Home

»

Tv News

Podharillu : మహాకు ఆది షాక్.. ఐడెంటిటీ కార్డు కోసం తిప్పలు! హారిక ప్లాన్‌ను చిత్తు చేసిన అన్నయ్య!

Apr 18, 2026 10:41AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu).  ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -95 లో.....మహాకి వాళ్ళ వదిన ఆధార్ నెంబర్ పంపడంతో మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలని చక్రి దగ్గరికి మహా వెళ్తుంది. ఇక  ఇద్దరు కలిసి  ఆధార్ డౌన్లోడ్ కి  వెళ్తారు.  ఆధార్ డౌన్లోడ్ కావాలంటే  మీ ఫోన్ కి ఓటిపి వస్తుందని అక్కడ పనిచేసే అతను  అంటాడు . నాకు  మొబైల్ లేదని మహా అంటుంది. మరి డౌన్లోడ్ చెయ్యరాదని అతను అనగానే మహా డిస్సపాయింట్ గా బయటకు వస్తుంది. ఆ తర్వాత హారిక దగ్గరికి ఆది వచ్చి.. ఈ మధ్య నాకు తెలియకుండా చాలానే చేస్తున్నావని అంటాడు. నువ్వు  దానికి ఆధార్ నెంబర్ పంపించావ్.. నేను చూసాను.. అందుకే నేను  మళ్ళీ ఆధార్ నెంబర్ చేంజ్ చేసి నీది ఇచ్చానని ఆది అనగానే హారిక షాక్ అవుతుంది.

అది మనల్ని వద్దని వెళ్ళింది.. దానికి ఇవన్నీ నువ్వు పంపించడం అవసరమా అని హారికపై  ఆది కోప్పడతాడు. మరి తను  కాలేజీకి  వస్తే మీరెందుకు  వెళ్లి గొడవపడ్డారని హారిక అడుగుతుంది. ఇంకొకసారి ఇలా చేస్తే బాగోదని ఆది వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మహా తన నెంబర్ కి కాల్ చేస్తుంది. ఎవరో తాగుబోతు మాట్లాడి మహాకి చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత మహాకి హారిక ఫోన్ చేసి... నేను నీకు పంపింది నీ ఆధార్ కాదు నాది అని జరిగింది మొత్తం చెప్తుంది. మహాకి ఇంకా కోపం వస్తుంది. ఆ విషయం చక్రికి చెప్తుంది మహా.

మరొకవైపు మాధవ ఫోటో చూస్తూ గాయత్రి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత మహా కొత్త ఆధార్ అప్లై చెయ్యడానికి చక్రిని  తీసుకొని వెళ్తుంది. అక్కడ ఏదైనా ప్రూఫ్ కావాలని  అతను అంటాడు. దాంతో   మహా మళ్ళీ డిస్సపాయింట్  అవుతుంది. ఇక అదంతా లాభం లేదు.. పాత నంబర్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకొవాలని వెళ్తారు. అక్కడ సిమ్ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ పేరు మీద ఉంటుంది. అది బ్లాక్ చెయ్యడానికి అయన కావాలని వాళ్ళు అంటారు. దాంతో మహాకి ఇంకా కోపం వచ్చి.. నాకేం అవసరం లేదని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com