Home

»

Tv News

నేను ఒకళ్ళతో లివింగ్ రిలేషన్‌లో ఉన్నాను... ఒక మిస్టేక్  జరిగింది!

Apr 24, 2026

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ప్రేమ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక హార్ట్ సింబల్ లో గులాబీ రేకులు అమరుస్తూ తొలి పరిచయం , తొలి అనుభూతి, మొదటిసారి చూసినప్పుడు ఎం అనిపించింది , మీ మొదటి మాటలు,  ఇన్ని కోట్లమంది ఉన్నా ఈ లైఫ్ పార్టనర్ నే  ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాలు మాట్లాడాలని చెప్పాడు. ఇక నటరాజ్ మాష్టర్ - నీతూ జోడి వచ్చి వాళ్ళ లవ్ స్టోరీని చెప్పారు. ఐతే నీతూ సిగ్గుపడిపోయి చెప్పలేకపోయింది. ఇక నటరాజ్ మాష్టర్ మొత్తం చెప్పాడు. "ఒక ఛానెల్ లో డాన్స్ షో నడుస్తోంది. నేను సెలక్షన్ ప్యానెల్ లో ఉన్నా. ఒక్కొక్కరు వచ్చి పెర్ఫార్మ్ చేస్తున్నారు. నాయనా అని రాసి ఉంది . అబ్బాయి వస్తాడేమో అనుకున్నా తీరా చూస్తే పింక్ డ్రెస్ వేసుకుని పింక్ లిప్స్ తో తెల్లటి ముఖంతో ఉన్న అమ్మాయి వచ్చింది. ఈ  అమ్మాయేదో  బాగుంది అనిపించింది. తర్వాత వేరే షోలో డాన్స్ పెర్ఫెర్మెన్సు ఉంది అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడించింది. ఆ తర్వాత పెర్ఫార్మెన్స్  చేయడానికి రెడీ అవుతుంటే నీతూ రాలేదు వెళ్లి చూస్తే చీర కట్టుకోవడం రాక అలాగే ఉండిపోయింది. దాంతో నేనే చీర కట్టేసాను.. ఆమె షాకైపోయింది. అలా  మేమిద్దరం కలిసి పెర్ఫార్మ్ చేసాం. ఒక బేకరీకి తీసుకెళ్లి చెప్పాను ఆమె అంటే ఎంత ఇష్టమో. ఆమె చాలా అమాయకంగా ఉండేది.  అలాంటి నన్ను ఒక ఏడేళ్లు మాట్లాడకపోయినా మళ్ళీ కలిసినప్పుడు  అదే ప్రేమతో నాతో మాట్లాడింది. నేను ఒకళ్ళతో లివింగ్  రిలేషన్ లో ఉన్నాను. అది ఆమెకు తెలుసు.

మళ్ళీ నేను రెండో సారి వచ్చినా కూడా నా మీద  అదే ప్రేమతో చూసేది. ఒక టైములో ఒక అమ్మాయితో హార్ష్ గా మాట్లాడి తర్వాత నేను నీతూకు కనెక్ట్ అయ్యాను. తర్వాత పెళ్లయ్యింది. ఆ తర్వాత కూడా ఒక మిస్టేక్  జరిగింది. ఐనా కూడా నన్ను యాక్సెప్ట్ చేసింది. ఇలాంటి మూర్కుడికి ఇలాంటి అదృష్టం ఎలా దొరుకుతుంది. నా గురించి ఇన్ని తెలిసినా నన్ను ఇలా ప్రేమించే అమ్మాయి దొరకడం ఇలాంటి భార్య దొరకడం అదృష్టం" అని చెప్పాడు నటరాజ్ మాష్టర్.

"నేను ఆయన్ని ప్యానెల్ లో చూసినప్పుడు ఉంగరాల జుట్టు, బుగ్గ మీద సొట్ట చూసి ఆయన్నే నా భర్త అని అనుకున్నా . మా అమ్మతో ఎన్ని సార్లో దెబ్బలు తిన్నాను. మా అమ్మ నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేసింది. చాలా గొడవలు అయ్యాయి. ఐనా కూడా నేను ఈయనే కావాలని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాను " అని చెప్పింది నీతూ.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com