.webp)
బుల్లితెర మీద ముక్కు అవినాష్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఇక అవినాష్ - అనూజా కలిసి వాళ్ళ అబ్బాయి అద్వైత్ ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని చాల గ్రాండ్ గా చేశారు. ఆ వీడియో టేస్టీ తేజ, అమరదీప్ కలిసి వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేశారు. ఐతే ఈ వీడియోని పోస్ట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు టేస్టీ తేజ...ఎక్కడా నవ్వితే పిల్లలు ఏడుస్తారా ఇక్కడ ఏడ్చాడు చూడండి అంటూ అవినాష్ వాళ్ళ అబ్బాయి తేజ నవ్వుకు గట్టిగా ఏడవడాన్ని ఆ వీడియోలో చూపించాడు. నన్ను చూస్తే ఏడుస్తారని తెలుసు కానీ నా నవ్వుకు కూడా ఏడుస్తారని ఫస్ట్ టైం తెలిసింది. ఇక అవినాష్ అన్న దొబ్బెయ్ అన్నాడు అసలు ఎక్కడికి వెళ్ళాము అంటే అవినాష్ అన్న వాళ్ళ అబ్బాయి అద్వైత్ ఫస్ట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి వచ్చాము. వీళ్ళెవరూ గిఫ్ట్ లు తెలీదు నేనే తీసుకెళ్లా... ఆ గిఫ్ట్ నాది కాదు యాష్మి పాపాయిది. అందుకే యష్మికి ఇచ్చేసి నీ గిఫ్ట్ నువ్వే ఇవ్వమ్మా అన్నాను. తనే ఇచ్చింది. ఐతే ఆ పిల్లాడు మాత్రం ఆ గిఫ్ట్ అవసరం లేదు నా గిఫ్ట్ నాకు ఇవ్వు అన్నాడు అందుకే వాడిది వాడికి ఇచ్చేసాను ఇంకా అందరం కలిసి ఫోటో దిగుదాం కదా అని ఫోటోగ్రాఫర్ స్మైల్ అన్నాడు దాంతో వాడు ఏడ్చేశాడు. అవినాష్ వెళ్ళిపోమనేసరికి వచ్చి అమరదీప్ పక్కన దాక్కున్నా అని చెప్పాడు టేస్టీ తేజ. చూడండి యాష్మి బుజ్జగించగానే ఏడుపు ఆపేసాడు వీడివి అచ్చం అవినాష్ అన్న పోలికలే.





.webp)
