అమ్మీ..నువ్ లేకుండా ఎలా బతకాలి నేను
on Aug 8, 2022
మెహబూబ్ అనే పేరు బిగ్ బాస్ కి ముందు పెద్దగా తెలియకపోయినా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక చాలా ఫేమస్ అయ్యింది. షార్ట్ ఫిలిమ్స్ తో, ఆల్బం సాంగ్స్ తో మస్త్ పాపులర్ కూడా అయ్యాడు. అప్పుడప్పుడు టీవీ షోస్ లో కనిపిస్తూ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటాడు మెహబూబ్. రీసెంట్ గా మెహబూబ్ ఇంట్లో విషాదం నెలకొంది. మెహబూబ్ తల్లి మరణించింది. తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ తాను దిగిన ఫోటోని, తన తల్లితో కలిసి దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసి చాలా బాధతో కూడిన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మెహబూబ్.
"అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావ్. ఇప్పటినుంచి నేను ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి ? అసలు నువ్వు లేకుండా నేను ఎలా బతకాలో అర్థం కావడం లేదు. నా ప్రతి ప్రయాణంలో తోడు ఉన్నావు. నా ఎదుగులను చూసి నువ్వు ఆనందించావు. ఇప్పుడు నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. నేను ప్రతీక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అమ్మీ. నాకు అసలు జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తూనే ఉంటావని నీ ఆశీర్వాదాలు అందిస్తావని నాకు తెలుసు.
ఇకనుంచి నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను. తమ్ముడిని, డాడీని బాగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అమ్మీ. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను ” అంటూ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్స్ , మెహబూబ్ ఫ్యాన్స్, పలువురు యూట్యూబర్స్ ఆమెకు నివాళి అర్పించారు. అతను బాధపడకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.