరీస్ మేకర్స్ " పంచాయత్-3 " విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 28న స్ట్రీమింగ్ అవ్వనుంది. దానికి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ సిరీస్ అప్డేట్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. " ఐ ఆమ్ వెయిటింగ్ " అంటు కొందరు.. " ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలా " అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు.. ఆ మీర్జాపుర్-3 అప్డేట్ కూడా చెప్పండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభిషేక్ త్రిపాఠి ఉద్యోగ అవకాశాలు లేక ఓ మారుమూల గ్రామంలో పంచాయితీ సెక్రటరీగా విధుల్లోకి చేరతాడు. అక్కడ అతనికి ఎదురైన సవాళ్ళేంటనేది ఈ సిరీస్. ఈ సిరీస్ లో అబిషేక్ త్రిపాఠిగా చేసిన జితేంద్రకుమార్ కి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీపక్ కుమార్ మిశ్రా ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ డ్రామా సిరీస్ కి అత్యధిక వీక్షకాధరణ పొందిన వెబ్ సిరీస్ లలో ఒకటిగా రికార్డు ఉంది. సీజన్-3 అప్డేట్ రిలీజ్ చేయడంతో ఓటీటీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read